Jump to content

లయగ్రాహి గరుడాచల కవి

వికీపీడియా నుండి

లయగ్రాహి గరుడాచల కవి మహబూబ్ నగర్ జిల్లాలోని బోరవెల్లి సంస్థానానికి చెందిన కవి. ఇతను ఉభయభాషా నిరంకుశుడు, అష్టభాషాకవిత్వ సంపన్నుడు. శ్రీకృష్ణదేవరాయలచే సత్కరింపబడి, అసమాన కవిత్వ గురుడని పేరుగాంచిన మాధవుడు లయగ్రాహి గరుడాచల కవి తాత గారి ముత్తాత[1]. బోరవెల్లి సంస్థానపు పట్టపురాణి గిరియమ్మ కోరిక మేరకు ' కౌసలేయ చరిత్రం ' రచించాడు. దీనిని బోరవెల్లి కేశవస్వామికి అంకితమిచ్చాడు. ఈ కౌసలేయ చరిత్రంలో ఈ కవి తన వంశ మూల పురుషుడైన మాధవుని గురించి ఇలా వర్ణించాడు. "మాధవ భక్తి యుక్తుడసమాన కవిత్వ గురుండు కృష్ణరా యాధిపదత్త సద్గజ వరాది మహా బహుమాన శాలి గం గాధర కీర్తి సాంద్రుడు జగత్కవిచంద్రుడు మత్కులేంద్రడౌ మాధవ డస్మదాదులకు మాన్యుడు గాడె దలంచి చూచినన్?

మూలాలు

[మార్చు]
  1. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 11 వ సంపుటం, నాయకరాజుల యుగం-2 రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1967, పుట-215