నెమలి (గంపలగూడెం)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నెమలి (గంపలగూడెం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం గంపలగూడెం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,867
 - పురుషుల సంఖ్య 1,481
 - స్త్రీల సంఖ్య 1,386
 - గృహాల సంఖ్య 871
పిన్ కోడ్ 521 401
ఎస్.టి.డి కోడ్ 08673
నెమలి వేణుగోపాలస్వామి గుడి

నెమలి, కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 401., యస్.టీ.డీ.కోడ్ = 08673.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 73 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో దుందిరాలపాడు, తునికిపాడు, అర్లపాడు, పెనుగొలను, ఎర్రమాడు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

బోనకల్, వ్యార, మధిర, తాళ్ళగూడెం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

నెమలి, ఉట్కూర్ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 72 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ రేపాక రఘునందన్ ను, హైదరాబాదులోని ప్రముఖ సాహితీ సాంస్కృతిక సంస్థ, "అల్ ది బెస్ట్ అకాడమీ" ఆధ్వర్యంలో, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతో సత్కరించారు. హైదరాబాదులోని సుందరయ్య విఙాన కేంద్రంలో, 2015,నవంబరు-15వ తేదీ రాత్రి, అ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీ ఎ.వి.శేషసాయి, ప్రముఖ జ్యోతిష్కులు శ్రీ దైవఙశర్మ చేతులమీదుగా శ్రీ రఘునందన్ ను సత్కరించారు. [5]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, నెమలి[మార్చు]

గంపలగూడెం మండలంలోని నెమలి గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, జిల్లాలోనే ప్రముఖ పుణ్య క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలోని వేణుగోపాలుడు మహిమాన్వితుడుగా విశ్వసిస్తున్నారు. అందువలన ఇక్కడికి విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. మానసిక ప్రశాంతత లేనివారు, అంతుచిక్కని వ్యాధుల బారిన పడినవారు, సంతానలేమితో బాధపడేవారు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో గణాచారి వ్యవస్థ కనిపిస్తుంది. అరోగ్య పరమైన సమస్యలకి గల కారణాలను, పరిష్కార మార్గాల గురించి భక్తులు వారి ద్వారా తెలుసుకుని, స్వామివారి దర్శనం చేసుకుని వెళుతూ వుంటారు.

ఆలయచరిత్ర[మార్చు]

ఇక్కడ వేణుగోపాలుడు అవతరించిన తీరును తెలిపే స్థానిక కథనం అనుసరించి, 1953 ప్రాంతంలో నెమలి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి తన భూమిని అమ్మేశాడు. అదే సంవత్సరంలో, ఆ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి పొలాన్ని సాగుచేయిస్తుండగా, శ్రీరామనవమిరోజున, శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహం బయటపడింది. అయితే స్వామివారి చిటికిన వ్రేలు దెబ్బతినడంతో దానిని సరిచేసి ప్రతిష్ఠకి ఎలాంటి లోపాలు లేకుండా చూసుకున్నారు. మొదట స్వామివారిని ఓ తాటాకు పందిరిలో వుంచి పూజలు నిర్వహిస్తూ వుండేవారు. ఆ తరువాత గ్రామస్తులంతా కలిసి విరాళాలు వేసుకుని దేవాలయాన్ని నిర్మించారు. 1957లో రథసప్తమినాడు, ఈ నూతన ఆలయంలో స్వామివారి మూలవిరాట్టును ప్రతిష్ఠించారు. కాలక్రమంలో ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రాజగోపురం, కళ్యాణ మంటపం, అద్దాల మంటపం, అన్నదాన సత్రం, రథశాల మరియు కల్యాణకట్ట మొదలైనవి రూపుదిద్దుకున్నాయి. ఆలయ అభివృద్ధితో పాటు స్వామివారి మహిమలు కూడా వెలుగు చూశాయి.

ప్రత్యేక పూజలు[మార్చు]

సోమవారం, శుక్రవారంల్లో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి యేట ఫాల్గుణ మాసంలో ఆరు రోజుల పాటు రుక్మిణీ - సత్యభామ సమేతుడైన స్వామికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వైభవాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తుంటారు. భక్తులు తమకి తోచిన రీతిలో స్వామివారికి కానుకలు ముడుపులు సమర్పించుకుంటూ వుంటారు.

బ్రహ్మోత్సవాలు[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, ఫాల్గుణ మాసంలో, ఆరురోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ఈ కార్యక్రమానికి కృష్ణా, ఖమ్మం జిల్లాల నుడియేగాక, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి, లక్షలాది మంది భక్తులు తరలివచ్చెదరు. [4]

సమీప దేవాలయాలు[మార్చు]

మరకత రాజేశ్వరి

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

  1. ఈ గ్రామానికి చెందిన కావూరి వినయ్ కుమార్ 1995-2001 మధ్య ఎం.పీ.టీ.సీ. సభ్యులుగా మరియూ మండల పరిషత్తు ఉపాధ్యక్షులుగా పనిచేశారు. వీరు మరలా 2006-11 మధ్య ఈ గ్రామానికి సర్పంచిగా పనిచేశారు. ఇదే గ్రామానికి చెందిన వీరి సతీమణి శశిరేఖ 2001-2006 మధ్య జడ్.పీ.టీ.సీ సభ్యురాలిగా పనిచేశారు. [2]
  2. ఈ గ్రామానికి చెందిన శ్రీమతి చిన్నంశెట్టి సీతామహాలక్ష్మి, 2014,ఫిబ్రవరి-2న జరిగిన వి.ఆర్.వో. పరీక్షలలో 96 మార్కులు సాధించి, కృష్ణా జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,867 - పురుషుల సంఖ్య 1,481 - స్త్రీల సంఖ్య 1,386 - గృహాల సంఖ్య 871

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2926.[2] ఇందులో పురుషుల సంఖ్య 1565, స్త్రీల సంఖ్య 1361, గ్రామంలో నివాస గృహాలు 656 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 851 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Gampalagudem/Nemali". Retrieved 16 June 2016.  External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013,జులై-15; 8వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,ఫిబ్రవరి-23; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014,మార్చి-10; 11వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2015,నవంబరు-17; 10వపేజీ.