మురళీమోహన్ (నటుడు)

వికీపీడియా నుండి
(మాగంటి మురళీమోహన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మాగంటి మురళీమోహన్
జననం24 జూన్, 1940
చాటపర్రు
నివాస ప్రాంతంహైదరాబాద్
ఇతర పేర్లురాజబాబు
విశ్వవిద్యాలయాలుసి.ఆర్.రెడ్డి కళాశాల
వృత్తివ్యాపారి, నటుడు, రాజకీయ నాయకుడు
భార్య / భర్తవిజయలక్ష్మి
తండ్రిమాగంటి మాధవరావు
తల్లివసుమతీదేవి

మాగంటి మురళీమోహన్ తెలుగు సినిమా కథానాయకుడు, నిర్మాత. జయభేరి గ్రూపు అధిపతి. 2014 లోక్ సభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజక వర్గం నుండి గెలిచాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతని అసలు పేరు మాగంటి రాజబాబు. ఇతడు 1940, జూన్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించాడు[1]. ఇతని తండ్రి మాగంటి మాధవరావు స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతని విద్యాభ్యాసం ఏలూరులో గడిచింది. ఇతడు 1963లో ఎలెక్ట్రికల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ప్రారంభించాడు. తరువాత ఇతడు విజయవాడలో నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు.

ఇతని భార్య పేరు విజయలక్ష్మి. వీరికి మధుబిందు అనే కుమార్తె రామమోహన్ అనే కుమారుడు ఉన్నారు. కోడలు పేరు రూప.


సినిమా రంగం[మార్చు]

1973లో మురళీమోహన్ అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమేమాయ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశాడు. దాసరి నారాయణరావు 1974లో తీసిన తిరుపతి సినిమాతో ఇతనికి నటునిగా గుర్తింపు వచ్చింది. ఇతడు సుమారు 350 తెలుగు చలనచిత్రాలలో నటించాడు. ఇతడు తన సోదరుడు కిశోర్‌తో కలిసి జయభేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి దాని ద్వారా 25 చిత్రాలను నిర్మించాడు. ఇతడు నేషనల్ ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాలలో సేవలందించాడు. 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు గౌరవాధ్యక్షునిగా కూడా వ్యవహరించాడు.

వ్యాపార రంగం[మార్చు]

ఇతడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రవేశించి జయభేరి గ్రూప్ సంస్థను స్థాపించి దానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు.

రాజకీయాలు[మార్చు]

ఇతడు రాజకీయాలలో కూడా ప్రవేశించి తెలుగు దేశం పార్టీలో చేరాడు. 2009లో జరిగిన 15వ లోకసభ ఎన్నికలలో రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి తెలుగు దేశం అభ్యర్థిగా నిలబడ్డాడు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ కుమార్ చేతిలో 2,147 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. తిరిగి 2014లో 16వ లోకసభ ఎన్నికలలో గెలిచి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మురళీమోహన్ నటించిన చిత్రాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

నంది పురస్కారాలు[మార్చు]

సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1985 ఓ తండ్రి తీర్పు నంది పురస్కారాలు - ఉత్తమ నటుడు Won

ఇతర పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Sixteenth Lok Sabha Members Bioprofile Maganti, Shri Murali Mohan". లోకసభ అధికారిక వెబ్‌సైటు. Archived from the original on 10 మే 2019. Retrieved 18 February 2019.

బయటి లింకులు[మార్చు]