Jump to content

కారాగారం

వికీపీడియా నుండి
(కారాగారము నుండి దారిమార్పు చెందింది)

కారాగారం లేదా చెరసాల (Jail or Prison) అనేది నేరం చేసి శిక్షను అనుభవించు వారిని ఉంచు నిర్బంధగృహం. దీనిని వాడుకలో ఎక్కువగా జైలు అంటారు. ఈ కారాగారాలు సాధారణంగా పోలీస్ స్టేషను (రక్షకభట నిలయం) నకు అనుసంధానంగా ఉంటాయి. రాజమండ్రి, హైదరాబాదు‌లోని చెర్లపల్లి, చంచల్‌గూడ జైలు, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం లలో 6 సెంట్రల్ జైళ్ళున్నాయి.

కారాగారాలు-రకాలు

[మార్చు]

జైళ్ళలో అనేక రకాలు ఉన్నాయి.

  • పోలీస్ స్టేషనులలో జైళ్ళు: ఇవి పోలీస్ స్టేషను లోపల అదే భవనంలో ఉంటాయి. వీటిని ఆయా భవనాల సౌకర్యాలను అనుసరించి కొన్ని గదులను కేటాయిస్తారు. వాటిని సెల్స్ అని పిలుస్తారు. వీటిలో ఖైదీలను (అభియోగం మోపబడిన వ్యక్తులు) కేవలం కొద్ది సమయం, లేదా ఒకటి రెండు రోజుల వరకూ మాత్రమే ఉంచుతారు.
  • సాధారణ జైళ్ళు లేదా ప్రాంతీయ కారాగారాలు: కొద్ది రోజుల శిక్షకొరకు వీటిని వాడుతుంటారు. ఇవి ఆయా కోర్టుల, పోలీస్ స్టేషనుల పరిధిలో ఉంటాయి.
  • అత్యంత భద్రత కలిగిన కేంద్రీయ కారాగారాలు

కారాగారాలలో ప్రసిద్ధమైనవి

[మార్చు]

భారతీయ ప్రసిద్ధ కారాగారాలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్

[మార్చు]

రాజమండ్రి సెంట్రల్ జైలు

[మార్చు]
ఈ జైలు 35 ఎకరాల విస్తీర్ణం. ఇది ఒక కోట దీనిని 2-3 శతాబ్ధాల క్రితం డచ్ వారు నిర్మించారు. తరువాత ఈ కోట ఆంగ్లేయుల పరిపాలనలో కారాగారం క్రింద మార్చబడింది. 1847 సంవత్సరము నుండి ఈ కారాగారానికి సెంట్రల్ జైల్ స్థానం కలిపించబడింది. ఈ జైలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోనే అతి పురాతనమైన, అన్ని రకాల సురక్షిత వ్యవస్థలు కలిగిన జైలు. 1991 సంవత్సరం జైలు కార్యాలయం అందించిన ఆధారల ప్రకారం ఈ జైలులో 581 మంది జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, 355 స్వల్ప కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఉన్నారు. రాజమండ్రి కొంత కాలం డచ్ వారి పరిపాలనలో ఉంది. డచ్ వారు మూడు నిల్వ గదులు ఏర్ఫటు చేశారు, డినిలో ఆయుధాలు తుపాకులు భద్రపరచుకొనే వారు. ఈ గదులపైన ఒక రంధ్రం ఉన్నది, ఆ రంధ్రం గుండా కావలసిన ఆయుధాలు తీసుకొనేవారు. ఈ గదులు కొలతలు 10 అడుగులు ఎత్తు 10 అడుగుల వెడల్పు 10 అడుగుల పొడవు) ఉంటాయి. ఒక గది రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నది, రెండవది మునిసిపల్ ఆఫీస్ పశ్చిమ గేటుకి ఎదురుగా ఉన్నది, మూడావది పాత సబ్ కల్టకర్ ఆఫీసు వెనుక అప్సర హొటలు దగ్గర ఉంది. ఈ గదులను ఇప్పుడు రికార్డులను దాచడానికి తగులపెట్టాడానికి ఉపయోగిస్తున్నారు. 1857 సంవత్సరంలో ప్రథమ స్వాతంత్ర్య సమరం జరిగాక రాజమండ్రి డచ్ వారి చేతుల నుండి ఆంగ్లేయులకు హస్తగతం అయ్యింది, అప్పుడు ఆంగ్లేయులు ఈ కోటను కారాగారంగా మార్చారు. గోదావరి నది నుండి ప్రవాహించే ఒక నది పాయ ఈ జైలులో ప్రవహించేది, కాని ఆ పాయ మార్గం ఇప్పుడు మారి పోయింది. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు ఎందరో ఈ జైలులో ఆంగ్లేయుల చేత ఖైదు చేయబడినారు.

క్షమాబిక్ష

[మార్చు]

ఖైదీలను సంస్కరించి వారిలో పరివర్తన తీసుకురావలసింది జైళ్ళే. జీవితకాలం శిక్ష అనుభవిస్తున్నవారిని ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ఫ్రవర్తన కలిగిన, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడే కొంతమంది ఖైదీలను విడుదల చేస్తారు. జీవిత ఖైదీల విడుదలకు ఖైదీ ప్రవర్తన సక్రమంగా ఉందని, జరిగిన నేరం విషయంలో పశ్చాతాప పడే ధోరణి ఖైదీలో కనిపిస్తోందని జైలు అధికారులు లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి తెలియ జేయాలి. పదేళ్ల శిక్ష పూర్తి చేసుకున్నవారందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఖైదీల బంధువులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఖైదీ విడుదలకు శిక్షా కాలాన్ని సత్ప్రవర్తనను ప్రామాణికంగా తీసుకోవాలని జనశక్తి నేత అమర్ అన్నారు. సెక్షన్‌ల చట్రంలో ఎవరినీ బంధించవద్దని ఆయన కోరారు. విడుదలకు అనర్హులు :

  • 1. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయరాదు
  • 2. మతకల్లోలాల కేసుల్లో ఉన్నవారిని విడుదల చేయరాదు
  • 3. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసుల్లో ఉన్నవారు
  • 4. ఇతర రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ కేసుల్లో ఉన్నవారు
  • 5. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, ప్రజాప్రతినిధులపై దాడి చేసిన వారు విడుదలకు అనర్హులు.

భద్రతా సమావేశాలు

[మార్చు]

జైళ్లలో తరచుగా ఖైదీలపై, జైలు సిబ్బందిపై కూడా రౌడీషీటర్లు, ఇతర ఖైదీలకు మధ్య తగాదాలు దాడులు జరుగుతుంటాయి. ఆహారం సరిగా ఇవ్వడం లేదని హల్‌చల్‌ చేస్తారు. వర్గాలుగా ఏర్పడిన ఖైదీలు ఒకరిపై ఒకరు దాడులకు దిగుతారు. మరికొన్ని సార్లు కావాలనే సమస్యలను సృష్టించడానికి సిబ్బందిపై, అధికారులపై దాడులకు తెగబడతారు. తీవ్రవాదులను తమతో ఉంచుకోలేమని జైలు అధికారులు కోర్టులకు సైతం విన్నవిస్తూ ఉంటారు.వీరిని ఆఘమేఘాలపై ఇతర జైళ్ళకు తరలిస్తుంటారు. జైళ్లలో జరిగే భద్రతా సమావేశాల్లో ఇలాంటి వాటిపై నిర్ణయాలు తీసుకోవాలి.మూడు నెలలకు ఒకసారి జైలు కమిటీ భద్రతా సమావేశాలు జరగాల్సి ఉంది. సివిల్‌ పోలీసులు, జైలు అధికారులు, ఖైదీలను కోర్టులకు, ఆసుపత్రులకు, కస్టడీలకు తీసుకువెళ్లే సమయంలో భద్రతా చర్యలు చేపట్టే ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొనాలి.

మూలాలు

[మార్చు]
  1. History of Andaman Cellular Jail: Recapture of Andaman Islands to keep Political Prisoners Archived 18 జనవరి 2007 at the Wayback Machine.
  2. Tihar prison in India: More dovecote than jail. The Economist (2012-05-05). Retrieved on 2012-05-31.
  3. "Department of Tihar Prisons". Government of Delhi. Archived from the original on 2014-01-08. Retrieved 2014-01-08.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కారాగారం&oldid=3366889" నుండి వెలికితీశారు