దొంగ - దొంగది
దొంగ - దొంగది (2004 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సుబ్రమణ్యం శివ |
---|---|
నిర్మాణం | శానం నాగ అశోక్‌కుమార్, ఎన్.వి.ప్రసాద్ |
రచన | సుబ్రమణ్యం శివ |
తారాగణం | మంచు మనోజ్ కుమార్ సదా |
సంగీతం | దిన |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
విడుదల తేదీ | 2004 |
భాష | తెలుగు |
దొంగ - దొంగది 2004.ఆగస్టు6 న శ్రీ సాయి దేవా ప్రొడక్షన్స్ పతాకంపై మంచు మనోజ్, సదా, సునీల్, రాజీవ్ కనకాల నటించిన ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రo సుబ్రహ్మణ్యం శివ దర్శకత్వం లో, ధిన సంగీతం లో రూపొందించ బడింది . తమిళ తమిళంలో సూపర్‌హిట్ అయిన తిరుడా తిరుడి పేరిట రీమేక్ చేసిన ఈ చిత్రం.
సంక్షిప్త చిత్రకథ
[మార్చు]బేవార్సుగా తిరిగే వాసు (మనోజ్), విజ్జి (సదా) తిట్టుకుంటూనే ఒకరినొకరు ఇష్టపడుతారు. విజ్జి వలన వాసు తన తండ్రి ఇచ్చిన డబ్బును పోగొట్టుకోవాల్సి వస్తుంది. తండ్రి చెడామడా తిట్టడంతో తిరుపతి నుంచి వైజాగ్ వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. విజ్జికి కూడా వైజాగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే, విజ్జి వాసుపై విపరీతమైన ఇష్టం పెంచుకుంటుంది. వేరే అమ్మాయితో వాసు కలిసి నడిచినా, యుద్దానికి దిగుతుంది. వాసు తన ప్రేమ నిరాకరించడంతో విజ్జి ఆత్మహత్యకు యత్నించడం, అనంతరం వాసు తన ప్రేమను కాపాడుకోవడం, తండ్రికి తన ఎదుగుదలను చూపించుకోవడం మిగతా కథ.
తారాగణం
[మార్చు]- మంచు మనోజ్
- సదా
- తనికెళ్ళ భరణి
- రాజీవ్ కనకాల
- సునీల్
- మాణిక్య వినాయగమ్
- వర్షిత
- తేజశ్రీ
- తెలంగాణ శకుంతల
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- కొండవలస లక్ష్మణరావు
- ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం
- శివారెడ్డి
- చిత్తజల్లు లక్ష్మీపతి
- గౌతంరాజు
- మల్లాది రాఘవ
- అనంత్
- జూనియర్ రేలంగి
- గుండు హనుమంతరావు
- జెన్నీ.
- వర్ష
పాటలు
[మార్చు]- మన్మధ రాజా , వేటూరి సుందర రామమూర్తి, గానం. శంకర మహదేవన్, మాలతి
- అందంగుంటారు, రచన: భువన చంద్ర , గానం.టీప్పు
- వాన వాన , రచన: కుల శేఖర్ , గానం.కె.ఎస్.చిత్ర
- భాగ్యనగర్ బంపర్, రచన: కందికొండ యాదగిరి , గానం. ఉదిత్ నారాయణ్, రాధిక
- సొట్ట బుగ్గ , రచన: కందికొండ , గానం.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం , స్వర్ణలత
- నిన్ను చూసినప్పుడు , రచన: కులశేఖర్ , గానం.కార్తీక్