చింతలపల్లి ఛాయాపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చింతలపల్లి ఛాయాపతి మహబూబ్ నగర్ జిల్లాలోని బోరవెల్లి సంస్థానానికి చెందిన కవి. 17 వ శతాబ్ధానికి చెందినవాడు. ఆర్యా శతకం రచించిన గోపాలకవి వీరి తండ్రిగారు. ఛాయాపతి బోరవెల్లి సీమకు రావడానికి ముందు దేవరకొండ సీమలోని బోయినపల్లిలో ఉండేవాడు. బోరవెల్లి సీమ ప్రభువు రాజా వెంకటరెడ్డి ఆహ్వనం మేరకు బోరవెల్లి సంస్థానానికి వచ్చాడు. ఇతను ఆంధ్రగీర్వాణ భాషలలో ' నవఘంట సురత్రాణ ' బిరుదాంకితుడు.[1] సర్వంకష ప్రజ్ఞ కలవాడు. అష్టావధానాలు చేశాడు. వ్యస్తాక్షరిలో గొప్ప ప్రతిభ కలవాడు. కొత్త శ్లోకాలను అనులోమ, విలోమ క్రమంలో పఠించగలిగినవాడు. ఇతను మురళీగోపాల భక్తుడు. తిరుమల శ్రీనివాసాచార్యుల శిష్యుడు. ' రాఘవాభ్యుదయం ' అను గ్రంథాన్ని రచించాడు. దీనిని బోరవెల్లి ప్రభువుల ఇలవేల్పైన శ్రీచెన్న కేశవస్వామికి అంకితమిచ్చాడు. ఛాయాపతికి కవిత్వం పట్ల, కవుల పట్ల, కృతినాయకుల పట్ల కచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి. వాటినన్నిటిని తన రాఘవాభ్యుదయంలో ప్రస్తావించాడు.

చింతలపల్లి కవుల వంశక్రమం

[మార్చు]
                                                 చింతలపల్లి ఎల్లయ్య
                                          (చింతలపల్లి పండిత కుటుంబంలో అతి ప్రాచీనుడు)
                                                      ↓ ( ముని మనుమలు )
                                      ↓——————————————————————————————↓
                                  చింతలపల్లి జోగయ్య                           వెంకటయ్య
                                     ↓ ( కుమారుడు)
                                    మూర్తి కవి
                                     ↓ ( కుమారుడు )
                                 పెద్ద వీర రాఘవుడు
                                      ↓ ( భార్యలు)
                        ↓——————————————————————————————————↓
                      లచ్చమాంబ                             నరసమ్మ
                                                           ↓ ( ఆరుగురు కుమారులు )
                            ↓———————↓———↓——————————————↓—————————————————↓———————————————↓
                          గోపాలయ్య   (...)   (...)             వెంకటయ్య            అప్పయ్య          యాగయ్య
                            ↓ (భార్యలు)                   ↓( కుమారుడు)         ↓( కుమారుడు)
               ↓———————————————————↓              చిన వీర రాఘవయ్య        సంజీవయ్య
              (......) పెద్ద భార్య             (.....) చిన్న భార్య             
                                    ↓( కుమారులు)
                                ↓—————————————↓
                              శేషశాయి        చింతలపల్లి ఛాయాపతి

మూలాలు

[మార్చు]
  1. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 11 వ సంపుటం, నాయకరాజుల యుగం-2, రచన: ఆరుద్ర, ఎమెస్కో,సికింద్రాబాదు, 1967, పుట-206