చల్లా వెంకట్రామ్ రెడ్డి
చల్లా వెంకట్రామిరెడ్డి | |||
ఎమ్మెల్సీ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 30 మార్చి 2023 - 29 మార్చి 2029 | |||
ముందు | రావుల రవీంద్రనాథ్ రెడ్డి | ||
---|---|---|---|
తరువాత | వి.ఎం. అబ్రహం | ||
నియోజకవర్గం | శాసనసభ సభ్యులు కోటా | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2004 - 2009 | |||
నియోజకవర్గం | అలంపూర్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1970 పుల్లూరు, ఉండవెల్లి మండలం, జోగులాంబ గద్వాల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | నిర్మల, చల్లా రాంభూపాల్ రెడ్డి | ||
బంధువులు | నీలం సంజీవరెడ్డి (తాత) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
చల్లా వెంకట్రామిరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అలంపూర్ నియోజకవర్గం నుండి 2004లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2] ఆయన 2022 డిసెంబర్ 9న భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[3]
రాజకీయ జీవితం
[మార్చు]చల్లా వెంకట్రామిరెడ్డి భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి మనవడు (కూతురి కుమారుడు). ఆయన తన సొంత గ్రామమైన పుల్లూరు సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 2004లో అలంపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] చల్లా వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ తర్వాత వైఎస్సార్ పార్టీలో చేరి, అలంపూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ 2022 డిసెంబర్ 9న భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[5]
తెలంగాణ శాసనమండలికి మార్చి 2023లో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పేరును మార్చి 7న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా[6] ఆయన 9న నామినేషన్ దాఖలు చేశాడు.[7] 16 మార్చి నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముగియడంతో బరిలో ఎవరు లేకపోడడంతో చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించి ఆయనకు ధ్రువీకరణ పత్రాలు అందజేశాడు.[8]
చల్లా వెంకట్రామిరెడ్డి 2023 మార్చి 31న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[9]
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (12 April 2022). "అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ Andhra Jyothy (20 April 2022). "చల్లాకు బీజేపీ వల" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2022. Retrieved 13 June 2022.
- ↑ ABP Live (9 December 2022). "బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
- ↑ Eenadu (17 November 2023). "స్వతంత్రులుగా సత్తా చాటారు". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
- ↑ telugu (10 December 2022). "బీఆర్‌ఎస్‌లోకి 'చల్లా'". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
- ↑ Sakshi (8 March 2023). "ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు వీరే". Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.
- ↑ "దేశపతి , చల్లా , నవీన్‌ల నామినేషన్ దాఖలు" (in ఇంగ్లీష్). 9 March 2023. Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.
- ↑ Andhra Jyothy (17 March 2023). "ముగ్గురు బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవం". Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ NT News (31 March 2023). "ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన దేశపతి, నవీన్ కుమార్, చల్లా". Archived from the original on 22 March 2024. Retrieved 22 March 2024.