ఎ. ఎల్. అళగప్పన్
స్వరూపం
ఎ. ఎల్. అళగప్పన్ | |
---|---|
జననం | 1951 సెప్టెంబరు 18 |
వృత్తి | నటుడు, గాయకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1998-ప్రస్తుతం |
పిల్లలు | ఎ. ఎల్. విజయ్ (దర్శకుడు), ఉదయ (నటుడు) |
ఎ. ఎల్. అళగప్పన్ (జననం 1951 సెప్టెంబరు 18) తమిళ సినిమా రంగానికి చెందిన భారతీయ నటుడు, నిర్మాత. ఆయన కుమారులు ఎ. ఎల్. విజయ్ దర్శకుడుగా, ఉదయ నటుడుగా చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు.
కెరీర్
[మార్చు]ఆయన 2004 జూన్ 2006 వరకు తమిళనాడు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. సినిమాల క్లిప్‌లను వాడినందుకు సన్ టీవీ టెలివిజన్ నెట్‌వర్క్ పై దావా వేస్తాననడం వివాదాస్పదం అయింది.[1] అలాగే, ఇక సినిమా కోసమై ఫైనాన్షియర్ విశాల్ జైన్‌కి డబ్బు తిరిగి ఇవ్వడంలో విఫలమైనందుకు చీటింగ్ కేసులో ఆయన అరెస్టయ్యాడు.[2]
2010 నుండి, ఆయన సహాయ నటుడిగా చలనచిత్రాలలో చేస్తున్నాడు. ముఖ్యంగా ఎం. శశికుమార్ రూపొందించిన ఈసన్ (2010)లో ప్రతికూల పాత్రకు ఆయన అవార్డు ప్రతిపాదనలు గెలుచుకున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Tamil film producers to sue Sun Network". Hindustantimes.com. 2006-02-23. Archived from the original on 4 September 2014. Retrieved 2015-04-09.
- ↑ "A.L.Alagappan arrested!". Sify. 2006-06-17. Archived from the original on 2014-06-16. Retrieved 2015-04-09.