Jump to content

రోజులు మారాయి (1955 సినిమా)

వికీపీడియా నుండి
రోజులు మారాయి
(1955 తెలుగు సినిమా)

అప్పటి సినిమా పోస్టరు
దర్శకత్వం తాపీ చాణక్య
నిర్మాణం సి.వి.ఆర్.ప్రసాద్
రచన సి.వి.ఆర్.ప్రసాద్
కథ కొండేపూడి లక్ష్మీనారాయణ
చిత్రానువాదం తాపీ చాణక్య
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు (వేణు),
షావుకారు జానకి(భారతమ్మ),
వహీదా రెహమాన్,
చిలకలపూడి సీతారామంజనేయులు(సాగరయ్య),
రేలంగి వెంకట్రామయ్య(పోలయ్య),
రమణారెడ్డి(కరణం),
వల్లం నరసింహారావు,
అమ్మాజీ,
పి.హేమలత,
సూరపనేని పెరుమాళ్ళు,
కంచి నరసింహారావు
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం కృష్ణవేణి జిక్కి,
పిఠాపురం నాగేశ్వరరావు,
ఘంటసాల వెంకటేశ్వరరావు
గీతరచన కొసరాజు,
తాపీ ధర్మారావు
సంభాషణలు తాపీ ధర్మారావు
ఛాయాగ్రహణం కమల్ ఘోష్
నిర్మాణ సంస్థ సారధీ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అధిక పంటలు పండించే పధకం క్రింద తీసుకున్న 200 ఎకరాలను అక్రమంగా కౌలుకిచ్చి రైతులవద్ద నుండి ధాన్యాన్ని దోచుకొంటూ ఉంటాడు సాగరయ్య (సియ్యస్సార్). ఒక సారి కోటయ్య బంజరు భూమిలో కష్టపడి పండించుకున్న పంటను అక్రమ తీర్పు ద్వారా తన పాలేరుకు సగం పంట వచ్చేలా చేస్తాడు సాగరయ్య. అతని అన్యాయాన్ని కోటయ్య కొడుకైన వేణు ఊరి జనాలతో కలసి ఎదిరించి అతనికి బుద్ధి చెబుతాడు.

పాటలు

[మార్చు]
రోజులు మారాయి - సినిమా వీడియో
  • ఎరువాక సాగరోరన్నొ చిన్నన్న (గాయని: జిక్కి, గీతరచన: కొసరాజు, నటి: వహీదా రెహమాన్)
  • ఓలియొ ఒలి ఓలియొ ఓలి రారెదు కలవాద రారా పొలి , ఘంటసాల,బృందం , రచన:కొసరాజు
  • ఇదియే హాయ్ కలుపుమ చేయీ, ఘంటసాల, జిక్కీ, రచన: తాపీ ధర్మారావు
  • రండయ్యా పోదాం , ఘంటసాల,బృందం , రచన: కొసరాజు
  • చిరునవ్వులు వీచే ,ఘంటసాల, జిక్కి, ఎం.కృష్ణ కుమారి , రచన: కొసరాజు
  • మా రాజ వినవయ్యా , ఘంటసాల, జిక్కి , రచన: కొసరాజు

మూలాలు

[మార్చు]