కొల్లేటికోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొల్లేటికోట
—  రెవిన్యూ గ్రామం  —
కొల్లేటికోట is located in ఆంధ్ర ప్రదేశ్
కొల్లేటికోట
కొల్లేటికోట
అక్షాంశరేఖాంశాలు: 16°38′49″N 81°18′25″E / 16.647056°N 81.306932°E / 16.647056; 81.306932
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కైకలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 8,325
 - పురుషుల సంఖ్య 4,198
 - స్త్రీల సంఖ్య 4,127
 - గృహాల సంఖ్య 2,421
పిన్ కోడ్ 521 333
ఎస్.టి.డి కోడ్ 08677
Peddintlamma Poster.JPG

కొల్లేటికోట, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామము. కొల్లేటికోట గ్రామం కొల్లేరు సరస్సు మధ్యలో ఉన్న ఒక ద్వీపంపై ఉంది. కొల్లేటి కోట పంచాయితీలో కొల్లేటి కోటతో పాటు ఐదు బస్తీలు కూడా ఉన్నాయి. అవి లక్ష్మీపురం, గోకర్ణేశ్వరపురం (ఇక్కడే ప్రాచీన గోకర్ణేశ్వర ఆలయం ఉన్నది), శృంగవరప్పాడు, గుమ్ముల్లపాడు, పందిరిపల్లిగూడెం. ఈ కుగ్రామాలన్నీ దీవి యొక్క అంచుల వెంట ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

స్థానిక కథనాల ప్రకారం కొల్లేటి కోట వద్ద గజపతుల కోట ఉండేది. కొల్లేటి కోటలోని ప్రాచీన దుర్గాన్ని సూర్యవంశం వడియ రాజు లాంగుల్య గజపతి రాజు (1237 - 1282) కట్టించాడని చెప్పబడుతున్నది. ప్రస్తుతం ఆ స్థానంలో ఒక మట్టి దిబ్బ తప్ప కోట అవశేషాలు ఏవీ లేవని చరిత్రకారుడు రాబర్ట్ సీవెల్ నమోదు చేశాడు.[1] ఇక్కడి జలదుర్గాలయం పర్యాటక ప్రాముఖ్యత కలిగి ఉంది. కొల్లేటికోట గ్రామాన్ని, 15వ శతాబ్దపు చివరి భాగంలో ఒడిషాను పాలించిన అంబదేవరాయ (1462-82) జయించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.[2] [3] గజపతులపై దండెత్తి వచ్చిన శత్రువులు (మహమ్మదీయ సుల్తానులు) కొల్లేటి ఒడ్డున చిగురుకోట వద్ద డేరా వేసి గజపతుల సైన్యాన్ని చేరే మార్గం లేక ఉప్పుటేరు అనే కాలువ త్రవ్వి సరస్సు యొక్క జలాలను సముద్రంలోకి మళ్లించి, నీటి మట్టం తగ్గిపోగానే గజపతుల సైన్యంపై దాడిచేసి కొల్లేటికోటను వశం చేసుకున్నారని ప్రతీతి. ఆ దాడి సఫలం కావటానికి ఒరిస్సా సైన్యాధ్యక్షుడు కొల్లేటి ఒడ్డున తన సొంత కూతుర్ను బలి ఇచ్చాడని. అందుకే ఇప్పటికీ ఆ ఒడ్డుకు పేరంటాళ్ళ కనమ అని పేరు నిలిచిపోయిందని కథనం.[4] అలా గజపతి కాలంలో ఒడిషాలోని కటక్ ప్రాంతం నుంచి వలస వచ్చిన సూర్యవంశం వడియ రాజులు (నేటి వడ్డిలు) కొల్లేటి కోట పరిసర ప్రాంతాలలో స్థిరపడ్డారు.[5]

దేవాలయములు[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 8 మీ.ఎత్తి Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన

సమీప మండలాలు[మార్చు]

మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి, పెదపాడు

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిష్త్ పాఠశాల, కొల్లేటికోట

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొల్లేటి పెద్దింట్లమ్మ[మార్చు]

కొల్లేరు పెద్దింట్లమ్మవారి ఉత్సవం కొల్లేరు.
కొల్లేటి కోట గ్రామ చిత్రం

కొల్లేటి కోట పెద్దింటి 11వ శతాబ్దం నాటి అమ్మవారి దేవాలయంలో జలదుర్గ అమ్మవారి విగ్రహం ఉంది. ఒడిషా పాలకుడు అంబదేవరాయ ఈ దుర్గాన్ని జయించి జలదుర్గకు బదులుగా పెద్దింట్లమ్మ లేదా మాతంగిదేవి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు కథనం.[6] ఇది 9 అడుగుల ఎత్తు కలిగి, విశాల నేత్రాలతో, వీరాసన భంగిమలో ఉంటుంది.కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఏ శుభకార్యం తలపెట్టినా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఇక్కడ నివాసం ఉంటున్న వడ్డెర కులస్తులు ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే మొదలుపెడతారు. ప్రతి యేడాది ఫిబ్రవరి నెలలో ఫాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున అమ్మవారి జాతర (ఉత్సవాల)ను నెలరోజులపాటు నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కొల్లేరులో పడవ ప్రయాణం, కర్రల వంతెన (పెద్దింట్లమ్మ వారధి) పై ప్రయాణం ఉంటుంది. 135 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం గల కొల్లేరు సరస్సులో 145 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 105 గ్రామాలు పశ్చిమగోదావరి జిల్లాలోని 7 మండలాల్లో ఉండగా, మిగిలిన 40 గ్రామాలు కృష్ణాజిల్లాలోని కైకలూరు, మండవల్లి మండలాల్లో ఉన్నాయి. అగస్త్యుడు సముద్రజలాన్ని ఇంకించినట్టు, కొల్లేరు నీరు ఇంకించి, తోడించి, వంతెన వేయించి, కొల్లేరు మధ్యలో దుర్గాన్ని నిర్మించాడట.

సమీప దేవాలయాలు[మార్చు]

మరకత రాజేశ్వరి

. పెదనిండ్రకొలను - స్వయంభూ  పార్వతి సమేత శ్రి భిమెశ్వర స్వామి దేవాలయం 

. పెదనిండ్రకొలను - శ్రి వెణు గొపాల స్వామి దేవాలయం      

రవాణా మార్గాలు[మార్చు]

కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 66 కి.మీ

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి లాంచీలపై, కైకలూరు, ఆలపాడు, ఏలూరు పట్టణాల నుండైతే రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాలి.

గ్రామములో రాజకీయాలు[మార్చు]

KOLLETI KOTA LONI OKA GRAMAM GUMMALLAPADU. IDI JANABHA PARANGA ITHARA KOLLETI GRAMALA KANNA TAKKUVE AINA IKKADA ADIKA SATHAM MANDI VIDHYAVANTHULU. IKKADA EMPLOYES LO POLICE, TEACHERS, ENGINEERS, POETS, FOREST VIBHAGALLO PANI CHESTHUNNARU. POLICE SAKALO OKA DSP, OKA SI, FOUR CONSTABLES, SEVEN HOME GUARDS, ONE FIRE CONSTABLE UNNARU.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 8,325 - పురుషుల సంఖ్య 4,198 - స్త్రీల సంఖ్య 4,127 - గృహాల సంఖ్య 2,421

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7621.[7] ఇందులో పురుషుల సంఖ్య 3798, స్త్రీల సంఖ్య 3823, గ్రామంలో నివాసగృహాలు 2001 ఉన్నాయి.

మూలాలు[మార్చు]