ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అలంపూర్ శాసనసభ నియోజకవర్గం, జోగులాంబ గద్వాల జిల్లా లోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి.

ఆలంపూర్
—  శాసనసభ నియోజకవర్గం  —
Alampur assembly constituency.svg
ఆలంపూర్ is located in Telangana
ఆలంపూర్
ఆలంపూర్
అక్షాంశరేఖాంశాలు: 15°56′N 77°54′E / 15.93°N 77.90°E / 15.93; 77.90
దేశము భారత దేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
ప్రభుత్వము
 - శాసనసభ సభ్యులు చల్లా వెంకట్రామి రెడ్డి

2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం పరిధిలో 5 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. పునర్విభజన ఫలితంగా గతంలో ఈ నియోజకవర్గంలో భాగంగా ఉన్న పెబ్బేరు మండలం వనపర్తి నియోజకవర్గంలోకి వెళ్ళిపోగా, గద్వాల నియోజకవర్గం నుంచి కొత్తగా అయిజ మండలం వచ్చి చేరింది. ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన రావుల రవీంద్రనాథ్ రెడ్డి 3 సార్లు విజయం సాధించాడు.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]

  • 2001 లెక్కల ప్రకారము జనాభా: 2,61,870.
  • ఓటర్ల సంఖ్య (ఆగస్టు 2008 నాటికి) : 2,12,235.[1]
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 21.64% మరియు 0.43%.

నియోజకవర్గ భౌగోళిక సమాచారం[మార్చు]

మహబూబ్‌నగర్ జిల్లాలో దక్షిణంగా ఉన్న ఈ నియోజకవర్గం దక్షిణాన కర్నూలు జిల్లాతో తుంగభద్ర నది వేరు చేస్తున్నది. పశ్చిమాన కొంతభాగం కర్ణాటక రాష్ట్ర సరిహద్దును కలిగి ఉంది. ఈశాన్యాన వనపర్తి నియోజకవర్గం మరియు కొల్లాపూర్ నియోజకవర్గం సరిహద్దులుగ్ ఉన్నాయి. వాయువ్యాన గద్వాల నియోజకవర్గం సరిహద్దును కలిగి ఉంది. నియోజకవర్గం గుండా ఇటిక్యాల మరియు మానవపాడు మండలాల మీదుగా 7వ నెంబరు జాతీయ రహదారి వెళుతున్నది.

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం చల్లా వెంకట్రాం రెడ్డి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడు.

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 నాగన్న భారత జాతీయ కాంగ్రెస్ జమ్మన స్వతంత్ర అభ్యర్థి
పాగ పుల్లారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ టి.చంద్రశేఖర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1952-57 పాగ పుల్లారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ డి.ఎం.రెడ్డి పి.డి.ఎఫ్
నాగన్న భారత జాతీయ కాంగ్రెస్ రాజయ్య పి.డి.ఎఫ్
1957 జయలక్ష్మీ దేవమ్మ భారత జాతీయ కాంగ్రెస్ జనార్ధనరెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1962 మురళీధర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పాగ పుల్లారెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1967 టి.చంద్ర శేఖర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ జనార్ధనరెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1972 టి.చంద్ర శేఖర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఎన్.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1974 ఉపఎన్నిక టి.రాజశేఖర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఎన్.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1978 రాంభూపాల్ రెడ్డి జనతా పార్టీ టి.రజనీబాబు స్వతంత్ర అభ్యర్థి
1983 టి.రజనీ బాబు తెలుగుదేశం పార్టీ టి.ఎల్.ఎస్.దేవి భారత జాతీయ కాంగ్రెస్
1985 రావుల రవీంద్రనాథ్ రెడ్డి భారతీయ జనతా పార్టీ బి.అనసూయమ్మ భారత జాతీయ కాంగ్రెస్
1989 రావుల రవీంద్రనాథ్ రెడ్డి భారతీయ జనతా పార్టీ టి.రజనీబాబు భారత జాతీయ కాంగ్రెస్
1994 కొత్తకోట ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ డి.విష్ణువర్థన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1999 రావుల రవీంద్రనాథ్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కొత్తకోట ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2004 చల్లా వెంకట్రామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ వావిలాల సునీత తెలుగుదేశం పార్టీ
2009 అబ్రహాం భారత జాతీయ కాంగ్రెస్ ప్రసన్న కుమార్ తెలుగుదేశం పార్టీ
2014 సంపత్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్ మందా శ్రీనాథ్ తెలంగాణ రాష్ట్ర సమితి

1999 ఎన్నికలు[మార్చు]

1999 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రావుల రవీంద్రనాథ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్తకోత ప్రకాష్ రెడ్డిపై 30254 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. రవీంద్రనాథ్ రెడ్డి 53588 ఓట్లు సాధించగా, ప్రకాష్ రెడ్డికి 23334 ఓట్లు లభించాయి. ఈ నియోజకవర్గం నుండి మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీ చేయగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ జరిగింది. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి మద్దతి ఇచ్చింది. పోటీలో ఉన్న మిగితా ఐదుగురు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన చల్లా వెంకట్రామిరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన వావిలాల సునీతపై 4191 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకట్రామిరెడ్డి 37449 ఓట్లు సాధించగా, సునీతకు 33258 ఓట్లు లభించాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితికి కేటాయించగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చల్లా వెంకట్రామిరెడ్డి రెబెల్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచాడు.

వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్లు
2004 ఎన్నికల గణాంకాలు
ఓట్లు
పోలైన ఓట్లు
  
110041
చల్లా వెంకట్రామిరెడ్డి*
  
37499
వావిలాల సునీత*
  
33258
రావుల రవీంద్రనాథ్ రెడ్డి*
  
28253
బోయ గణపతినాయుడు*
  
2820
ఇతరులు*
  
* చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు


క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పేర్టీ పొందిన ఓట్లు
1 చల్లా వెంకట్రామిరెడ్డి ఇండిపెండెంట్ 37499
2 వావిలాల సునీత తెలుగుదేశం పార్టీ 33258
3 రావుల రవీంద్రనాథ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 28253
4 బోయ గణపతి నాయుడు బహుజన్ సమాజ్ పార్టీ 2820
5 కె.గోపాల్ రావు పిపిఓఐ 2265
6 పి.నారాయణరెడ్డి ఇండిపెండెంట్ 1831
7 టి.రత్నకుమార్ ఇండిపెండెంట్ 1495
8 ఎం.సుబ్బయ్య ఇండిపెండెంట్ 553
9 సంకటి శ్యాంరాజు ఇండిపెండెంట్ 499
10 బోయ నర్సింహనాయుడు ఇండిపెండెంట్ 421
11 బి.భాస్కర్ రెడ్డి ఇండిపెండెంట్ 316
12 వెంకట్రామిరెడ్డి ఇండిపెండెంట్ 310
13 మద్దిలేటి ఇండిపెండెంట్ 292
14 రత్నమన్న ఇండిపెండెంట్ 235

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున సువర శోభారాణి పోటీచేస్తుండగా, [2] లోక్‌సత్తా తరఫున బి.స్వాములు రంగంలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ టికెట్ మొదట సంపత్ కుమార్‌కు కేటాయించగా[3] తర్వాత అబ్రహాంకు లభించింది.[4] తెలుగుదేశం పార్టీ తరఫున ప్రసన్న కుమార్, భారతీయ జనతా పార్టీ తరఫున ఎం.ఇందిర పోటీలో ఉన్నారు.

నియోజకవర్గ ప్రముఖులు[మార్చు]

  • నాగన్న:
ఆలంపూర్ మండలము లింగనవాయి గ్రామానికి చెందిన నాగన్న 4 నియోజకవర్గాల నుండి 4 సార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తొలిసారిగా 1952లో ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికకాగా, రెండో సారి 1957లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. 1962లో వరుసగా మూడవసారి అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధిమ్చగా, 1967లో నాలుగవసారి షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచాడు.
  • రావుల రవీంద్రనాథ్ రెడ్డి:
ఈ నియోజకవర్గం నుండి రావుల రవీంద్రనాథ్ రెడ్డు మూడు సార్లు భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించాడు. 1985లో మొదటిసారి విజయం సాధించగా, 1989లో కూడా గెలిచి వరుసగా రెండో పర్యాయం శాసనసభఎలో అడుగుపెట్టాడు. 1999 ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించి మూడవసారి ఎమ్మేల్యే అయ్యాడు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల అతను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి 2004 ఎన్నికలలో తెరాస తరఫున పోటీచేసిననూ విజయం దక్కలేదు. మూడోస్థానంలో నిలిచాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.
  2. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  4. సూర్య దినపత్రిక తేది 30-03-2009