అలా ఎలా?

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలా ఎలా?
(2014 తెలుగు సినిమా)
Ala ela.jpg
దర్శకత్వం అనీష్ కృష్ణ
నిర్మాణం అశోక్ వర్ధన్
కథ అనీష్ కృష్ణ
తారాగణం రాహుల్ రవీంద్రన్,
వెన్నెల కిశోర్,
హెబ్బా పటేల్,
షాని,
ఖుషీ,
భానుశ్రీ మెహ్రా,
రవి వర్మ
సంగీతం భీమ్స్
సంభాషణలు అనీష్ కృష్ణ
ఛాయాగ్రహణం సాయి శ్రీరామ్
కళ భాస్కరరాజు
నిర్మాణ సంస్థ అశోకా క్రియేషన్స్
భాష తెలుగు

అలా ఎలా? 2014, నవంబర్ 28న విడుదలైన కామెడీ సినిమా. ఈ చిత్రం ద్వారా హెబ్బా పటేల్ తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయం అయ్యింది.[1]

నటీనటులు[మార్చు]

కథ[మార్చు]

రెండు కోట్లు కట్నం వస్తుందని తనకి అస్సలు తెలియని దివ్య (ఖుషి) అనే పల్లెటూరి అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధపడిపోతాడు కార్తీక్‌ (రాహుల్‌). అయితే పెళ్లికి ముందు ఆమె ఎవరనేది అస్సలు తెలీకపోవడం కంటే తనని పరిచయం చేసుకుని, ప్రేమించి... పెళ్లిలో సర్‌ప్రైజ్‌ ఇస్తే బాగుంటుందని తన స్నేహితులు (వెన్నెల కిషోర్‌, షాని) ఇద్దరితో కలిసి ఆమె ఊరికి వెళతాడు. అక్కడ దివ్య స్నేహితురాలు శృతి (హెబ్బా పటేల్‌) సాయం తీసుకుని దివ్యకి దగ్గర కావాలనుకుంటాడు[2].

పాటలు[మార్చు]

ఈ సినిమాలో మొత్తం 6 పాటలున్నాయి. వీటికి భీమ్స్ సెసిరోలియో సంగీతం సమకూర్చాడు. వీటీని సిరివెన్నెల సీతారామశాస్త్రి, వనమాలి, భీమ్స్ సెసిరోలియో రచించారు.

క్రమ సంఖ్య పాట గాయనీ గాయకులు నిడివి
1 నో నో మిస్టేక్ రంజిత్ 3:57
2 ప్రతి చినుకులో నన్ను తడవనీ ప్రణవి 3:38
3 ఎదుట పడదు అని తెలుసా తనకు హరీష్ రాఘవేంద్ర 4:39
4 ఎదుట కలదు సూరజ్ 3:42
5 ధనక్ ధనక్ నేహా కక్కర్ 2:27
6 ఎందుకే సూరజ్ 4:17

పురస్కారాలు[మార్చు]

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2014 నంది పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం సాయిశ్రీ రామ్[3] విజేత

మూలాలు[మార్చు]

  1. Ala Ela Movie Review, Times of India, 30 November 2014
  2. గణేష్ రావూరి. "సినిమా రివ్యూ: అలా ఎలా?". గ్రేట్ ఆంధ్ర. Retrieved 18 January 2018.
  3. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు (14 November 2017). "2014 నంది అవార్డులు". Retrieved 18 January 2018. Cite news requires |newspaper= (help)

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అలా_ఎలా%3F&oldid=2290419" నుండి వెలికితీశారు