కార్తికా నాయర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కార్తీకా నాయర్
Karthika -makaramanju actress.jpg
జననం (1992-06-27) 27 జూన్ 1992 (వయస్సు: 25  సంవత్సరాలు)
వృత్తి నటి,మొడల్
క్రియాశీలక సంవత్సరాలు 2009 – ప్రస్తుతం
తల్లిదండ్రులు రాధ
బంధువులు తులసి_నాయర్ (సొదరి)

కార్తికా నాయర్ (జననం 27 జూన్ 1992)[1] ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో నటించింది. 2009లో అక్కినేని నాగచైతన్య  సరసన  తెలుగు సినిమా  జోష్ తో తెరంగేట్రం  చేసింది కార్తికా. జీవా  సరసన  ఆమె  నటించిన  రెండో  చిత్రం  రంగంతో  ఆమె  ప్రసిద్ధి  చెందింది.  ఈ సినిమా  అసలు  తమిళం లో తీసి, తెలుగులో డబ్బింగ్  చేశారు.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

కార్తీకా తల్లి ప్రముఖ నిన్నటి తరం నటి రాధ. ఆమె పెద్దమ్మ అంబిక కూడా ప్రముఖ దక్షిణ భారత నటే. కార్తికాకు ఒక తమ్ముడు, ఒక          చెల్లెలు. ఆమె చెల్లెలు తులసి నాయర్ కూడా సినిమాల్లో నటించింది.  కార్తికా ముంబైలోని పోడర్ అంతర్జాతీయ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది.[2] లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అనుబంధ కళాశాలలో అంతర్జాతీయ బిజినెస్ డిగ్రీ చదువుకుంది కార్తికా. 

కెరీర్[మార్చు]

2010లో నార్వేలో రంగం సినిమా షూటింగ్ లో కార్తికా.

2009లో తన 17వ ఏట తెలుగు సినిమా జోష్ తో తెరంగేట్రం  చేసింది. ఈ సినిమాలో ఆమె నాగచైతన్య సరసన  నటించింది. ఆమె రెండో సినిమా  రంగం.  తమిళంలో  తీసిన  ఈ  సినిమాను తెలుగులో డబ్బింగ్  చేయగా, రెండు భాషల్లోనూ విజయవంతం కావడం విశేషం.[3] ఆ తరువాత ఆమె  మలయాళంలో లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వంలో మకరమంజు  సినిమాలో  నటించింది కార్తికా. ఆ తరువాత ఆమె భారతీరాజా దర్శకత్వంలో అన్నాకొడి సినిమాలో నటించింది. 

నటనా జీవితం[మార్చు]

చలన చిత్రాలు
Key
Films that have not yet been released ఇంకా విడుదలైన సినిమాలను సూచిస్తుంది
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు
2009 జోష్ విద్యా తెలుగు ఉత్తమ తొలి నటి సంతోషం అవార్డ్స్ ,ఉత్తమ తొలి నటి సినిమా(CineMAA) అవార్డ్స్
2011 కో(రంగం) రేనుకా నారాయణన్ తమిళం
మకతమంజు సుగందా బాయి, ఊర్వశి మలయాళం
2012 దమ్ము నీలవేణి తెలుగు
2013 కమ్మత్ & కమ్మత్ సురేఖా మలయాళం
అన్నకొడి అన్నకొడి తమిళం
బృందావన భూమి కన్నడ బృందావనం యొక్క పునఃనిర్మాణం
2014 బ్రదర్ అఫ్ బొమ్మలి(సినిమా) లక్ష్మి/లక్కి తెలుగు
2015 పుఱంపోక్కు కుయిలి తమిళం
వా డీల్ Films that have not yet been released తమిళం ఆలస్యంమైనది
బుల్లి తెర
సంవత్సరం దారావాహిక పాత్ర భాష చానలు గమనికలు
2017 ఆరంభ్ దేవసేన హిందీ స్టార్ ప్లస్ తొలి ధారావాహిక

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.