వి.ఎం. అబ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి.ఎం. అబ్రహం
వి.ఎం. అబ్రహం


పదవీ కాలం
   2018- ప్రస్తుతం
నియోజకవర్గం అలంపూర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఏప్రిల్ 20, 1946
వల్లూరు గ్రామం, ఇటిక్యాల మండలం, జోగులాంబ గద్వాల జిల్లా
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు వెంకటయ్య - గోవిందమ్మ
జీవిత భాగస్వామి విజయలక్ష్మి
సంతానం జ్యోతి, మాన్‌సి, అజయ్‌
నివాసం అలంపూర్, తెలంగాణ

వి.ఎం. అబ్రహం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున అలంపూర్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.[2]

జననం, విద్య[మార్చు]

అబ్రహం 1946, ఏప్రిల్ 20న వెంకటయ్య - గోవిందమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాల మండలంలోని వల్లూరు గ్రామంలో జన్మించారు. అలంపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి వరకు, గద్వాలలో ఏడో తరగతి వరకు, మహబూబ్‌నగర్‌లో ఇంటర్‌ వరకు చదివారు. 1974లో హైదరాబాదులోని ఉస్మానియా మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్ పూర్తి చేశారు.

వృత్తి జీవితం[మార్చు]

డాక్టర్‌ చదివిన తరువాత 12 ఏళ్ళపాటు అరబ్‌ దేశాల్లో (ఇరాన్, ఇరాక్, కువైట్‌ దేశాల్లో) వైద్యుడిగా పనిచేశారు.[3] తరువాత కర్నూలుకి వచ్చి, కృష్ణానగర్‌లో క్లినిక్‌ ఏర్పాటుచేశారు. 22 ఏళ్ళపాటు రోగుల నుంచి రూ.5 ఫీజు మాత్రమే తీసుకొని వైద్యం చేశారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

అబ్రహంకు విజయలక్ష్మీతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు (జ్యోతి, మాన్‌సి), ఒక కుమారుడు (అజయ్) ఉన్నారు.

రాజకీయ విశేషాలు[మార్చు]

2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున అలంపూర్ నియోజకవర్గం నుండి పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రసన్న కుమార్ పై గెలుపొందారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా[తెలుగుదేశం పార్టీ] అభ్యర్థిగా పోటీచేసి సమీప [భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]అభ్యర్థి సంపత్ కుమార్ పై 6,730 ఓట్ల తేడాతో ఓడిపోయారు.[4] తదంతరం ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంపత్ కుమార్ పై 44,679 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.[5]

ఎమ్మెల్యేగా సేవలు[మార్చు]

2009లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సుమారు రూ. 580 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించారు. ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టుగా ఉన్న అలంపూర్‌ మండలంలో రూ.66 కోట్లతో మూడు ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టారు. రూ. 6.25కోట్లతో ఐదు మండల కేంద్రాల్లో కేజీబీవీ భవనాలు, రూ.1.50 కోట్లతో అలంపూర్, అయిజలో రెండు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాలు, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మండలాల్లో తహశీల్దార్‌ కార్యాలయాల భవనాలు నిర్మించారు. అలంపూర్‌ చౌరస్తా–అయిజ రహదారిని రూ.78 కోట్లతో ఆధునీకీకరించారు. రూ.14కోట్ల వ్యయంతో ఎస్సీ రెసిడెన్షియల్‌ భవనం, రూ.10 కోట్లతో అలంపూర్‌లో అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టారు.[2]

మూలాలు[మార్చు]

  1. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-06.
  2. 2.0 2.1 Sakshi (16 June 2019). "అందుకే నన్ను బీదల డాక్టర్‌గా పిలిచేవాళ్లు..." Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
  3. "V.M Abraham | MLA | Vallur | Itikyal | Alampur | Jogulamba Gadwal". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-16. Retrieved 2021-09-06.
  4. "V.m.abraham(TDP):Constituency- ALAMPUR(MAHBUBNAGAR) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-06.
  5. "Alampur Election Result 2018 Live Updates: Candidate List, Winner, Runner-up MLA List". Elections in India. Archived from the original on 2021-09-06. Retrieved 2021-09-06.