వల్లం నరసింహారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యువతరం కదిలింది సినిమాలో ప్రభాకరరెడ్డితో వల్లం నరసింహారావు

వల్లం నరసింహారావు సినిమా మరియు రంగస్థల నటుడు, వ్యాఖ్యాత మరియు ప్రజా కళాకారుడు. ఇతడు 2006, మార్చి 13వ తేదీన 79 ఏళ్ల వయసులో హైదరాబాదులో గుండెపోటుతో మరణించాడు[1]. ఇతడు ప్రజా నాట్యమండలి కళాకారుడిగా ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. కృష్ణా జిల్లా,తిరువూరుకు చెందిన వల్లం నరసింహారావు 1952లో సినీరంగ ప్రవేశం చేశాడు. మా భూమి వంటి నాటకాల్లో నటించి ఈయన జైలు శిక్ష అనుభవించాడు. కులదైవం, ముద్దుబిడ్డ సినిమాల్లో ఈయన హీరోగా నటించాడు. ఇంకా పలు చిత్రాల్లో నటించాడు. నటుడు బి.పద్మనాభంతో కలిసి రేఖా అండ్ మురళి పతాకంపై పలు చోట్ల నాటకాలు ప్రదర్శించాడు.

సినిమాలు[మార్చు]

నాటకాలు[మార్చు]

  1. మాభూమి
  2. కాళహస్తి మహాత్మ్యం
  3. శాంతి నివాసం
  4. ఇన్‌స్పెక్టర్ జనరల్[2]

మూలాలు[మార్చు]

  1. ప్రజాకళాకారుడు వల్లం నరసింహారావు కన్నుమూత
  2. ఉత్తమ నాటకం ఇన్‌స్పెక్టర్ జనరల్, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 7 ఆగస్టు 2017, పుట.14

బయటిలింకులు[మార్చు]