లవ్ ఫెయిల్యూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లవ్ ఫెయిల్యూర్
(2012 తెలుగు సినిమా)
Love Failure poster.jpg
దర్శకత్వం బాలాజీ మోహన్
నిర్మాణం సిద్దార్థ్
శశికాంత్ శివాజీ
నిరవ్ షా
కథ బాలాజీ మోహన్
చిత్రానువాదం బాలాజీ మోహన్
తారాగణం సిద్దార్థ్
అమలా పాల్
సంగీతం ఎస్.ఎస్. తమన్
ఛాయాగ్రహణం నిరవ్ షా
నిర్మాణ సంస్థ Y NOT స్టూడియోస్
భాష తెలుగు

బాలాజీ మోహన్ దర్శకత్వం లో సిద్దార్థ్, అమలా పాల్ జంటగా నటించిన ద్విభాషాచిత్రం లవ్ ఫెయిల్యూర్. ఈ చిత్ర తమిళ పేరు "కాదల్ సొదప్పువది ఎప్పిడి". ఈ చిత్రం నేటి ప్రేమజంటల స్వభావాన్ని, వారు విడిపోవడానికి గల ముఖ్యకారణాలు మరియూ వాటిని అధిగమించి ప్రేమలో నెగ్గాల్సిన విధానాలను పాత్రల ద్వారా వివరించబడింది. సిద్దార్థ్, శశికాంత్ శివాజీ, నిరవ్ షా ల స్వీయనిర్మాణంలో తెలుగు, తమిళ భాషల్లో ఎకకాలంలో నిర్మించబడిన ఈ చిత్రం ఫిబ్రవరి 17, 2012 న విడుదలైంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో భారీవిజయాన్ని సాధించింది.[1]

కథ[మార్చు]

మొదటి సన్నివేశంలోనే పార్వతి (అమలా పాల్), అరుణ్ (సిద్ధార్థ్) విడిపోతారు. ఎందుకు విడిపోయారు అన్నది తరువాతి సన్నివేశం నుండి చూపించే ప్రయత్నం చేసారు. అరుణ్, పార్వతి ఒకే కాలేజీలో కలిసి చదువుకుంటుంటారు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడి విడి పోతారు. పార్వతి హైయ్యర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్లాలని అందుకు సంబంధించి ప్రిపరేషన్లో బిజీగా ఉంటుంది. ఇక అర్జున్ పార్వతిని మరిచి పోవడానికి తన ఫ్రెండ్స్ తో గడుపుతుంటాడు. పార్వతి పేరెంట్స్ అరవింద్ (సురేష్), సరు (సురేఖవాణి) ల లవ్ స్టోరీ ఈ యువ జంటలో మార్పు తెస్తోంది. వీరి తో పాటు వీరి స్నేహితుల ప్రేమకథలు కూడా ఈ జంటలో పరోక్షంగా మార్పు తెస్తాయి. ఎవరి జోక్యం లేకుండా ప్రేమ జంట ఒక్కటి కావడంతో ఈ ప్రేమకథ ముగుస్తుంది.

తారాగణం[మార్చు]

  • సిద్ధార్థ్ - అరుణ్
  • అమలా పాల్ - పార్వతి
  • రవి రాఘవేంద్ర - ప్రభు, అరుణ్ తండ్రి
  • శ్రీ రంజని - వసంతి, అరుణ్ తల్లి
  • సురేష్ - అరవింద్, పార్వతి తండ్రి
  • సురేఖవాణి - సరోజ, పార్వతి తల్లి
  • అర్జున్ - శివ, అరుణ్ స్నేహితుడు
  • విఘ్నేష్ - విఘ్నేష్, అరుణ్ స్నేహితుడు
  • దన్యా బాలకృష్ణ- రష్మి, విఘ్నేష్ ప్రేమించిన అమ్మాయి

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-12-26. Retrieved 2013-03-06.