Jump to content

హైబీ ఈడెన్

వికీపీడియా నుండి
హిబీ జార్జ్ ఈడెన్
హైబీ ఈడెన్


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మే 2019
ముందు కె.వి. థామస్
నియోజకవర్గం ఎర్నాకులం

పదవీ కాలం
2011 – 2019
ముందు డొమినిక్ ప్రెజెంటేషన్
తరువాత టీజే వినోద్
నియోజకవర్గం ఎర్నాకులం

వ్యక్తిగత వివరాలు

జననం (1983-04-19) 1983 ఏప్రిల్ 19 (వయసు 41)
ఎర్నాకులం , కేరళ , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి అన్నా లిండా
సంతానం క్లారా
నివాసం న్యూఢిల్లీ / కొచ్చి

హైబీ ఈడెన్ (జననం జననం 19 ఏప్రిల్ 1983) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తరువాత ఎర్నాకులం లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

హైబీ ఈడెన్ తన తండ్రి జార్జ్ ఈడెన్ అడుగుజాడల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి తేవరలోని సేక్రేడ్ హార్ట్ కళాశాలలో కేఎస్‌యూ ప్రధాన కార్యదర్శిగా ఆ తర్వాత కేరళ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ , ఆ తరువాత నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2011 కేరళ శాసనసభ ఎన్నికలలో ఎర్నాకులం నియోజకవర్గం నుండి పోటీ చేసి 32,437 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అతి పిన్న వయస్కుడైన సభ్యునిగా నిలిచి 2016 శాసనసభ ఎన్నికలలో 21949 ఓట్ల మెజారిటీతో రెండవసారి గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

హైబీ ఈడెన్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎర్నాకులం లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి పి రాజీవ్ పై 1,69,053 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5] [6]ఆయన 2024లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి కె.జె. షైన్ పై 2,50,385 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. "Hibi Eden". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2024. Retrieved 2024-07-09.
  2. The Hindu (4 June 2024). "Lok Sabha Elections: Hibi Eden walks into book of political records with a margin of 2.50 lakh votes" (in Indian English). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  3. "Kerala's youngest candidate fights his first election". Rediff (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2021. Retrieved 2024-07-09.
  4. "Ernakulam Election and Results 2018, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". www.elections.in. Archived from the original on 14 July 2016. Retrieved 6 July 2016.
  5. TimelineDaily (5 April 2024). "Hibi Eden Vying For Second Term To Retain Congress's Traditional Citadel Ernakulam" (in ఇంగ్లీష్). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  6. "Kerala Lok Sabha Election Results 2019 - State Wise and Party Wise Results". Elections in India. Archived from the original on 9 May 2021. Retrieved 2021-05-07.
  7. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Ernakulam". Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.