కొండవలస లక్ష్మణరావు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కొండవలస లక్ష్మణరావు
Kondavalasa.jpg
జన్మ నామం కొండవలస లక్ష్మణరావు
జననం (1946-08-10) ఆగష్టు 10, 1946 (వయస్సు: 69  సంవత్సరాలు) /1946, ఆగస్టు 10
ప్రముఖ పాత్రలు ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం లో పొట్టిరాజు,
ఎవడి గోల వాడిది లో బక్కరెడ్ది

కొండవలస లక్ష్మణరావు గారు సుప్రసిద్ద తెలుగు నాటక మరియు చలనచిత్ర నటులు. వీరు మొదట నాటక రంగం లో లబ్ద ప్రతిష్టులు. పిమ్మట ప్రసిద్ద దర్శకులు వంశీ, తన ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం తో వీరిని తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయం చేసారు. ఇప్పటి వరకూ సుమారు 200 సినిమాల్లో నటించాడు.

ఆయనది శ్రీకాకుళం జిల్లా లోని కొండవలస అనే పల్లెటూరు. ఆయన ఇంటిపేరు కూడా అదే. తండ్రి రైల్వే ఉద్యోగి. కళాశాల చదువు విశాఖపట్టణం లో సాగింది. కళాశాలలో ఉండగానే నాటకాలు బాగా వేసేవాడు. డిగ్రీ పూర్తవగానే విశాఖ పోర్టు ట్రస్ట్ లో గుమాస్తాగా ఉద్యోగం దొరికింది. ఉద్యోగం చేస్తూ కూడా అందులోని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు.

సినిమా రంగంలో దర్శకుడు వంశీ ఆయనకు మొదటగా ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో అవకాశం ఇచ్చాడు. నాటకరంగంలో ఆయనకు 378 అవార్డులు వచ్చాయి. అందులో రెండు నంది అవార్డులు కూడా ఉన్నాయి. నవరాగం అనే నాటకానికి ఉత్తమ నటుడు, కేళీ విలాసం అనే నాటకంలో ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డులు లభించాయి.

ఆయన కుమారుడు మణిధర్ కూడా సినీరంగంలోనే ఉన్నాడు.

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరము చిత్రము పాత్ర ఇతర వివరములు
2011 సాయి సంకల్పం
తెలుగమ్మాయి
2010 సరదాగా కాసేపు
కలెక్టర్ గారి భార్య
2008 సవాల్
కృషి
నవ్వులే నవ్వులు
నిండు పౌర్ణమి
నీ సుఖమే నే కోరుతున్నా
వీడు మామూలోడు కాదు
2007 భజంత్రీలు
ఆట
ఆదివారం ఆడవాళ్లకు సెలవు
భూకైలాస్
మధుమాసం
అత్తిలి సత్తిబాబు ఎల్.కే.జి హాస్య చిత్రము,విజయవంతమైన చిత్రం
రాఖీ రైల్వే కూలీ విజయవంతమైన చిత్రం
2006 ఒక విచిత్రం
శ్రీకృష్ణ2006
అందాల రాముడు విజయవంతమైన చిత్రం
హ్యాపి అతిధి పాత్ర
వీరభద్ర
ఒక ఊరిలో
చుక్కల్లో చంద్రుడు
జై చిరంజీవ
2005 ఎవడి గోల వాడిది బక్కరెడ్డి హాస్య చిత్రము,విజయవంతమైన చిత్రం
కాంచనమాల కేబుల్ టివి
పందెం
రాజాబాబు
దొంగరాముడు అండ్ పార్టీ
శ్రీరామచంద్రులు విజయవంతమైన చిత్రం
కబడ్డి కబడ్డి విజయవంతమైన చిత్రం
2004 సూర్యం
ఆప్తుడు
శత్రువు
దొంగ ..దొంగది ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ తొలి చిత్రము
పళ్ళకిలో పెళ్ళీకూతురు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ తొలి చిత్రము
Xట్రా
సారీ.. నాకు పెళ్ళైంది
మీ ఇంటికి వస్తే ఏమిస్తారు.. మా ఇంటికి వస్తే ఏంతెస్తారు
ఆనందమానందమాయె
2003 ఎవరే అతగాడు
ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు పొట్టి రాజు తొలి చిత్రము, ఘన విజయం

బయటి లింకులు[మార్చు]