Jump to content

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

వికీపీడియా నుండి
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
(2013 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీకాంత్ అడ్డాల
నిర్మాణం దిల్ రాజు
కథ శ్రీకాంత్ అడ్డాల
చిత్రానువాదం శ్రీకాంత్ అడ్డాల
తారాగణం వెంకటేష్
మహేశ్ ‌బాబు
సమంత
అంజలి
ప్రకాశ్ రాజ్
జయసుధ
సంగీతం మిక్కీ జె. మేయర్
ఛాయాగ్రహణం కే.వి. గుహన్
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
పంపిణీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
భాష తెలుగు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2013 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు సినీనటులు వెంకటేష్, మహేశ్ ‌బాబు ముఖ్య పాత్రలు పోషించారు. వీరితో పాటు ఇతర ముఖ్య పాత్రలలో సమంత, అంజలి, ప్రకాశ్ రాజ్, జయసుధ నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జనవరి11న విడుదలైనది.

ఈ చిత్రం యొక్క మొత్తం రేలంగి అనే పల్లెటూరులో జరుగుతుంది. చిత్ర కథ మొత్తం రేలంగి మావయ్య (ప్రకాష్ రాజ్) కుటుంబం చుట్టూ తిరుగుతుంది. మానవత్వ విలువలకు, కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే మనిషి రేలంగి మామయ్య. ఆ ఊరిలో అందరికీ రేలంగి మావయ్య అంటే ఎనలేని అభిమానం. అందరితో సంతోషంగా, ఆనందంగా బ్రతకాలనుకునే ఇతనికి పెద్దోడు (వెంకటేష్), చిన్నోడు (మహేష్ బాబు) అని ఇద్దరు కొడుకులు ఉంటారు. వీరిలో పెద్దోడు చాలా ఎమోషనల్ గా ఉండే యువకుడు. ఇంకొకరి ముందు తలవంచుకునే వ్యక్తిత్వం కాదు. తనకు నచ్చింది చేసి మంచి అవకాశం కోసం చూసే వ్యక్తి, నిరుద్యోగి, తన తమ్ముడు అంటే చాలా ఇష్టం. సీత (అంజలి) అతనికి మరదలు. ఆ ఇంట్లో సీత చెయ్యలేని పనిలేదు, ప్రేమించబడని మనిషి లేడు. కానీ చిన్నప్పటి నుండి సీత ఎప్పటికి అయిన పెద్దోడే తన భర్త అవుతాడని కలలు కంటూ ఉంటుంది. మరో ప్రక్క చిన్నోడు ఎటువంటి పరిస్థితిని అయినా తనకు అనుగుణంగా మార్చుకునే యువకుడు. చిన్నోడు తన బంధువుల పెళ్ళిలో పెళ్ళికూతురు చెల్లెలైన అయిన గీత (సమంత)ని చూడగానే ప్రేమలో పడిపోతాడు. రేలంగి మామయ్య కుటుంబానికి సంపద తక్కువగా ఉందని గీత తండ్రి (రావు రమేష్) చులకనగా చూస్తుంటాడు.

ఇదిలా ఉండగా రేలంగి మావయ్య తన కూతురిని ఇంటికి తీసుకురావడానికి వైజాగ్ వెళ్తాడు. అక్కడ గీత అక్క, తన మొగుడు మరియూ అత్త మామలతో అదే ట్రైను ఎక్కుతుంది. ట్రైనులో ఒకే చోట కూర్చున్న వీరందరూ మాట్లాడుకుంటూ ఉండగా గీత అక్క వాళ్ళ అత్త మామలు తమ రెండో కొడుకుతో రేలంగి మావయ్య కూతురిని ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. గీత కుటుంబం విజయవాడలో ఉంటారు. గీత చనిపోయిన పెద్దనాన్న కూతురే సీత. మొదటి నుంచీ గీత తండ్రికి రేలంగి వారిపై సదాభిప్రాయం లేదు. అందులోనూ పెద్దోడికి కూడా వారిపై సదాభిప్రాయం లేదు.కాబట్టి ఆ సంబంధానికి పెద్దోడు ముందు అంగీకారం తెలుపడు. కానీ చిన్నోడు నచ్చజెప్పాక ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు. వైభవంగ జరిగిన ఆ పెళ్ళిలో గీత తండ్రి మళ్ళీ రేలంగి వారి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడతాడు. ఇది పెద్దోడిలో వారి పట్ల మరింత ద్వేషాన్ని నింపుతుంది.

పెళ్ళి జరిగిన మరుసటిరోజు హైదరాబాద్లో స్థిరబడ్డ ఆ ఊరి మనిషి పెద్దోడిని హైదరాబాద్ రమ్మని, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తాడు. సాధారణంగా ఒకరి కింద పనిచేయడం ఇష్టంలేని పెద్దోడు చిన్నోడి మాట విని హైదరాబాద్కి తనతో పాటు వెళ్తాడు. కానీ అక్కడ తనకి పరాభవం జరుగుతుంది. దానితో వేరే ఉద్యోగం వెతకాలని పెద్దోడు అనుకుంటాడు. ఇంతలో చిన్నోడు, గీత ల ప్రేమ విషయాన్ని తన తండ్రితో చెప్పడానికి గీత చిన్నోడిని ఒక హోటలుకు రమ్మంటుంది. కానీ అక్కడ తన పూర్తి కుటుంబం ఉన్నదన్న విషయాన్ని చెప్పదు. మళ్ళీ అక్కడ గీత తండ్రికీ, చిన్నోడికీ మధ్య అభిప్రాయభేదాలు వచ్చి చిన్నోడు అలిగి వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న పెద్దోడు గీతతో చిన్నోడిని చూస్తాడు. ఆ రాత్రే పెద్దోడు చిన్నోడికి ఒక్కమాట చెప్పకుండా ఊరు వెళ్ళిపోతాడు. దీనివల్ల పెద్దోడికీ, చిన్నోడికీ మధ్య దూరం పెరుగుతుంది. ఇరువురి మధ్యగల దూరం వల్ల కలత చెందిన చిన్నోడు ఒకనాడు గీతతో గొడవపడి విడిపోతాడు. ఒకేసారి గీత, సీతలకు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలుపెడతారు వారి పెద్దలు.

ఇది ఇలా ఉండగా ఒకరిని కాపాడే ప్రయత్నంలో రేలంగి మావయ్యకు యాక్సిడెంట్ అవుతుంది. కానీ తొందరగానే తేరుకుంటాడు. రేలంగి మావయ్యను చులకనగా చుసే వాళ్ళంతా ఆయనకు దగ్గరవుతుంటే, అన్నదమ్ములిద్దరి మధ్య దూరం అలాగే మిగిలిపోయింది. ఇదంతా గమనిస్తూ వచ్చిన సీత ఒకనాడు రేలంగి మావయ్యతో భద్రాచలంలోని సీతారాముల కళ్యాణానికి వెళ్దామని అడుగుతుంది. వెంటనే అందరూ భద్రాచలం చేరుకుంటారు. అక్కడికి గీత కూడా అనుకోకుండా తన కుటుంబ సభ్యులతో చేరుకుంటుంది. అంతా సవ్యంగా జరుగుతున్నదనగా ఆ మండపంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. తోటి భక్తుల సలహా మేరన చిన్నోడు బయటకు వెళ్ళి ట్రాన్స్ఫార్మరు బద్దలుకొట్టగా ఈలోపు పెద్దోడు గీతనీ తన తండ్రినీ, అక్కనీ తొక్కిసలాట నుంచి కాపాడుతాడు. పోలీసుల చర్యలు కూడా తోడవటంతో ప్రమాదం సద్దుమణుగుతుంది. అన్నద్ఫమ్ములిద్దరు తీరిగ్గ కూర్చుని కళ్యాణం చూస్తున్న తరుణంలో రేలంగి మావయ్య అక్కడికొచ్చి వారిద్దరినీ మెచ్చుకుంటూ, సాటి మనుషులతో ప్రేమగా ఉన్నప్పుడే అందరు ఆనందంగా ఉంటారని చెప్తాడు. రేలంగి మావయ్య మాటలు విన్న అన్నదమ్ములు మళ్ళీ కలుస్తారు. పెద్దోడు కూడా సీతను ప్రేమిస్తున్న విషయాన్ని సీతకు తెలియజేస్తాడు. పెద్దోడు సీతను పెళ్ళిచేసుకొవడం, చిన్నోడు గీతలు కలిసిపోవడం, గీత తండ్రి ప్రవర్తనలో మార్పు రావడం, అన్నదమ్ములిద్దరూ ఉద్యోగాలు సంపాదించడంతో కథ సుఖాంతమౌతుంది.

తారాగణం

[మార్చు]

చిత్ర విశేషాలు

[మార్చు]
  • ఈ చిత్రంలో వెంకటేష్, మహేశ్ ‌బాబు అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటించారు. వీరికి తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్, అమ్మ పాత్రలో జయసుధ నటించారు. అమ్మమ్మ పాత్రలో ప్రముఖ హిందీ నటి రోహిణీ హట్టంగడి నటించారు.[4]
  • సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుక సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనను 2012 మే 31 న విడుదల చేసారు, ఈ చిత్రానికి సంబంధించిన గోడపత్రికలు మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 9న విడుదలయ్యాయి.[5]
  • ఇందులో మహేశ్ బాబు గోదావరి యాసలో పలికిన డైలాగులకు విమర్శకులు మరియూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
  • అప్పటిదాకా ప్రముఖ గాయని చిన్మయిచే తన పాత్రలకు డబ్బింగ్ చెప్పించుకున్న సమంత ఈ చిత్రం నుంచి తనే తన పాత్రలకు సొంథంగా డబ్బింగ్ చెప్పుకుంది.[6]
  • దాదాపు 20 యేళ్ళ తర్వాత నిర్మించబడిన మల్టీస్టారర్ చిత్రం కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించడమే కాక ప్రపంచవ్యాప్తంగా 54.75 కోట్ల కలెక్షన్లను సాధించింది. మగధీర (2009), దూకుడు (2011), గబ్బర్ సింగ్ (2012) తర్వాత ఈ సినిమా అత్యంత భారీ కలెక్షన్లను సాధించిన చిత్రంగా నిలిచింది.[7]

పురస్కారాలు

[మార్చు]
  1. నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ఉత్తమ కుటుంబ కథా చిత్రం, ఉత్తమ సహాయ నటుడు (ప్రకాష్ రాజ్), ఉత్తమ గేయ రచయిత (సిరివెన్నెల సీతారామశాస్త్రి-మరీ అంతగా), ప్రత్యేక బహుమతి (అంజలి)[8][9][10][11]
  2. 2013 సైమా అవార్డులు: ఉత్తమ నటుడు (మహేష్ బాబు), ఉత్తమ గీత రచయిత (అనంత శ్రీరామ్ -సీతమ్మ వాకిట్లో)

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగీత రచనSinger(s) నిడివి
1. "ఏం చేద్దాం"  సిరివెన్నెల సీతారామశాస్త్రిరంజిత్, కార్తిక్, శ్రీరామచంద్ర 4:28
2. "ఆరడుగులుంటాడా"  అనంత శ్రీరాంకల్యాణీ నాయర్ 4:06
3. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు"  అనంత శ్రీరాంచిత్ర 3:43
4. "ఇంకా చెప్పాలే"  అనంత శ్రీరాంరాహుల్ నంబియార్, శ్వేతా పండిట్ 3:42
5. "మరీ అంతగా"  సిరివెన్నెల సీతారామశాస్త్రిశ్రీరామచంద్ర 3:48
6. "వాన చినుకులు"  అనంత శ్రీరాంకార్తిక్, అంజనా సౌమ్య 3:45
7. "మేఘాల్లో"  సిరివెన్నెల సీతారామశాస్త్రికార్తిక్, శ్రీరామచంద్ర 3:57
27:29

మూలాలు, వనరులు

[మార్చు]
  1. మన తెలంగాణ, సినిమా (హరివిల్లు) (12 September 2018). "సినిమాలే నా జీవితం..!". manatelangana.news (in ఇంగ్లీష్). వి. భూమేశ్వర్. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.
  2. The Times of India, Entertainment (15 June 2019). "Kalpika Ganesh of 'Sita on the Road' fame looks fabulous and droolworthy in her latest photo-shoot" (in ఇంగ్లీష్). Archived from the original on 21 May 2020. Retrieved 21 May 2020.
  3. The Hindu, Entertainment (28 December 2018). "Driven by the love of cinema: Kalpika Ganesh". Y. Sunita Chowdhary. Archived from the original on 28 December 2018. Retrieved 21 May 2020.
  4. http://telugu.oneindia.in/movies/news/2012/09/svsc-shooting-sriperumbudur-105223.html[permanent dead link]
  5. http://telugu.oneindia.in/movies/news/2012/08/svsc-is-going-start-from-the-19th-104262.html[permanent dead link]
  6. http://www.123telugu.com/mnews/samantha-begins-dubbing-for-svsc.html
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-03-05. Retrieved 2013-04-04.
  8. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
  9. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  10. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  11. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.