శేషదాసులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శేషదాసులు
శ్రీ శేషదాసులు
జననంశేషప్ప
1817
మహబూబ్ నగర్ జిల్లా ధరూర్
మరణం1885
మహబూబ్ నగర్ జిల్లా ధరూర్
ఇతర పేర్లు"శ్రీ గురు విజయ విఠల
వృత్తిపట్వారీ
ప్రసిద్ధివాగ్గేయకారుడు
మతంహిందూ
పిల్లలులక్ష్మమ్మ, తిమ్మన్న, గోవిందప్ప, భీమన్న
తండ్రితిమ్మన్న
తల్లిపద్మమ్మ

శేషదాసులు మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ గ్రామానికి చెందిన గొప్ప వాగ్గేయకారుడు. పరమ భక్తుడు. గద్వాల సంస్థానం పాలనలో కరణం.

కుటుంబ విశేషాలు

[మార్చు]

శేషదాసులు ఈశ్వర నామ సంవత్సరం (1817) కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జన్మించారు. వీరి తల్లిదండ్రులు పద్మమ్మ, తిమ్మన్నలు. శేషదాసులు భరధ్వజ గోత్రజులు. యజుః శాఖాధ్యయనులు. ఉత్తరాది మఠస్తులు. అపరోక్ష జ్ఞానులు అని వీరికి ప్రతీతి. వీరి జన్మనామం శేషప్ప. మల్దకల్ తిమ్మప్ప స్వామికి పరమ భక్తులు. ఇతనికి వెంకమ్మ, సుబ్బమ్మ అను ఇద్దరు భార్యలు ఉండేవారు. వెంకమ్మ ద్వారా వీరికి లక్ష్మమ్మ, తిమ్మన్న, గోవిందప్ప, భీమన్న అను నలుగురు సంతానం.

వృత్తి జీవితం

[మార్చు]

వీరు గద్వాల సంస్థానం పాలనలో సీతారామ భూపాలుడికాలంలో ధరూర్ గ్రామ కరణంగా పనిచేశారు. గ్రామ కరణీకపు లెక్కల్లో వచ్చిన ఏదో చిన్న పొరపాటుకు సంస్థానపు రాణి వెంకటలక్ష్మమ్మ ఇతనిని తోటి కరణాల ముందు ఘోరంగా అవమానించింది. ఆ అవమాన భారం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని సిద్ధపడ్డాడు.

చింతరేవులతో అనుబంధం

[మార్చు]

ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న

గురువులు

[మార్చు]

శేషప్పకు ముగ్గురు గురువులు. వారు విజయదాసులు, పురంధరదాసులు, గోపాలదాసులు. వీరిలో ఒకరు దాస గురువు. ఇంకొకరు ఆధ్యాత్మిక గురువు. మరొకరు సాహిత్య గురువు. శేషప్ప చింతరేవుల ఆంజనేయస్వామి ఆరాధానానంతరం కర్ణాటకలోని చిప్పగిరికి వెళ్ళిపోయారు. అక్కడ విజయదాసుల వారి శిష్యరికం చేసి, దాస వృత్తిని స్వీకరించారు. గురువు గారిచే "శ్రీ గురు విజయ విఠల" అను అంకితనామాన్ని పొందారు. చిప్పగిరి నుండి తమ వంశ ఆరాధాన దైవం ఐన తిమ్మప్ప స్వామి వెలసిన మల్దకల్ క్షేత్రానికి వచ్చాడు. అక్కడే శ్రీ పురంధరదాసు శిష్యరికం చేసి హరిదాసుగా, శేషదాసుగా మారిపోయాడు. ఈ క్షేత్రంలోనే గురువు గోపాలదాసు సూచనలతో సాహిత్య రచనకు పూనుకున్నారు.

మల్డకల్‌తో అనుబంధం

[మార్చు]

చిప్పగిరి నుండి మల్దకల్‌కు వచ్చిన శేషదాసు తిమ్మప్ప స్వామి సేవలో జీవితాన్ని గడిపారు. ఇక్కడి స్వామి వారి పాదాల చెంతకు భాగీరథిని తీసుకవచ్చిన అపర భగీరథుడని శేషదాసుల వారికి పేరుంది. వీరు వాగ్గేయకారుడిగా మారింది కూడా మల్దకల్‌లోనే. ఇక్కడే వీరు ఎంతో మంది శిష్యులకు జ్ఞాన బోధ చేశారు. వీరి శిష్యులలో భీమాచార్యులు ముఖ్యులు. ఇక్కడ వీరికి సంబంధించిన ఆరాధనా పీఠం, వారు గడిపిన సత్రం ఉన్నాయి.

సాహిత్య సృష్టి

[మార్చు]

మల్దకల్‌లో పురంధరదాసు, గోపాలదాసుల శిష్యరికం వలన సాహిత్యంలో పట్టు సాధించారు. కన్నడంలో అనేక ఉగాబోగములు, సుళాదులు, కీర్తనలు రచించారు. గొప్ప వాగ్గేయకారునిగా కీర్తిని గడించారు.

Sri Parthasarathi Swamy

శేష జీవితం

[మార్చు]

మల్దకల్ నుండి ధరూర్‌కు తిరిగి వచ్చిన శేషదాసులు తన స్వగృహంలో శ్రీపార్థివ నామ సంవత్సరం, ఉగాది నాడు శ్రీపార్థసారథి స్వామిని ప్రతిష్ఠించాడు.

వైకుంఠ యాత్ర

[మార్చు]

శేషదాసులు శ్రీ పార్థివ నామ సంవత్సరం (1885), వైశాఖ శుద్ధ అష్టమి నాడు ధరూర్‌లోని స్వగృహంలో పరమపదించారు[1].

శ్రీశేషదాస సేవా సమితి

[మార్చు]

1979లో వీరి స్మారకార్థం వీరి వంశస్థులు, భక్తులు కలిసి మల్దకల్‌లో 'శ్రీశేషదాస సేవా సమితి ' ని ఏర్పాటు చేశారు. ఈ సమితి కొంత నిధిని ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ అష్టమి నాడు శేషదాసుల ఆరాధనోత్సవాలు నిర్వహిస్తుంది. శేషదాసుల కృతుల ముద్రణ, దాస సాహిత్యం, శ్రీమధ్వ సిద్ధాంత గ్రంథాల ముద్రణ మొదలగు పనులను చేపట్టింది.

శ్రీశేషదాసుల అష్టకం

[మార్చు]

శేషదాసుల జీవితం, మహత్తు మొదలగు విషయాలను తెలియజేస్తూ శ్రీరఘుదాంత తీర్థులు సంస్కృతంలో రాసిన గ్రంథం ఇది. దీనిని కన్నడంలోకి శ్రీమధ్వరావు ఉప్పలి, తెలుగులోకి శ్రీమాళిగి భీమసేనాచార్యలు అనువదించారు.

మూలాలు

[మార్చు]
  1. శ్రీశేషదాసుల అష్టకం,రచన:శ్రీరఘుదాంత తీర్థులు,శ్రీశేషదాస సేవా సమితి ప్రచురణలు, మొదలకల్లు, 2003, పుట- 38