Jump to content

మామ

వికీపీడియా నుండి
(మామయ్య నుండి దారిమార్పు చెందింది)

మామ, మామయ్య లేదా మామగారు అనునది ఒక బంధుత్వ సూచక పిలుపు. భార్య లేదా భర్త యొక్క తండ్రిని మామగా వ్యవహరిస్తుంటారు. కోడళ్ళే కాక గౌరవ సూచకంగా కూడా మామ వరుస అయ్యే వారిని మామగారు అని పిలుచుట జరుగుతుంది. తల్లి లేక పిన్ని యొక్క సోదరుడు కూడా వరుసకు మామ అవుతాడు. తల్లి సొదరుడ్ని మేనమామ అనీ, మేనమామ సంతానంతో వివాహాన్ని మేనరికము అని అంటారు.

  • మేనత్త : తండ్రి అక్క లేదా చెల్లెల్లిని మేనత్త అని పిలుస్తారు. మేనత్త భర్త మావయ్య అవుతాడు. మేన మామ కాడు.

మేనమామ: తల్లి అన్నయ్య లేదా తమ్ముడు మేనమామ అని పిలుస్తారు. మేనమామ భార్య (అత్త) అవుతుంది మేనత్త కాదు. దుర్మార్గుడైన మామ, మామయ్య, మేనమామను కంసమామ అంటారు. శ్రీకృష్ణుడు మేనమామ కంసుడు. కంసుడు శ్రీకృష్ణుడుని చంపాలని ప్రయత్నించి విఫలమౌతాడు. ఇక్కడ మేన పదం మేను (శరీరం) అనే అర్ధం. మేనమామ, మేనత్తలు తమ రక్తం పంచుకుపుట్టిన వారు అని, తమ మేనులో (శరీరంలో) భాగమని భావిస్తారు

"https://te.wikipedia.org/w/index.php?title=మామ&oldid=3917546" నుండి వెలికితీశారు