ఎ. ఎల్. విజయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎ.ఎల్.విజయ్
2016లో దేవి సినిమా ప్రమోషన్ లో ఎ.ఎల్.విజయ్
జననం
చెన్నై, భారతదేశం
వృత్తిచిత్ర దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅమలా పాల్ (m. 2014; div. 2017)
ఆర్. ఐశ్వర్య (m. 2019)
పిల్లలు1
తల్లిదండ్రులుఎ. ఎల్. అళగప్పన్ (తండ్రి)
బంధువులుఉదయ (సోదరుడు)

ఎ. ఎల్. విజయ్, తమిళ చిత్ర పరిశ్రమలో పనిచేసే భారతీయ చలనచిత్ర దర్శకుడు. వృత్తిపరంగా విజయ్ అని పిలుస్తారు, ప్రియదర్శన్ వద్ద సహాయ దర్శకుడుగా కెరీర్ మొదలుపెట్టాడు.[1] ఆయన కిరీడం (2017), విమర్శకుల ప్రశంసలు పొందిన మద్రాసపట్టణం వంటి చిత్రాలతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత రెండు చిత్రాలలో విక్రమ్ నటించిన దైవ తిరుమగల్, తాండవం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

ప్రారంభ జీవితం[మార్చు]

విజయ్ సినిమా కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి, ఎ. ఎల్. అళగప్పన్ ప్రముఖ సినీ నిర్మాత. తమిళనాడు నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు. అళగప్పన్ ఈసన్ చిత్రంతో సహా కొన్ని చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించాడు. విజయ్ సోదరుడు నటుడు ఉదయ (సెంథిల్ కుమార్).[2]

విజయ్ 2014 జూన్ 12న చెన్నైలో నటి అమలా పాల్‌ను వివాహం చేసుకున్నాడు.[3][4][5] అయితే, జూలై 2016లో వారు విడిపోయారు జూలై 2019లో, ఆయన డా. ఆర్. ఐశ్వర్యను తిరిగి వివాహం చేసుకున్నాడు.[6] 2020 మే 30న, ఈ దంపతులకు మొదటి సంతానంగా మగబిడ్డ జన్మించాడు.

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంవత్సరం సినిమా దర్శకత్వం రచన నిర్మాణం భాష నోట్స్
2007 కిరీడం అవును అవును కాదు తమిళం
2008 పోయి సొల్ల పోరం అవును అవును కాదు తమిళం
2010 మద్రాసపట్టినం అవును అవును కాదు తమిళం ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం (నామినేట్ చేయబడింది)

ఉత్తమ దర్శకుడిగా విజయ్ అవార్డు (నామినేట్ చేయబడింది)

2011 దైవ తిరుమగల్ అవును అవును కాదు తమిళం ఉత్తమ దర్శకుడిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం

ఉత్తమ చిత్రంగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం (రెండవ బహుమతి) నామినేట్ చేయబడింది, ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం

2012 తాండవం అవును అవును కాదు తమిళం
2013 తలైవా అవును అవును కాదు తమిళం
2014 శైవం అవును అవును కాదు తమిళం
2015 ఇదు ఎన్న మాయం అవును అవును కాదు తమిళం
ఒరు నాల్ ఇరవిల్ కాదు కాదు అవును తమిళం
2016 దేవి అవును అవును కాదు తమిళం తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలైంది.[7]
అభినేత్రి అవును అవును కాదు తెలుగు
టుటక్ టుటక్ టుటియా అవును అవును కాదు హిందీ
2017 వనమగన్ అవును అవును అవును తమిళం
2018 దియా అవును అవును కాదు తమిళం తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది.[8]
కణం అవును అవును కాదు తెలుగు
సిల సమయంగళిల్ కాదు కాదు అవును తమిళం
లక్ష్మి కాదు కాదు అవును తమిళం
2019 వాచ్ మాన్ కాదు కాదు అవును తమిళం
దేవి 2 కాదు కాదు అవును తమిళం [9]
అభినేత్రి 2 కాదు కాదు అవును తెలుగు
2021 కుట్టి కథ అవును కాదు కాదు తమిళం [10]
తలైవి అవును కాదు కాదు తమిళం [11]
హిందీ
చితిరై సెవ్వనం కాదు అవును అవును తమిళం జీ5 చిత్రం
ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అవును అవును అవును తమిళం జీ5 సిరీస్
2023 బూ అవును అవును కాదు తమిళం / తెలుగు [12]
2024 మిషన్: చాప్టర్ 1 - అచ్చం ఎన్బతు ఇల్లయ్యాయే అవును అవును కాదు తమిళం పోస్ట్ ప్రొడక్షన్

మూలాలు[మార్చు]

 1. Tamil Actor Vijay Filmography, Movies, Pictures and Videos. Jointscene.com
 2. Times of India
 3. "Amala Paul drowned in love, drenched in care". The Times of India. 16 January 2017.
 4. "Vijay, Amala Paul to tie the knot?". The Times of India.
 5. "Actress Amala Paul and filmmaker Vijay get married in Chennai". Biharprabha.com. Retrieved 12 June 2014.
 6. AL Vijay to marry
 7. "అభినేత్రి రివ్యూ". ఆంధ్రజ్యోతి. www.andhrajyothy.com. Archived from the original on 10 అక్టోబరు 2016. Retrieved 29 March 2018.
 8. Zee Cinemalu (2018). "రేపే 'కణం' గ్రాండ్ రిలీజ్" (in ఇంగ్లీష్). Archived from the original on 21 June 2022. Retrieved 21 June 2022.
 9. "'Abhinetri 2' first look teaser: This time two souls are all set to entertain the audience big time". Timesofindia.indiatimes.com. 16 April 2019.
 10. "Vijay Sethupathi, Amala Paul part of upcoming Tamil anthology 'Kutti Love Story'". The News Minute. 2 February 2021. Retrieved 6 February 2021.
 11. Eenadu (24 August 2021). "వచ్చే నెల 10న 'తలైవి' - Telugu News Thalaivi Release Date Fixed". Archived from the original on 30 August 2021. Retrieved 30 August 2021.
 12. "Rakul Preet Singh horror thriller 'BOO' gets OTT release - Beauty Pageants - Indiatimes". Femina Miss India. 2023-05-31. Retrieved 2023-05-31.