Jump to content

దమ్ము

వికీపీడియా నుండి
దమ్ము
(2012 తెలుగు సినిమా)
దర్శకత్వం బోయపాటి శ్రీను
నిర్మాణం అలెగ్జాండర్ వల్లభ
కథ బోయపాటి శ్రీను
ఎం. రత్నం
తారాగణం జూనియర్ ఎన్.టి.ఆర్.
త్రిష
కార్తికా నాయర్
నాజర్
భానుప్రియ
సుమన్
కోట శ్రీనివాసరావు
సంపత్ రాజ్
సంగీతం ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం ఆర్ధర్ ఏ. విల్సన్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్
పంపిణీ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్
భాష తెలుగు

దమ్ము 2012 లో విడుదలైన తెలుగు భాషా చిత్రం. ఇందులో జూనియర్ ఎన్.టి.ఆర్.,త్రిష,కార్తికా ముఖ్య పాత్రలు పొషించారు. ఈ చిత్రనికి బోయపాటి శ్రీను దర్శకుడు.ఈ చిత్రాన్ని సింగమగన్ గా తమిళములో,దమ్ముగా హిందీ లో అనువదించారు.

రామ చంద్ర (ఎన్.టి.ఆర్.) తన స్నేహితుడితో పాటు సాధారణ జీవితాన్ని గడిపే ఒక అనాధ.అతను చాలా ధనిక అమ్మాయి అయిన సత్య (త్రిష) తో ప్రేమలో పడతాడు.రామచంద్ర యొక్క కుటుంబ చరిత్ర, వంశీమూ చాలా ప్రాముఖ్యత కలిగిన ఒక షరతును సత్య విదిస్తుంది. రామచంద్ర ఒక ధనవంతుడు, శక్తివంతమైన రాజ కుటుంబం ఒక వారసుడిని దత్తత తెసుకునే పని మీద ఉన్నారని తెలుసుకుని అవకాశం దక్కించుకుంటాడు.కాని అతను ఆ ఊరు వెళ్ళిన తరువాత ఆ కుటుంబం ఎంత ప్రమాదమ్లో ఉందో తెలుస్తుంది.ఆ కుటుంబానికి మరొక శక్తివంతమైన కుటుంబానికి (నాజర్ నాయకత్వంలో) తరతరాల పగ కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలోని వేలాదిమంది ప్రజలు తమ మనుగడ కోసం ఇప్పుడు అతనిపై ఆధారపడుతున్నారని కూడా అతను తెలుసుకుంటాడు.అతను కుటుంబానికి నిజమైన వారసుడని అతను తెలుసుకుంటాడు.అతను ఆ పగను శంతితో జయించాలనుకుంటాడు.కానీ ప్రత్యర్థి ముఠా అతనికి అవకాశం ఇవ్వదు.దానితో అతను నాజర్ యొక్క ఇద్దరు కొడుకులను చంపి,మూడవ కొడుకు పీక మేద కత్తి పెట్టి,నాజర్ కళ్ళు తెరుస్తాడు.చివరికి నాజర్ అతను తప్పు అని తెలుసుకుంటాడు, అందరికీ క్షమాపణ చేస్తున్నాడు.రామ చంద్ర గ్రామంలో హీరోగా మారాడు.

పాటల జాబితా

[మార్చు]

ఓ లిలీ , రచన: చంద్రబోస్, గానం. బాబాసేహగల్

రూలర్ ,(మూవీ వెర్షన్) రచన: చంద్రబోస్, గానం.పృద్విచంద్ర , రేవంత్ , సాహితి

రాజా వాసిరెడ్డి , రచన: చంద్రబోస్ , గానం.ఎం.ఎం కీరవాణి , కృష్ణచైతన్య

వాస్తు బాగుందే , రచన: చంద్రబోస్, గానం.రాహూల్ సింప్లీగంజ్ , శ్రావణ భార్గవి, శివాని

దమ్ము , రచన: చంద్రబోస్, గానం . రాహుల్ సింప్లీ గంజ్, శ్రావణ భార్గవి , శివాని

రూలర్, (సి. డీ . వెర్షన్) రచన: చంద్రబోస్, గానం. ఎం ఎం కీరవాణి, గీతామాధురి

తారాగణం

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దమ్ము&oldid=4181113" నుండి వెలికితీశారు