శ్రావణ భార్గవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రావణ భార్గవి
SravanaBhargavi.jpg
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంశ్రావణ భార్గవి
జననం (1989-08-16) August 16, 1989 (age 33) [1]
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
వృత్తినేపథ్య గాయని
క్రియాశీల కాలం2009-ఇప్పటి వరకు
వెబ్‌సైటుwww.sravanabhargavi.com

శ్రావణ భార్గవి ఒక సినీ గాయని, అనువాద కళాకారిణి, గీత రచయిత్రి. పలు తెలుగు చిత్రాలలో పాశ్చాత్య శైలిలో పాటలు పాడింది. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు హేమచంద్రను ప్రేమ వివాహం చేసుకుంది. బిగ్ ఎఫ్.ఎంలో ఒక కార్యక్రమానికి రేడియో జాకీగా కూడా వ్యవహరించింది.

విద్యాభ్యాసము[మార్చు]

ప్రాథమిక విద్యను హైదరాబాద్ లోనే పూర్తిచేసింది. చదువుతున్నప్పుడే సంగీతం పై మక్కువ చూపేది. సంగీత శిక్షణను కొనసాగిస్తూ పలు పోటీలలో పాల్గొని విజేతగా నిలిచింది. తర్వాత కొన్ని పాటలను తనే రచించి, పాడింది. అవి విన్న పలువురు సంగీత దర్శకులు ఈమెకు అవకాశాలను ఇచ్చారు. హైదరాబాద్ లోని విజ్ఞాన్ కళాశాల నుండి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతము ఎంబీయే చదువుతున్నది.

నేపథ్య గానం చేసిన చిత్రాలు[మార్చు]

గాత్రదానం (డబ్బింగ్) చెప్పిన చిత్రాలు[మార్చు]

వార్తలలో శ్రావణ భార్గవి[మార్చు]

2014 రోడ్డు ప్రమాదం[మార్చు]

ఈవిడ 2014 జనవరి 22 బుధవారం నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నది. విజయవాడలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. శ్రావణి ప్రమాణిస్తున్న కారుకు ఎదురుగా చిట్యాల శివారులో రాంగ్‌రూట్‌లో ఓ ట్రాక్టర్ రాగా, దాన్ని తప్పించబోయిన శ్రావణి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారు టైరు పగిలి నిలిచిపోవడంతో ప్రమాదం తప్పింది. ఆనంతరం ఆమె భర్త, గాయకుడు హేమచంద్ర సంఘటన స్థలానికి చేరుకుని, శ్రావణభార్గవిని మరో కారులో విజయవాడకు తీసుకెళ్లారు.[2]

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Biography ~ Sravana Bhargavi". sravanabhargavi.com. 2013-02-14. Archived from the original on 2013-03-08. Retrieved 2013-04-02.
  2. "గాయని శ్రావణ భార్గవికి తప్పిన ప్రమాదం". Sakshi. 2014-1-23. Retrieved 2014-01-23. {{cite web}}: Check date values in: |date= (help)