Jump to content

కోయిల్ సాగర్ ప్రాజెక్టు

వికీపీడియా నుండి
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు

కోయిల్ సాగర్ (Koil Sagar) ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలోని మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టులలో ఒకటి.[1][2] జిల్లాలో ప్రవహించే పెద్దవాగుపై దేవరకద్ర మండలంలోని బొల్లారం గ్రామం దగ్గర ఈ ప్రాజెక్టును నిర్మించారు. మండల కేంద్రమైన దేవరకద్రకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది.

ప్రాజెక్టు వివరాలు

[మార్చు]

1945లో నిజాం పరిపాలనా కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనది. జిల్లాలోని దేవరకద్ర, ధన్వాడ, చిన్నచింతకుంట మండలాలలోని 12 వేల ఎకరాల సాగు భూమికి నీటిని అందించడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశింపబడింది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.276TMC లు.

పర్యాటకం

[మార్చు]

రెండు కొండల మధ్య నిర్మించబడిన ఈ ప్రాజెక్టు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జిల్లాలో పెద్ద ప్రాజెక్టు ఐన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాజెక్టుకు మరింత నీటిని చేరవేయడానికి పనులు ప్రారంభమైనవి.[3] కోయిల్ సాగర్ ప్రాజెక్టులో బోటింగ్‌ను 2022 మార్చి 17న తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించాడు.[4]

కోయిల్‌సాగర్

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-07. Retrieved 2018-07-27.
  2. నమస్తే తెలంగాణ (13 September 2017). "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". Archived from the original on 27 July 2018. Retrieved 28 July 2018.
  3. Namasthe Telangana (9 June 2021). "కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల". Archived from the original on 5 జూలై 2021. Retrieved 5 July 2021.
  4. Namasthe Telangana (17 March 2022). "కోయిల్ సాగర్ ప్రాజెక్టులో బోటింగ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనినాస్ గౌడ్". Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.