Jump to content

ఇరివెంటి కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
ఇరివెంటి కృష్ణమూర్తి
ఇరివెంటి కృష్ణమూర్తి
జననం(1930-07-12)1930 జూలై 12
మరణం1989 ఏప్రిల్ 26(1989-04-26) (వయసు 58)
వృత్తికథకుడు, సాహిత్యవేత్త

తెలంగాణా ప్రాంతానికి చెందిన తొలితరం కథకులలో ఇరివెంటి కృష్ణమూర్తి (1930 - 1989) ఒకడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు పాలమూరు జిల్లాలో 1930, జూలై 12 నాడు జన్మించాడు.[1] 'యువభారతి' సాహిత్య సంస్థను తీర్చిదిద్ది 20 ఏళ్లపాటు నిర్వహించాడు. ఈ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేశాడు. చిన్ననాడే నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకెళ్లాడు. కారాగార శిక్ష అనుభవించాడు. యువభారతి సంస్థకు అధ్యక్షుడిగా ఉండి తెలంగాణలో సాహిత్య వికాసానికి కృషి సల్పినాడు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు(నడు తెలంగాణ సారస్వత పరిషత్తు) కార్యదర్శిగా ఉంటూ సాహిత్య లోకానికి ఎనలేని సేవలు చేశాడు. సంస్కృతాంధ్ర భాషా సాహిత్యంలో కాకుండా ఉర్దూ భాషా సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేశాడు. హిందీ, ఇంగ్లీషు భాషా నైపుణ్యాలు కూడా ఉండేవి. నిజాం కళాశాలలో డిగ్రీ చదువుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సి.నారాయణ రెడ్డి పర్యవేక్షణలో కవిసమయములు అనే అంశం మీద పరిశోధించి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు.ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యాడు. 1989 ఏప్రిల్ 26వ తేదీన మరణించాడు.[2]

సాహితీసేవ

[మార్చు]

ఇతడు పాలమూరు జిల్లా మాండలికంతోపాటు కరీంనగర్‌ జిల్లా మాండలికంలో కూడా కథలు రాశాడు.తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక సంస్థల కార్యకలాపాలకు విశేష సేవలందించాడు. కథలు, కవితలు, వ్యాసాలు, పీఠికలు, సమీక్షలు రచించాడు.

రచనలు

[మార్చు]
  1. వెలుగు చూపే తెలుగుపద్యాలు (బాలసాహిత్యం) [3]
  2. దేశమును ప్రేమించుమన్నా (బాలసాహిత్యం) [4]
  3. లక్ష్మణుడు[5] (బాలసాహిత్యం)
  4. వీచికలు[6] (కవితాసంకలనం - మరో ముగ్గురు కవులతో కలిసి)
  5. కవిసమయములు[7]
  6. దశరూపక సందర్శనం
  7. భావన[8] (సుభాషితాల సంకలనం)
  8. ఇరివెంటి వ్యాసాలు
  9. ఇరివెంటి రచనలు
  10. వాగ్భూషణమ్‌
  11. వేగుచుక్కలు
  12. వెలుగు బాటలు

మూలాలు

[మార్చు]
  1. ఎడిటర్, సంస్కృతి (2013-08-25). "తెలంగాణ తొలి తరం కథకుడు". ఆంధ్రప్రభ దినపత్రిక. No. ఆదివారం. Retrieved 3 December 2014.[permanent dead link]
  2. మెంతబోయిన సైదులు (12 November 2001). "వెలుగు చూపిన తెలుగు కవి". మనం దినపత్రిక. Archived from the original on 14 జూలై 2018. Retrieved 15 July 2018.
  3. ఇరివెంటి, కృష్ణమూర్తి (1 ఆగస్టు 1983). వెలుగుచూపే తెలుగు పద్యాలు. హైదరాబాదు: యువభారతి.{{cite book}}: CS1 maint: date and year (link)
  4. ఇరివెంటి, కృష్ణమూర్తి (2010-08-15). దేశమును ప్రేమించుమన్నా (7 ed.). హైదరాబాదు: యువభారతి.
  5. ఇరివెంటి, కృష్ణమూర్తి (1985). లక్ష్మణుడు (1 ed.). తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు.
  6. ఇరివెంటి, కృష్ణమూర్తి (అక్టోబరు 1968). వీచికలు (1 ed.). సికిందరాబాదు: యువభారతి.
  7. ఇరివెంటి, కృష్ణమూర్తి (1987). కవిసమయములు (1 ed.). సికిందరాబాదు: యువభారతి.
  8. ఇరివెంటి, కృష్ణమూర్తి. "భావన". ఎ.వి.కె.ఎఫ్.బుక్‌లింక్స్.