కెమెరామెన్ గంగతో రాంబాబు
కెమెరామెన్ గంగతో రాంబాబు | |
---|---|
దర్శకత్వం | పూరి జగన్నాథ్ |
రచన | పూరీ జగన్నాధ్ |
స్క్రీన్ ప్లే | పూరీ జగన్నాధ్ |
నిర్మాత | డి.వి.వి. దానయ్య |
తారాగణం | పవన్ కళ్యాణ్ తమన్నా ప్రకాశ్ రాజ్ |
ఛాయాగ్రహణం | శ్యాం కె. నాయుడు |
కూర్పు | ఎస్. ఆర్. శేఖర్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | యూనివర్సల్ మీడియా |
పంపిణీదార్లు | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (నిజాం) బన్నీ వాసు (పశ్చిమ గోదావరి) 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ (కృష్ణ) |
విడుదల తేదీ | 2012 |
సినిమా నిడివి | 129 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹25 crore (US$3.1 million) |
బాక్సాఫీసు | ₹52 crore (US$6.5 million) |
కెమెరామెన్ గంగతో రాంబాబు 2012 తెలుగు చలన చిత్రానికి రచన, దర్శకత్వం పూరి జగన్నాథ్. ఈ చలన చిత్రానికి ప్రధాన పాత్రదారులుగా పవన్ కళ్యాణ్, తమన్నా నటించారు. వీరు ఈ చిత్రంలో నటించడానికి 2012 మార్చి 14న ఓప్పుకున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ 2012 జూన్ 15న ప్రారంభించింది. 2012 అక్టోబరు 18న 1600 పైగా తెరలలో ఈ చిత్రం విడుదలైంది.
కథ
[మార్చు]రాంబాబు (పవన్ కళ్యాణ్) మెకానిక్. అందరికి మంచి చేసే వ్యక్తి. అన్యాయాలను ఎదురించే దైర్యశాలి. ఇలాంటి వాడు మెకానిక్ గా కంటే జర్నలిస్టుగా అయితేనే కరెక్టని టీవీ చానల్ కెమెరామెన్ అయిన గంగ (తమన్నా) అతనికి జర్నలిస్టు జాబ్ ఇప్పిస్తుంది. మాజీ సీఎం జవహర్ నాయుడు (కోట శ్రీనివాసరావు) రాష్ట్రంలో అల్ల కల్లోలం కలిగించి ప్రభుత్వాన్ని పడగొట్టాలని, తాను అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తుంటాడు. అతని కొడుకు రానా నాయుడు (ప్రకాష్ రాజ్) కూడా దుర్మార్గుడే. జవహర్ నాయుడు చేసి అన్యాయాలను, స్కాములను దశరథ్ అనే జర్నలిస్టు బయట పెట్టడానికి ప్రయత్నించడంతో రానా నాయుడు అతన్ని చంపేస్తాడు.
దశరత్ ను చంపింది రానా నాయుడే అనేది బహిరంగ రహస్యమే అయినా అతనికి భయపడి ఎవరూ బయట పెట్టరు. రాంబాబు ధైర్యంగా అతనితో నేరం ఒప్పించి అరెస్టు అయ్యేలా చేస్తాడు. కానీ రాజకీయ నాయకుల అండతో రానా నాయుడు బయటకు వస్తాడు. మీడియా అండతోనే సీఎంని అవుతా అంటూ రాంబాబుకు సవాల్ చేస్తాడు. అనంతరం రాజకీయాల్లోకి రావడానికి ప్లాన్ చేసుకుంటాడు. ఈ క్రమంలోనే రాంబాబు, రానా నాయుడు మధ్య వార్ మొదలవుతుంది. పొలిటికల్ మైలేజ్ కోసం రానా నాయుడు ఇరత రాష్టాల వాళ్లు ఆంధ్రప్రదేశ్ ఉండటానికి వీళ్లేదనే ఉద్యమం మొదలు పెడతాడు. పెద్ద ర్యాలీ చేస్తాడు.
రాంబాబు రంగంలోకి దిగి జనగనమన గీతం గురించి చెప్పి....భారతీయులంతా ఒక్కటే అని చాటి చెప్పి రానా నాయుడు ఉద్యమాన్ని నీరు కారుస్తాడు. రాజకీయాల్లో ఎలాగైనా నిలదొక్కుకోవాలనే దురాలోచనతో చివరకు తన తండ్రితో చివరి ప్రసంగం ఇప్పించి అతన్ని కూడా చంపేస్తాడు రానా నాయుడు. అలా తండ్రి మరణాన్ని తన రాజకీయాలకు ఉపయోగించుకుంటాడు. మరి రాంబాబు రానా నాయుడు దుర్మార్గాలను ఎలా చెక్ పెట్టాడు అనేది క్లైమాక్స్.
తారాగణం
[మార్చు]- పవన్ కళ్యాణ్ - రాంబాబు
- తమన్నా - గంగ
- ప్రకాష్ రాజ్ - రాణా ప్రతాప్ నాయుడు
- గాబ్రియేలా బెర్టాంటే - స్మిత
- బ్రహ్మానందం
- కోట శ్రీనివాసరావు - జవహార్ నాయుడు
- నాజర్ - చంద్ర శేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
- ఆలీ
- తనికెళ్ళ భరణి
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- సయ్యద్ సోహైల్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | Singer(s) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "థీం సాంగ్" | భాస్కరభట్ల | హేమచంద్ర, కారుణ్య, నరేంద్ర | 1:53 |
2. | "పిల్లని చూస్తే" | భాస్కరభట్ల | కారుణ్య, చిత్ర | 4:03 |
3. | "జెరమొచ్చింది" | భాస్కరభట్ల | మురళి, శ్రావణ భార్గవి | 3:38 |
4. | "ఎక్స్ట్రార్డినరీ" | భాస్కరభట్ల | హేమచంద్ర | 4:24 |
5. | "తలదించుకు" | భాస్కరభట్ల | హేమచంద్ర, కారుణ్య, శ్రీకృష్న, నరేంద్ర | 3:12 |
6. | "ఏ మెలికల్" | భాష్కరభట్ల | నరేంద్ర, గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ | 4:21 |
మొత్తం నిడివి: | 20:51 |