గాబ్రియేలా బెర్టాంటే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాబ్రియేలా బెర్టాంటే
జననం
గాబ్రియేలా బెర్టాంటే

మటియాస్ బార్బోసా, మినాస్ గెరైస్, బ్రెజిల్
వృత్తినటి, నర్తకి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2012–2015

గాబ్రియేలా బెర్టాంటే (ఆంగ్లం: Gabriela Bertante) ఒక బ్రెజిలియన్ మాజీ మోడల్, భారతీయ చిత్రాలలో కనిపించే నటి. ఆమె 2012 తమిళ చిత్రం బిల్లా II, 2012 తెలుగు చిత్రం దేవుడు చేసిన మనుషులు, 2012 తెలుగు చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు, 2014 హిందీ చిత్రం బల్వీందర్ సింగ్ ఫేమస్ హో గయా చిత్రాలకు ప్రసిద్ధి చెందింది.

ప్రారంభ జీవితం[మార్చు]

బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్‌ (Minas Gerais)లో గాబ్రియేలా బెర్టాంటే జన్మించింది. ఆమె 17 సంవత్సరాల వయస్సులో సౌ పౌలోమకాం మార్చి మోడలింగ్‌ కెరీర్ ప్రారంభించింది. అలాగే, ఆమె ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి కూడా.

ఆమె 2010లో భారతదేశానికి చేరుకుని లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొంది. ఆ తరువాత, ఆమె అనేక మ్యాగజైన్‌లలో ప్రముఖంగా ప్రదర్శించబడింది. ఆమె ఎంటీవి గ్రైండ్‌లో వీజెగా పలువురి దృష్టిని ఆకర్షించింది.[1]

కెరీర్[మార్చు]

ఆమె ముంబైలో పూరీ జగన్నాధ్‌ని కలిసి టెస్ట్ షూట్ లో ఎంపికైంది, దీంతో, ఆమె రవితేజ నటించిన దేవుడు చేసిన మనుషులులో ఐటెమ్ నంబర్ ఆఫర్ వచ్చింది. ఆ తరువాత, ఆమె చక్రి తోలేటి రూపొందించిన తమిళ చిత్రం బిల్లా II లో ప్రముఖ నటుడు అజిత్ కుమార్‌తో కలిసి నటించింది.[2][3] ఆమె నటులు మికా సింగ్, షాన్‌లతో కలిసి బల్వీందర్ సింగ్ ఫేమస్ హో గయా చిత్రంతో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది.[4]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2012 బిల్లా II తమిళం ప్రత్యేక ప్రదర్శన
2012 దేవుడు చేసిన మనుషులు తెలుగు "డోంట్ డిస్ట్రిబ్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2012 కెమెరామెన్ గంగతో రాంబాబు స్మిత తెలుగు
2014 బల్వీందర్ సింగ్ ఫేమస్ హో గయా హిందీ ప్రధాన పాత్ర

మూలాలు[మార్చు]

  1. "The angel from Brazil : Postnoon". Archived from the original on 25 April 2012. Retrieved 21 April 2012.
  2. "Home" Archived 2 ఏప్రిల్ 2015 at the Wayback Machine.
  3. "Brazilian Lass In Billa 2 – Billa 2 – Pawan Kalyan – Ajith – Chakri Toleti – Devdu Chesina Manush – Tamil Movie News – Behindwoods.com" Archived 11 ఏప్రిల్ 2012 at the Wayback Machine. www.behindwoods.com.
  4. Chakravorty, Vinayak (September 27, 2014). "Movie review: Balwinder Singh Famous Ho Gaya is too silly to regale". India Today.