అయిజా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అయిజా
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో అయిజా మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో అయిజా మండలం యొక్క స్థానము
అయిజా is located in Telangana
అయిజా
తెలంగాణ పటములో అయిజా యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°00′51″N 77°40′13″E / 16.01417°N 77.67028°E / 16.01417; 77.67028
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము అయిజ
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 85,303
 - పురుషులు 43,192
 - స్త్రీలు 42,111
అక్షరాస్యత (2011)
 - మొత్తం 32.93%
 - పురుషులు 44.25%
 - స్త్రీలు 21.27%
పిన్ కోడ్ {{{pincode}}}

అయిజ, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. పిన్ కోడ్: 509127. ఈ గ్రామము డివిజన్ కేంద్రమైన గద్వాల నుండి 35 కిలో మీటర్ల దూరంలో ఉంది. గద్వాల డివిజన్ లోనే ఇది అతిపెద్ద మేజర్ గ్రామ పంచాయతి. ఈ గ్రామ జనాభా సుమారు 25 వేలు. గద్వాల నుండి మంత్రాలయం వెళ్ళు మార్గములో ఈ గ్రామము ఉంది. కర్నూలు నుండి రాయచూరు వెళ్ళు రోడ్డు మార్గము కూడా ఈ గ్రామ సమీపం నుంచే వెళ్తుంది.

దేవాలయాలు[మార్చు]

అయిజ పట్టణంలో శ్రీతిక్కవీరేశ్వరస్వామి దేవస్థానం ఉంది. ప్రతియేటా ఇక్కడ ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. జాతర సమయంలో రథాన్ని కూడా లాగుతారు.

అయిజ పట్టణంలో బ్రాహ్మణ వీధిలో సంజీవరాయ స్వామి దేవాలయము ఉంది. ఈ స్వామి వారు మహా శక్తి కలవారు.ఈ స్వామి వారిని దర్శించిన సకల కష్టాలను తొలగించును. ఇక్కడ ఒకప్పుడు ఘనంగా బ్రహ్మోత్సవాలు జరిగేవి. ఈ ఊరి జనాలు కోతుల గుడిగా పిలుస్తారు. ఇక్కడ కోతులు ఎక్కువగా సంచరించేవి ఇక్కడి కోలనులో స్నానాలు చేసేవి కనుక కోతుల గుడిగా పిలిచేవారు.

2009 ఎన్నికలు[మార్చు]

2009, ఏప్రిల్ 16న జరిగిన పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించుట వలన ఈ గ్రామం రాష్ట్రవ్యాప్తంగా పేరుపొందింది. గ్రామంలో 17 పోలింగు బూత్‌లను ఏర్పాటుచేయగా పోలింగ్ బూత్‌లలో ప్రవేశించిన దుండగులు ఎలక్ట్రానిక్ పోలింగ్ యంత్రాలను ధ్వంసంచేసి పోలింగ్ జరుగకుండా అడ్డుకున్నారు.[1] మళ్ళీ ఏప్రిల్ 18న 17 పోలింగ్ కేంద్రాలలో రీ-పోలింగ్ నిర్వహించగా కేవలం 9.65% మాత్రమే పోలింగ్ అయింది.[2] ఇది రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే అరుదైన సంఘటన.[3] రెండు పోలింగ్ కేంద్రాలలో ఒకే ఒక్క ఓటు పోల్ అయింది. గ్రామంలోని మొత్తం 10961 ఓటర్లకుగాను 1059 ఓటర్లు మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయిజ మండలాన్ని గద్వాల నియోజకవర్గం నుండి విడదీసి ఆలంపూర్ నియోజకవర్గంలో కలపడానికి నిరసనగా గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పట్టణ చారిత్రక పురుషులు[మార్చు]

వేంకటనరసింహాచార్యులు
అయిజ పట్టణానికి చెందిన వీరు గొప్ప విద్వాంసులు, పండితులు. వేదశాస్త్రపారంగతులు. ఉత్తనూర్ గ్రామానికి చెందిన శ్రీగోపాలదాసు గారి శిష్యులు. మధ్వాచార్య కృత గ్రంథాలకు పాఠ ప్రవచనములు చేసిన వాడు. వీరి కుమారుడు వ్యాసతత్త్వజ్ఞులుగా పేరుగాంచిన వేంకటరామాచార్యులు[4].
వ్యాసతత్త్వజ్ఞులు
వేంకటనరసింహాచార్యుల కుమారులైన వెంకటరామాచార్యులకు వ్యాసతత్త్వజ్ఞులు అని పేరు. వీరు ఆంధ్రభాషతో పాటు, కన్నడ భాషలోనూ తత్త్వబోధన చేసిన యోగిపుంగవులు. ఈ తత్త్వబోధసారాన్నే దాససాహిత్యం అన్నారు. వీరు తండ్రిగారి వలె గొప్ప విద్వాంసులు, పండితులు.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గ్రామ పంచాయతి కార్యాలయము

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 85,303 - పురుషులు 43,192 - స్త్రీలు 42,111

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07

  1. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, తేది 17-04-2009
  2. ఈనాడు దినపత్రిక, మెయిన్ పేజీ, తేది 18-04-2009
  3. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, తేది 19-04-2009
  4. గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-32


"https://te.wikipedia.org/w/index.php?title=అయిజా&oldid=2029657" నుండి వెలికితీశారు