అమలా పాల్
అమలా పాల్ | |
---|---|
![]() 2013 లో జరిగిన 60 వ సైమా పురస్కారాలలో అమలా పాల్ | |
జననం | |
ఇతర పేర్లు | అనఖ |
వృత్తి | నటి, రూపదర్శి |
క్రియాశీల సంవత్సరాలు | 2009 నుండి ఇప్పటివరకు |
జీవిత భాగస్వామి | ఎ. ఎల్. విజయ్ (m. 2014; div. 2017) |
అమలా పాల్ కేరళకు చెందిన సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.
నేపధ్యము[మార్చు]
ఈమె అసలు పేరు అనఖ . కేరళ లోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. వీరి కుటుంబము కేరళ లోని కొచ్చిలో స్థిరపడింది. తండ్రి వర్గీస్ పాల్, కేంద్రప్రభుత్వ ఉద్యోగి. తల్లి అన్నీస్ పాల్ గృహిణి. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. విద్యాభ్యాసాన్ని కోచిలో పూర్తిచేసింది.
నట జీవితము[మార్చు]
2009 లో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ లో ప్రవేశానికై ఒక సంవత్సరము విరామము తీసుకొంది. ఈ సమయంలో ఈవిడ చాయాచిత్రాలు చూసిని ప్రముఖ మలయాళ దర్శకుడు లాల్ జోస్ తన చిత్రం నీల తామర లో ఒక చిన్న పాత్రకు ఈమెను ఎంచుకున్నాడు. ఆచిత్రం విజయవంతము కానప్పటికి, అందులో ఈవిడ నటన విమర్శకుల ప్రశంసలు అందుకొంది. తరువాత తమిళ హాస్యచిత్రం వికడకవి లో ఒక పాత్రను పోషించింది. ఈ చిత్ర విడుదల బాగా ఆలస్యంగా జరిగి, ఈవిడ 6 వ చిత్రంగా విడుదలయ్యింది. ఈమధ్యలో వీర శేకరన్ , సింధు సామవేళి అనే తమిళ చిత్రాలలో నటించింది. సామి దర్శకత్వంలో వచ్చిన సింధు సామవేళిలో ఈమె పోషించిన సుందరి పాత్ర వివాదాలను సృష్టించింది. ఇందులో మావగారితో అక్రమ సంబంధాన్ని కొనసాగీచే కోడలి పాత్రలో నటించింది. తరువాత మైనా చిత్రంలో నటించింది. ఈ చిత్ర ఘనవిజయంతో అవకాశాలు వెల్లువెత్తాయి.
నటించిన చిత్రాలు[మార్చు]
తెలుగు[మార్చు]
- నాయక్ (సినిమా) (2013)
- ఇద్దరమ్మాయిలతో (2013)
- లవ్ ఫెయిల్యూర్ (2012)
- జెండాపై కపిరాజు (2015)[1]
- మేము (2016)
- ఆమె(2019)
వివాహం[మార్చు]
అమలా పాల్ 2014లో దర్శకుడు విజయ్‌తో వివాహం చేసుకొని 2017లో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె నటుడు జగత్ దేశాయ్ ను 2023 నవంబర్ 5న వివాహం చేసుకుంది.[2][3]
మూలాలు[మార్చు]
- ↑ "Nani-Amala Paul movie is Janda Pai Kapiraju". Times of India. 30 July 2012. Retrieved 10 January 2020.
- ↑ Eenadu (5 November 2023). "వైభవంగా అమలా పాల్ వివాహం.. ఫొటోలు షేర్ చేసిన వరుడు". Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
- ↑ Prabha News (5 November 2023). "ప్రియుడుని పెళ్లాడిన నటి అమలా పాల్." Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
బయటి లంకెలు[మార్చు]

- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అమలా పాల్ పేజీ
- ట్విట్టర్ లో అమలాపాల్