మానవపాడ్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మానవపాడ్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]

మానవపాడ్
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటంలో మానవపాడ్ మండల స్థానం
మహబూబ్ నగర్ జిల్లా పటంలో మానవపాడ్ మండల స్థానం
మానవపాడ్ is located in తెలంగాణ
మానవపాడ్
మానవపాడ్
తెలంగాణ పటంలో మానవపాడ్ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 15°57′50″N 77°56′28″E / 15.96397°N 77.941039°E / 15.96397; 77.941039
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రం మనోపాడ్
గ్రామాలు 25
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (201)
 - మొత్తం 51,543
 - పురుషులు 28,132
 - స్త్రీలు 25,411
అక్షరాస్యత (201)
 - మొత్తం 47.46%
 - పురుషులు 60.65%
 - స్త్రీలు 33.81%
పిన్‌కోడ్ 509128

ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.ఇది అలంపూర్ శాసనసభ నియోజకవర్గ పరిధి ఉంది

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1063 ఇళ్లతో, 5013 జనాభాతో 1754 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2547, ఆడవారి సంఖ్య 2466. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1283 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 33. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576405[2].

సరిహద్దులు[మార్చు]

సురవరం ప్రతాపరెడ్డి చిత్రపటం

ఈ మండలానికి ఉత్తరాన కృష్ణానది, దక్షిణాన తుంగభద్ర, తూర్పున అలంపూర్ మండలం, పశ్చిమాన ఇటిక్యాల, వడ్డేపల్లి మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

విద్యావకాశాలు[మార్చు]

జివికె రెడ్డి స్మారక ప్రభుత్వ జూనియర్ కళాశాల, మానోపాడు

ఈ మండలంలో విస్తీర్ణంలోనూ, జనాభా పరంగానూ 4 పెద్ద గ్రామాలు ఉన్నాయి. అవి ఉండవెల్లి, జల్లాపూర్,పుల్లూర్, చెన్నిపాడు. ఈ గ్రామాలన్నిటిలోనూ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.వీటితో పాటు మండల కేంద్రమైన మానోపాడులో ఉన్నత పాఠశాలతో పాటు, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది. మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తాలోనూ ప్రభుత్వేతర ఉన్నత పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.

మండలంలోని ఆలయాలు[మార్చు]

మండలంలోని కంచుపాడు గ్రామంలో ప్రసిద్ధి చెందిన జమ్ములమ్మ(ఎల్లమ్మ) ఆలయం ఉంది. మండలంలోని గ్రామ ప్రజలే కాకుండా సమీపంలో ఉన్న ఆలంపూర్, ఇటిక్యాల మండలాలలోని గ్రామ ప్రజలు కూడా ప్రతి మంగళ, శుక్ర వారాలలో పెద్ద ఎత్తున తరలివచ్చి, పూజించి వెళ్తుంటారు.

మండలానికి చెందిన ప్రముఖులు[మార్చు]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

నిర్జన గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు[మార్చు]