కె.పి. లక్ష్మినరసింహ
![]() | ఈ వ్యాసంలో ఒకటి కంటే ఎక్కువ సమస్యలున్నాయి. దీన్ని మెరుగుపరచడంలో తోడ్పడండి. లేదా ఈ సమస్యల గురించి చర్చ పేజీలో చర్చించండి. (ఈ మూస సందేశాలను తీసెయ్యడం ఎలాగో తెలుసుకోండి)
|
కె.పి. లక్ష్మినరసింహ | |
---|---|
జననం | కె.పి. లక్ష్మినరసింహ |
నివాస ప్రాంతం | మహబూబ్ నగర్ |
ప్రసిద్ధి | కవి |
కె.పి. లక్ష్మినరసింహ పాలమూరు జిల్లాకు చెందిన వర్ధమాన కవి. రైతు కుటుంబంలో జన్మించాడు. పాఠశాల విద్యను పూర్తి చేయకుండానే చదువు ఆపేశాడు. ప్రైవేట్‌గా పదవ తరగతి రాసి, పాసయ్యాడు. ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం పిజి దాకా కొనసాగించాడు. ఆ క్రమంలోనే కవిత్వం రాయడం మొదలు పెట్టాడు.
కుటుంబ నేపథ్యం[మార్చు]
కె.పి. లక్ష్మీనరసింహ మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందినవాడు. తండ్రి పోచయ్య, తల్లి కొండమ్మ. ఈ దంపతులకు ఏడో సంతానం లక్ష్మీనరసింహ[1].
సాహిత్య ప్రస్థానం[మార్చు]
కళాశాల విద్యను అభ్యసించేటప్పుడే కవిత్వం రాయడం మొదలుపెట్టిన నరసింహ మొదట్లో ప్రేమ కవిత్వం రాసినా, తన నేపథ్యం తన మార్గాన్ని సుస్పష్టం చేశాకా రైతు గురించి రాయడం మొదలు పెట్టాడు. రైతుల ఇక్కట్లు, దళారుల మోసాలు, రాజకీయనాయకుల కుట్రలు, మతవిధ్వంసం, కులరక్కసి, కరువు, వలసలు, అంబేద్కర్ ఆశయ సమాజ స్థాపన ఈ కవికి కవిత్వ వస్తువులైనాయి. ఈ కవి కవిత్వం వివిధ పత్రికలలో, సంకలనాలలో ప్రచురించబడింది. అనేక వేదికల మీద తన కవిత్వాన్ని వినిపించాడు. ఇప్పటికే కుట్ర జేస్తున్న కాలం (2014), ఆరుతున్న మెతుకు దీపం (2016) అను పేరుతొ రెండు కవిత్వ సంకలనాలను వెలువరించిన ఈ కవి 'వెన్నెలవాడ ' పేరుతో మూడో కవిత్వ సంకలనాన్ని ప్రచురణకు సిద్దం చేస్తున్నాడు. కథకుడు కూడా అయిన ఈ కవి 'ఐ హేట్ యువర్ క్యాస్ట్ ' పేరుతో కొన్ని కథలను కూడా రాశాడు.
- రచనలు
కవిత్వం 1.కుట్ర జేస్తున్న కాలం (2014) 2.ఆరుతున్న మెతుకు దీపం (2016) 3.వెన్నెలవాడ (అముద్రితం)
కథలు 4.ఐ హేట్ యువర్ క్యాస్ట్ (అముద్రితం)
ఇతని కవిత్వంపై ఇతర కవుల అభిప్రాయాలు[మార్చు]
- నమ్ముకున్న పొలం, ఆశ పెట్టుకున్న ప్రకృతి తనను దగా చేసినా, అప్పుల పాలై బతుకు బండిని నడిపే దారి మూసుకపోయి చతికిల బడేసినా, భూతల్లిని విడిచి పెట్టని రైతు దృఢత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దివిటీ పట్టి చూపించిన కవి. --వల్లభాపురం జనార్ధన
- "తెలంగాణాలో రైతు చేస్తున్న బతుకు యుద్దానికి కదిలిపోయిన హృదయాన్ని ఈ కవి కలంలో చూడగలం". - పరిమళ్
- "రైతును, రైతుగోసను, ఆక్రందనను అక్షరమక్షరంలో ఆవిష్కరించిన కవి." - డా. భీంపల్లి శ్రీకాంత్
మూలాలు[మార్చు]
- All articles with dead external links
- Articles lacking in-text citations from సెప్టెంబరు 2020
- All articles lacking in-text citations
- Articles needing additional references from సెప్టెంబరు 2020
- మౌలిక పరిశోధన కలిగివున్నాయని అనుమానమున్న వ్యాసాలు from సెప్టెంబరు 2020
- Articles with multiple maintenance issues
- మహబూబ్ నగర్ జిల్లా కవులు