బంధువు

వికీపీడియా నుండి
(చుట్టరికాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆఫ్ఘనిస్తాన్లోని చాగ్గరన్ ఘౌర్ ప్రావిన్స్ లో బహుళ-తరాలతో విస్తరించిన కుటుంబం.

రక్త సంబంధము కలిగిన మానవులు, ఇక్కడ రక్త సంబధమును విస్తృతార్థములో ఉపయోగించాలి. మన సమాజములో సాధారణంగా వ్యక్తికి గానీ కుటుంబము నకు గానీ మరియొక వ్యక్తితో గానీ, కుటుంబముతో గానీ రక్త సంబంధము కలిగిన వారందరినీ బంధువులుగా గుర్తిస్తాము.

చుట్టరికాలు[మార్చు]

  • తల్లి : అమ్మ, మాతరం
  • తండ్రి : నాన్న : అయ్య, పితరం
  • అన్న : వయసులో పెద్ద ఐన సహోదరుడు.
  • తమ్ముడు : వయసులో చిన్న ఐన సహోదరుడు.
  • అక్క : వయసులో పెద్ద ఐన సహోదరి.
  • చెల్లెలు : వయసులో చిన్న ఐన సహోదరి.
  • తాత : తల్లి/తండ్రి యొక్క తండ్రి.
  • పితామహుడు : తండ్రి యొక్క తండ్రి., తాత
  • మాతామహుడు : తల్లి యొక్క తండ్రి, తాత
  • అమ్మమ్మ : తల్లి యొక్క తల్లి.
  • నాయనయ్య : తండ్రి యొక్క తండ్రి.
  • నాయనమ్మ : తండ్రి యొక్క తల్లి, మామ్మ, పితామహీం
  • ముత్తాత : తాత యొక్క తండ్రి,. ప్రపితామహం
  • తాతమ్మ : తాత యొక్క తల్లి, ప్రపితామహీం
  • జేజెమ్మ : నాయనమ్మ/అమ్మమ్మ యొక్క తల్లి
  • సవతి తల్లి : సాపత్నీమాతరం
  • పెదనాన్న : తండ్రి యొక్క అన్న, అన్న వరస ఐన ఇతర బదుంవులు, తల్లి యొక్క అక్క భర్త.
  • పెద్దమ్మ : తల్లి అక్క, అక్క వరస ఐన ఇతర బంధువులు, తండ్రి యొక్క అన్న భార్య.
  • మేనత్త : తండ్రి యొక్క సోదరి.
  • మేనమామ : తల్లి సోదరుడు.
  • మామ / మామయ్య : మేనత్త యొక్క భర్త.
  • అత్త / అత్తయ్య : మేనమామ భార్య.
  • మామగారు : భర్త/భార్య యొక్క తండ్రి.
  • అత్తగారు : భర్త/భార్య యొక్క తల్లి.
  • పిన్ని: తల్లి యొక్క చెల్లెలు, తండ్రి యొక్క తమ్ముని భార్య.
  • బాబాయి : తండ్రి యొక్క తమ్ముడు, తల్లి యొక్క చెల్లెలి భర్త.
  • బావ : తన కంటే పెద్ద వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క అన్నగారు.
  • బావమరిది : భార్య యొక్క సోదరుడు.
  • మరిది : తన కంటే చిన్న వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క తమ్ముడు.
  • తోడల్లుడు : భార్య యొక్క సహోదరి భర్త.
  • మరదలు : తన కంటే చిన్న ఐన అత్త లేక మామ కూతురు, భార్య చెల్లెలు, తమ్ముని భార్య.
  • వదిన : తన కంటే పెద్ద ఐన అత్త లేక మామ కూతురు, అన్నగారి భార్య.
  • ఆడపడుచు /ఆడబిడ్ద : భర్త యొక్క సహోదరి
  • తోడికోడలు/తోటికోడలు : భర్త యొక్క సహోదరుని భార్య.
  • భర్త: వివాహమాడిన పురుషుడు.
  • భార్య : వివాహమాడిన స్త్రీ.
  • కోడలు/కోడలుగారు : కుమారుని భార్య.
  • మేనకోడలు: భర్త సహోదరి కూతురు, భార్య సహోదరుని కూతురు.
  • అల్లుడు/అల్లుడుగారు: కుమార్తె యొక్క భర్త.
  • మేనల్లుడు : భర్త సహోదరి కొడుకు, భార్య సహోదరుని కొడుకు.

దగ్గరి బంధువులు[మార్చు]

ఒక వ్యక్తి/కుటుంబానికి సంబంధించిన సంతానము, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వారి సంతానము దగ్గరి బంధువులుగా పేర్కొంటాము. పైన పేర్కొనబడిన చుట్టరికం వున్న వాళ్ళని మనము దగ్గరి బంధువులు అంటాము.

దూరపు బంధువులు[మార్చు]

ఈ దగ్గరి బంధువుల బంధువులు, లేదా తాత, ముత్తాతల దగ్గరి బంధువులు మనకు దూరపు బంధువులు అయ్యే అవకాశం ఉంది.

లింకులు[మార్చు]

చూడు: చుట్టరికాలు

"https://te.wikipedia.org/w/index.php?title=బంధువు&oldid=3793109" నుండి వెలికితీశారు