హిమజ్వాల (రచయిత)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హిమజ్వాల మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి, రచయిత, విమర్శకులు. సాహితీ రంగంలో విశిష్టతను కలిగిన హిమజ్వాల అసలు పేరు ఇరువింటి వెంకటరమణ. 1950లో జన్మించారు[1]. తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. ' తెలుగు సాహిత్యంపై శరత్ ప్రభావం ' అను అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందారు. 14 వ ఏట నుండె కవిత్వం రాయడం మొదలుపెట్టారు. తొలినాళ్ళలో ఛందో బద్ద కవిత్వం రాశారు. తరువాత వచన కవిత్వం రాసి 1977 లో 'చూపు' అను కవితా సంపుటిని వెలువరించాడు. వీరు రాసిన అనేక కవితలు, పాటలు, విమర్శలు అనేక పత్రికలలో వెలువడ్డాయి. ఇతను ఏమి రాసినా అవన్నీ ప్రజా పక్షపాత దృష్టితో రాసినవే. సాహిత్యం మార్క్సిజం వెలుగులో జనించాలన్నది వీరి అభిప్రాయం. విరసం సభ్యులుగా అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారు.

మూలాలు[మార్చు]

  1. పాలమూరు కవిత,సంపాదకులు:భీంపల్లి శ్రీకాంత్,పాలమూరు సాహితీ, మహబూబ్ నగర్,జనవరి-20004,పేజి-165.