ఎలుకా మజాకా
ఎలుకా మజాకా | |
---|---|
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
స్క్రీన్ ప్లే | దివాకర్ బాబు గంగోత్రి విశ్వనాథ్ |
కథ | రేలంగి నరసింహారావు |
నిర్మాత | మారెళ్ళ నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు |
తారాగణం | వెన్నెల కిషోర్ బ్రహ్మానందం పావని రఘుబాబు |
ఛాయాగ్రహణం | నాగేంద్ర కుమార్ మోతుకూరి |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | బల్లెపల్లి మోహన్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 26, 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఎలుకా మజాకా 2016, ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, పావని, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, బల్లెపల్లి మోహన్ సంగీతం అందించాడు. నా ఫ్రెండ్స్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మారెళ్ళ నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం రేలంగి నరసింహరావుకు 75వ చిత్రం.[1]
కథా సారాశం
[మార్చు]హైదరాబాద్‌లో జరిగే అనేక కార్యక్రమాలకు పూలు సరఫరా చేసే వ్యాపారం చేస్తున్న బాలు (వెన్నెల కిషోర్), చెప్పిన టైమ్‌కి రాకపోయినా, చెప్పిన పని చేయకపోయినా విచిత్రమైన కండిషన్లతో ఇబ్బంది పెట్టే రఘుబాబు కూతురిని ప్రేమిస్తాడు. ఈ క్రమంలోనే రఘుబాబు కండిషన్‌కు కట్టుబడి ఉండేందుకు వెన్నెల కిషోర్, వినాయకుడిని కూడా లెక్కచేయకూడని పరిస్థితి వస్తుంది. దీంతో వినాయకుడి వాహనమైన ఎలుక అతడిని ఎలాగైనా శిక్షించాలని ఓ ఎలుక (బ్రహ్మానందం)ను అతడుండే ప్రదేశానికి పంపిస్తుంది.
కండిషన్స్ పెట్టే మామతోనే తట్టుకోవడం కష్టమనే పరిస్థితుల్లో వెన్నెల కిషోర్, ఈ ఎలుక పెట్టే ఇబ్బందులను కూడా ఎలా ఎదుర్కొన్నాడు? ఈ పరిస్థితులన్నీ అతడి కాపురంలో ఎలాంటి మార్పులు తెచ్చాయి? చివరకు వీటన్నింటినీ వెన్నెల కిషోర్ ఎలా ఎదుర్కొని బయటపడ్డాడు? అన్నది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- వెన్నెల కిషోర్ (బాలు)
- బ్రహ్మానందం (మూషిక)
- రఘుబాబు (చక్రవర్తి)
- పావని (స్వప్న)
- పింగ్ పాంగ్ సూర్య (సూర్య)
- శోభ (సమంత)
- అన్నపూర్ణ
- కొండవలస లక్ష్మణరావు
- అల్లరి సుభాషిణి
- తిరుపతి ప్రకాష్
- గీతాంజలి (రోజా)
- శ్రీలక్ష్మీ
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, దర్శకత్వం: రేలంగి నరసింహారావు
- నిర్మాత: మారెళ్ళ నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు
- చిత్రానువాదం: దివాకర్ బాబు, గంగోత్రి విశ్వనాథ్
- ఆధారం: ఇలాపావులూరి మురళీమోహన్ రావు రాసిన ఎలుకా వచ్చే ఇల్లు భధ్రం
- సంగీతం: బల్లెపల్లి మోహన్
- ఛాయాగ్రహణం: నాగేంద్ర కుమార్
నిర్మాణం
[మార్చు]ఇలాపావులూరి మురళీమోహన్ రావు రాసిన ఎలుకా వచ్చే ఇల్లు భధ్రం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.[2] దీనికి సంబంధించిన చిత్రానువాదంను దివాకర్ బాబు రాశాడు.
నిర్మాతలు మారెళ్ళ నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు, నటి పావనికి ఇది తొలి చిత్రం. ఈ చిత్రంలో దాదాపు నలభై నిమిషాలపాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉన్నాయి. దర్శకుడు నరసింహారావు కంప్యూటర్ గ్రాఫిక్స్ తో పనిచేసిన మొదటి చిత్రం కావడంతో అమ్మోరు, దేవి పుత్రుడు, అంజి, అరుంధతి వంటి సినిమాల్లోని గ్రాఫిక్స్ సృష్టించిన దర్శకుడు కోడి రామకృష్ణ సలహా తీసుకున్నారు.[3]
నాగేంద్ర కుమార్ గతంలో రేలంగి దర్శకత్వం వహించిన 16 సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.[4] తొలిసారిగా ఈ చిత్రానికి సంగీతం అందించిన బల్లెపల్లి మోహన్, గతంలో వందేమాతరం శ్రీనివాస్ కు సహాయకుడిగా పనిచేశాడు.[1] సగిలి సత్యనారాయణ రెడ్డి ఈ చిత్రానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ అందించాడు.[1]
పాటలు
[మార్చు]2015, నవంబరు 7న పాటల అవిష్కరణ జరిగింది. సినీ దర్శకుడు దాసరి నారాయణరావు పాటలను ఆవిష్కరించి, తొలి సీడీని రాజేంద్రప్రసాద్‌కు అందించాడు. ఈ కార్యక్రమంలో నటులు గిరిబాబు, విజయ నరేష్, దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[5]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "శ్లోకం" | హని | |
2. | "ఎలుకా మజాకా" | సింహ | |
3. | "గల్ గల నువ్వే" | అంజనా సౌమ్య, సాయి చరణ్ | |
4. | "మస్తున్నది" | శ్రావణ భార్గవి |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Yeluka Majaka Audio Released Archived 2019-12-27 at the Wayback Machine, Ragalahari
- ↑ Eluka Majaka in Re-recording Archived 2016-03-04 at the Wayback Machine, Myfirstshow.com
- ↑ The Hindu, Metro Plus (31 August 2015). "The mouse game". The Hindu (in Indian English). Y. Sunita Chowdhary. Retrieved 27 December 2019.
- ↑ Camera Angles, Twitter
- ↑ సాక్షి, సినిమా (8 November 2015). "ఇండియాలోనే గొప్ప స్క్రీన్‌ప్లే రైటర్ రేలంగి". Sakshi. Archived from the original on 26 డిసెంబరు 2019. Retrieved 26 December 2019.