గుండా మల్లేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుండా మల్లేష్
జననంరేచిని, ఆదిలాబాదు జిల్లా
వృత్తిరాజకీయవేత్త, శాసనసభ సభ్యుడు
పదవీకాలం1983-1985,
1985-1990,
1994-1999 మరియు 2008–2014
రాజకీయ పార్టీసి.పి.ఐ

గుండా మల్లేష్ ఆంధ్రప్రదేశ్ 12 వ శాసనసభ సభ్యుడు. ఈయన ఆదిలాబాదు జిల్లా, బెల్లంపల్లి నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. శాసనసభలో సి.పి.ఐ పార్టీ శాసనసభా పక్షనేతగా ఎన్నికయ్యాడు.

నేపధ్యము[మార్చు]

కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ అంచెలంచెలుగా శాసన సభ్యులు స్థా యికి ఎదిగాడు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి చెందిన మల్లేశ్ మెట్రిక్యులేషన్ చదివి, బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్‌పోర్టులో క్లీనర్‌గా, డ్రెవర్‌గా పనిచేశాడు. తోటి క్లీనర్లు, డ్రెవర్ల సమస్యలపై పోరాడారు. తర్వాత సింగరేణిలో కార్మికుడిగా చేరిన ఆయన సీపీఐలో సభ్యత్వం తీసుకున్నారు. 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయు రాజకీయ నాయకుడిగా మారారు. మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న ఆయన 1983లో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 1985, 1994 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 12 వ శాసనసభలో 2009లో బెల్లంపల్లి నుంచి ఎన్నికై సభానాయకుడిగా వ్యవహరిస్తున్నాడు.

బయటి లంకెలు[మార్చు]