డా. ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్
డా. మహమ్మద్ హుసేన్
జననంమహమ్మద్ హుసేన్
1948, ఫిబ్రవరి 9
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిమండలం కంచుపాడు గ్రామం
వృత్తితెలుగు భాషోపన్యాసకులు
ప్రసిద్ధిసంస్కృతాంధ్ర కవి, రచయిత.
మతంముస్లిం.
తండ్రి  హసన్
తల్లిఫాతీమాబీబీ

డా. ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ జోగులాంబ గద్వాల జిల్లా కి చెందిన  సంస్కృతాంధ్ర కవి, రచయిత. ఈ జిల్లాలోని ఉండవెల్లి మండలంలోని కంచుపాడు వీరి స్వగ్రామం. 1948 ఫిబ్రవరి 9 వ తేదిన జన్మించారు. ఫాతీమాబీబీ, హసన్ వీరి తల్లిదండ్రులు.  మహమ్మద్ హుసేన్ 1971లో తెలుగు భాషోపాధ్యాయులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, 2001లో తెలుగు భాషోపన్యాసకులుగా  ఉద్యోగ విరమణ చేశారు. 'వేనరాజు - సమకాలీన సాంస్కృతికోద్యమాల ప్రభావం' అను అంశంపై ఎం.ఫిల్., 'అలంపూరు సీమ - సంస్కృతాంధ్ర సాహిత్యం' పై పి.హెచ్.డి., చేశారు [1].

రచనలు[మార్చు]

1. అలంపురి జోగులాంబికా నక్షత్రమాల[2].                         

2. కోయిల శతకం.

3. దేవదత్తం (పద్య సంపుటి)

4. హుసేన్ గీతములు

5. నేను - చుట్టూ (వచన కవితా సంపుటి)

6. విష్ణ్వష్టకం (సంస్కృతం)

7. విఘ్నేశ్వర స్తోత్రావళీ (సంస్కృతం)

8. చైతన్య ప్రవాహం (గేయ సంపుటి)

9. సర్కారు ఆసుపత్రి (నాటిక)

10. బతుకు బాగుచేసుకుంటా (నాటిక)

11. లోక సుఖం (నాటిక)

12. రైతులేని రాజ్యం (నాటిక)

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. కోయిల శతకం-ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్, శ్రీకృష్ణా ప్రింటర్స్, కర్నూలు, జులై-2005, చివరి పత్రం
  2. అలంపురి జోగులాంబికా నక్షత్రమాల -ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్, ఎస్వీ లక్ష్మీ గ్రాఫిక్స్,కర్నూలు.

వెలుపలి లంకెలు[మార్చు]