కొచ్చి
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కొచ్చి Kochi കൊച്ചി | |
---|---|
![]() | |
Nickname(s): Queen of the Arabian Sea[1][2] | |
Coordinates: 9°58′37″N 76°16′12″E / 9.977°N 76.27°E | |
Population (2011) | |
• City | 601,574 |
• Metro | 2,117,990 |
Website | www.corporationofcochin.net |
కొచ్చిన్ లేదా కొచ్చి (మలయాళం: കൊച്ചി) కేరళ రాష్ట్రానికి చెందిన ఎర్నాకుళం జిల్లా లోని అతిపెద్ద నగరం., ఒక రేవు పట్టణం. తరచూ కొచ్చిన్ ని ఎర్నాకుళం అనే వ్యవహరిస్తూ ఉంటారు. కొచ్చి జనాభా 601, 574. కేరళ రాష్ట్రంలోనే అత్యంత జనసాంద్రత గల పట్టణం కొచ్చి.
రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురము (ట్రివేండ్రం) కి ఉత్తర దిశగా 220 కి.మీ (137 మై) దూరంలో, రాష్ట్రంలోని పెద్ద నగరాలలో తృతీయ స్థానంలో ఉన్న కోజిక్కోడ్కి దక్షిణ దిశగా 180 కి.మీ (112 మై) గా ఏర్పడి ఉంది. అరేబియా సముద్రపు మహారాణిగా పిలువబడే కొచ్చి 14వ శతాబ్దము నుండే సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి అనుకూలంగా నిలచి ప్రాముఖ్యత సంతరించుకొన్నది. 1503 లోనే పోర్చుగీసు సాంరాజ్యము యొక్క భాగమై, భారతదేశంలో మొట్టమొదటి ఐరోపా దేశస్థుల మజిలీ అయినది. 1530 లో పోర్చుగీసు గోవాకి వారి కార్య కలాపాలని తరలించేవరకూ కొచ్చి యే వారి మజిలీ. పిమ్మట డచ్, బ్రిటీష్ రాజ్యాలు కొచ్చిని అభివృద్ధి చేశాయి.
చరిత్ర[మార్చు]
కొచ్చిన్ పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి పేరొందినదిగా గ్రీకులు, రోమనులు, యూదులు, అరబులు, చైనీయులు ఎరుగుదురు. 1341 వ సంవత్సరములో పెరియార్ నదిలో వరదల వలన కోడుంగళ్ళూరు లోని వ్యాపార కేంద్రం నశించడంతో కొచ్చిన్ కి గుర్తింపుకు వచ్చింది.
పలు చరిత్రకారుల ప్రకారం కులశేఖర సామ్రాజ్యము పతనము తర్వాత కొచ్చిన్ రాజ్యము 1102 లో ఏర్పడినది. అప్పట్లో రాజుకు ప్రస్తుతమున్న కొచ్చి పట్టణంతో బాటు చుట్టు ప్రక్కల ప్రదేశాలపై కూడా అధికారము ఉండేది. వంశ పారంపర్యముగా వచ్చెడి రాజవంశమును 'పెరుంపడుప్పు స్వరూపం' లేదా 'కురు స్వరూపం' అని స్థానిక భాషలో వ్యవహరించేవారు.
1503 నుండి 1663 వరకు ఫోర్ట్ కొచ్చిని పోర్చుగల్ పాలించింది. 1773 లో మైసూరు రాజు హైదర్ ఆలీ మలబారు ప్రాంతాన్ని కైవసం చేసుకొని కొచ్చిని తన రాజ్యంలో కలిపి వేసుకొన్నాడు.
20వ శతాబ్ద ప్రారంభంలో ఇక్కడి వ్యాపారం విస్తరించడంతో దీనిని అభివృద్ధి చేయవలసి వచ్చింది. అప్పటి మద్రాసు గవర్నరు లార్డ్ విల్లింగ్డన్ రాబర్ట్ బ్రిస్టోవ్ అను హార్బరు ఇంజినీరును ఆహ్వానించాడు. 21 ఏళ్ళలో బ్రిస్టోవ్ కొచ్చి పోర్టుని ద్వీపకల్పములోనే ఒక సురక్షితమైన పోర్టుగా మార్చి వేసాడు.
మూలాలు[మార్చు]
- ↑ K. C. Sivaramakrishnan (2006). People's Participation in Urban Governance. Concept Publishing Company. p. 156. ISBN 8180693260.
- ↑ Ganesh Kumar. Modern General Knowledge. Upkar Prakashan. p. 194. ISBN 8174821805.