కృష్ణ భగవాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణ భగవాన్
Krishnabhagavan.jpg
జన్మ నామంమీనవల్లి పాపారావ్ చౌదరి
జననం (1965-07-02) 1965 జూలై 2 (వయస్సు: 53  సంవత్సరాలు)
ఇతర పేర్లు కుట్ట
ప్రముఖ పాత్రలు ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
టాటా..బిర్లా..మధ్యలో లైలా
ఎవడి గోల వాడిది

కృష్ణ భగవాన్ ఒక ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్య నటుడు. ఇతని అసలు పేరు మీనవల్లి పాపారావు చౌదరి.[1] ప్రముఖ దర్శకుడు వంశీ తన మహర్షి చిత్రం ద్వారా ఈయనను తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయం చేసారు.

నేపధ్యము[మార్చు]

పాపారావు చౌదరి 1965, జూలై 2 న తూర్పుగోదావరిజిల్లా, కైకావోలు గ్రామములో మీనవల్లి వీర్రాజు, లక్ష్మీకాంతం దంపతులకు జన్మించాడు. వీరిది ఉమ్మడి కుటుంబము.

విద్యాభ్యాసము[మార్చు]

ఇతడి ప్రాథమికవిద్యాభ్యాసము స్వగ్రామమైన కైకవోలులో పూర్తిచేసి పాఠశాల విద్యకోసం కాకినాడలో పూర్తిచేశాడు. ఇంటర్ విద్యను ఆండాలమ్మ కళాశాల లో పూర్తిచేసాడు. తర్వాత హైదరాబాదులో బాగ్ లింగంపల్లి లోని అంబేద్కర్ కళాశాల నుండి బీకాం పూర్తిచేశాడు. అటుపై చదవాలనే ఆశ ఉన్నా బి.కాంలోని అత్తెసరు మార్కుల కారణంగా ఏ కళాశాల అతడిని అనుమతివ్వని కారణంగా చదువు పట్ల ఆసక్తిని తగ్గించి నటనపై పెంచుకొన్నాడు.

నట జీవితము[మార్చు]

పాఠశాలలో తన పెద్దన్న మంగరాజు బలవంతంపై పెండింగ్ ఫైల్ అనే నాటకంలో తొలిసారిగా పరంధామయ్య పాత్రను పోషించాడు. అటుపై దాదాపు అందరు తెలుగు సినీ నటుల్లాగానే ఇతడు కూడా నటనావకాశాల కోసం మద్రాసు చేరుకొన్నాడు.అక్కడ మిత్రబృందంతో కలిసి అప్పటి ప్రముఖ నటి అనూరాధ ఇంట్లోని మేడమీది గదిలో అద్దెకు ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నించేవాడు. ఇంటిదగ్గరినుండి నెల నెలా డబ్బులు పంపిస్తుండటంతో బ్రతుకుతెరువు కోసం వేరే వృత్తిని చేసే పని తప్పింది.

వ్యక్తిగత జీవితము[మార్చు]

ఇతను తన పెద్దక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె.ప్రస్తుతము హైదరాబాదులో ఉన్నత విద్యను చదువుతున్నది.

అపఖ్యాతి[మార్చు]

ఇతను ఒక ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవంలో తాగి, వేదిక నెక్కి ప్రముఖ కవి, విద్వాంసుడు మరియు సహస్రావధాని అయిన గరికపాటి నరసింహారావు గారిని తూలనాడి అపఖ్యాతి పొందాడు[2][3][4]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రము పాత్ర ఇతర వివరములు
2016 నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్
2014 పాండవులు పాండవులు తుమ్మెద
అలా ఎలా?
2013 ఆడు మగాడ్రా బుజ్జీ
2011 వీడు తేడా
వనకన్య వండర్ వీరుడు
2010 శక్తి(2010 సినిమా)
మనసారా
ఏమైంది ఈవేళ
సరదాగా కాసేపు
2009 దేశద్రోహులు నమిత కథానాయిక
గోపి గోపిక గోదావరి జూలై 10, 2009 న విడుదలైనది.
కుబేరులు కథానాయకుడు, హాస్య చిత్రము
2008 మిస్టర్ గిరీశం కథానాయకుడు
కింగ్ కోన వెంకట్
కంత్రీ అతిధి పాత్ర
దొంగ సచ్చినోళ్ళు రంభ హాస్య చిత్రము
బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ కథానాయకుడు హాస్య చిత్రము
జాన్ అప్పారావ్ 40 ప్లస్ తొలిసారి కథానాయకుడు గా పరిచయం ద్విపాత్రాభినయము, సిమ్రాన్ కథానాయిక
మంగతాయారు టిఫిన్ సెంటర్
నిండు పౌర్ణమి విడుదల కాలేదు
2007 భజంత్రీలు
పెళ్ళైంది..కానీ
మీ శ్రేయోభిలాషి
యమగోల మళ్ళీ మొదలైంది నారదుడు
టాస్
దుబాయి శీను పట్నాయక్ విజయవంతమైన చిత్రం
ఎవడైతే నాకేంటి
టాటా..బిర్లా..మధ్యలో లైలా బిర్లా హాస్య చిత్రము,విజయవంతమైన చిత్రం
ఆమ్మ చెప్పింది వంట వాడు
2006 మాయాజాలం దయ్యం
రాఖీ మంత్రి గారి సహాయకుడు అతిధి పాత్ర
రాజబాబు
ఏవండోయ్ శ్రీవారు
2005 అందరివాడు
కాంచనమాల కేబుల్ టివి
అల్లరి బుల్లోడు
అదిరిందయ్యా చంద్రం
ఎవడి గోల వాడిది కడప రెడ్డెమ్మ భర్త హాస్య చిత్రము,విజయవంతమైన చిత్రం
కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను
2004 మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి గైడ్ దేవానంద్
సారీ.. నాకు పెళ్ళైంది
సాంబ పశుపతి నౌకరు
వెంకీ రైలు ప్రయాణీకుడు
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్
లీలామహల్ సెంటర్
ఆప్తుడు
మీ ఇంటికి వస్తే ఏమిస్తారు.. మా ఇంటికి వస్తే ఏంతెస్తారు
చెప్పవే చిరుగాలి
ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు
Xట్రా
అందరూ దొంగలే దొరికితే
శంఖారావం
2003 లక్ష్మి నరసింహ పోలీస్ ఇన్స్ పెక్టర్
శ్రీరామచంద్రులు
దొంగరాముడు అండ్ పార్టీ
కబడ్డి కబడ్డి బోసు
ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిట్టిబాబు విజయవంతమైన చిత్రం
1991 ఏప్రిల్ 1 విడుదల గోపీచంద్ చిత్ర రచయిత కూడా
1988 మహర్షి ఇన్స్ పెక్టర్ ప్రతాప్ మొదటి చిత్రం

మూలాలు[మార్చు]

  1. వేమూరి, రాధాకృష్ణ. "ఓపెన హార్ట్‌ విత్ ఆర్కేలో నటుడు కృష్ణ భగవాన్". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Retrieved 10 November 2016.
  2. http://www.greatandhra.com/viewnews.php?id=25641&cat=1&scat=4
  3. http://www.youtube.com/watch?v=fVKoWXcFdt8
  4. http://www.youtube.com/watch?v=urETV5vr-8o

బయటి లింకులు[మార్చు]