లక్ష్మీనరసింహా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్మీనరసింహా
(2004 తెలుగు సినిమా)
దర్శకత్వం జయంత్ సి. పరాంజి
నిర్మాణం బెల్లంకొండ సురేష్
తారాగణం నందమూరి బాలకృష్ణ,
ఆశిన్,
రక్షిత,
ప్రకాష్ రాజ్,
కె. విశ్వనాధ్,
కృష్ణ భగవాన్
సంగీతం మణిశర్మ
సంభాషణలు పరుచూరి బ్రదర్స్, హరి
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ జనవరి 14, 2004
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

లక్ష్మీనరసింహా, 2004 జనవరి 14వ తేదీన సంక్రాంతికి విడుదలైన ఒక తెలుగు సినిమా. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం లో నందమూరి బాలకృష్ణ , ఆసిన్, రక్షిత నటించారు. ఈచిత్రానికి దర్శకత్వం జయంత్ సి పరాన్జీ కాగా, సంగీతం మణిశర్మ అందించారు. ఇది ఇంతకు ముందు తమిళంలో విజయవంతమైన "సామి" అనే సినిమాకు తెలుగు పునర్నిర్మాణం.

నటీనటులు

[మార్చు]

"లక్ష్మీ నరసింహ" (బాలకృష్ణ) ఒక నిజాయితీగల, చాలా స్ట్రిక్ట్ అయిన పోలీస్ ఆఫీసర్. కాని నేరగాళ్ళను అణచి వేయడానికి ముదురుగా, ఒకోమారు చట్టం పరిధికి అతీతంగా వ్యవహరిస్తుంటాడు. ఒకానొకప్పుడు ధర్మభిక్షం (ప్రకాష్ రాజ్) అనే గూండా నాయకుని కారణంగా హీరో చిన్నతనంలో పల్లెటూరిలో అతని చెల్లి దూరమయ్యింది, ఆస్తి నాశనమయ్యింది. తరువాత విజయవాడలో పోలీస్ ఆఫీసర్‌గా వెళ్లీన కథానాయకుడు అక్కడి రౌడీనాయకుడు ధర్మభిక్షం నుండి ఒకటిన్నర కోట్ల "లంచం" తీసుకొని తన వూరిలో దగాపడినవారిని ఆదుకొంటానికి వాడుతాడు. తరువాత ధర్మభిక్షం అసలు సంగతి తెలుసుకొంటాడు. ఇక హీరో, విలన్ల మధ్య ప్రత్యక్షమైన యుద్ధం ప్రారంభమౌతుంది.

హిట్టయిన డైలాగులు

[మార్చు]

రాజూ అప్పటికప్పుడే చంపుతాడు,దేవుడు ఆ పాపం పండాక చంపుతాడు,కాని నేను సాక్ష్యం లేకుండా చంపుతాను.

పాటలు

[మార్చు]
  • దేవున్నీ అడిగానంటే..... రాడు రాడూ ఎంతో బిజీ , రచన: రచన: చంద్రబోస్, గానం. శంకర్ మహదేవన్
  • అందంలో ఆంధ్రా కోస్తా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషల్
  • ఆకేసుకో పప్పేసుకో, రచన: చంద్రబోస్ ,గానం. మల్లికార్జున్, మహాలక్ష్మి అయ్యర్
  • మరుమల్లి జాబిల్లి, రచన: చంద్రబోస్, గానం. శంకర మహదేవన్, మురళీధర్, శ్రీ వర్దిని
  • కుడి కన్ను కొడితే, జడతోటి కొడితే, రచన: చంద్రబోస్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్
  • నాతోటి నీకు పనుంది , రచన: చంద్రబోస్, గానం.కార్తీక్, మహాలక్ష్మి అయ్యర్

బాక్సాఫీసు

[మార్చు]
  • 272 కేంద్రాలలో 50 రోజులు, 87 కేంద్రాలలో 100 రోజులు

బయటిలింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]