జైసింహా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జై సింహా
చలనచిత్ర పోస్టర్
దర్శకత్వంకె.ఎస్.రవికుమార్
రచనఎం.రత్న్ం
(కథ/సంభాషణలు)
స్క్రీన్ ప్లేకె.ఎస్.రవికుమార్
నిర్మాతసి.కళ్యాణ్
తారాగణంనందమూరి బాలకృష్ణ
నయనతార
నటాషా దోషి
హరిప్రియ
ఛాయాగ్రహణంసి. రామ్‌ప్రసాద్
కూర్పుప్రవీణ్ అంటోనీ
సంగీతంచిరంతన్ భట్ట్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2018 జనవరి 12 (2018-01-12)
సినిమా నిడివి
164 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్30 crore (US$3.8 million)[2]
బాక్సాఫీసు50 కోట్లు [3]

జైసింహా 2018 జనవరి 18న విడుదలైన తెలుగు చిత్రం. చిల్లర కళ్యాణ్ నిర్మాత.[4]

కథ[మార్చు]

విశాఖపట్నం లోని ఒక ఆసుపత్రిలో గౌరి(న‌య‌న‌తార‌), ఆమె తండ్రి(ప్ర‌కాష్ రాజ్‌)ను చూపించ‌డంతో క‌థ మొద‌లవుతుంది. త‌దుప‌రి స‌న్నివేశంలో న‌ర‌సింహ(బాల‌కృష్ణ‌) త‌న చిన్న బిడ్డ‌తో కూర్గ్‌, కేర‌ళ ప్రాంతాల‌కు వెళ‌తాడు. అక్క‌డ త‌న బిడ్డ‌కు స‌రిప‌డే వాతావ‌ర‌ణం లేద‌ని తెలుసుకుని చివ‌ర‌కు త‌మిళ‌నాడులోని కుంభ‌కోణం చేరుకుంటాడు. అక్క‌డ వెంక‌టేశ్వ‌ర స్వామి ప్రధాన ధ‌ర్మ‌క‌ర్త (ముర‌ళీమోహ‌న్‌) ప‌రిచ‌యం అవుతాడు. ఆయ‌న ఇంట్లోకి ప‌నికి కుదురుకుంటాడు. ఆల‌య ఆర్చ‌కుల‌కు, పోలీసుల‌కు జ‌రిగిన గొడ‌వ‌ల్లో న‌ర‌సింహం చొర‌వ తీసుకుని, జిల్లా ఎస్.పితో అర్చ‌కుల‌కు క్ష‌మాప‌ణ చెప్పిస్తాడు. దాంతో ఎస్‌.పి..న‌ర‌సింహంపై ప‌గ పెంచుకుంటాడు.

కుంభ‌కోణంలోనే పెద్ద రౌడీ అయిన క‌నియ‌ప్ప‌న్ త‌మ్ముడిని చంపి, ఆ హ‌త్య‌ను న‌రసింహంపై మోపే ప్ర‌య‌త్నం చేస్తాడు ఎస్‌.పి. అక్క‌డే క‌థ మ‌లుపు తిరుగుతుంది. ఉరిశిక్ష ప‌డిన ఖైదీ(అశుతోష్ రాణా)..న‌ర‌సింహంను చంపాల‌నుకుంటుంటాడు. అందుక‌ని మంచి అదునుకోసం ఎదురు చూస్తుంటాడు. ఆ స‌మ‌యంలో న‌ర‌సింహంకు ఓ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం తెలుస్తుంది. అస‌లు ఎస్‌.పికి, న‌రసింహానికి ఉన్న సంబంధం ఏంటి? అస‌లు గౌరి ఎవ‌రు? గౌరికి, న‌ర‌సింహంకు ఉన్న బంధం ఏంటి? వైజాగ్‌కు, న‌ర‌సింహంకు ఎలాంటి అనుబంధం ఉంటుంది? అస‌లు న‌ర‌సింహం త‌న కొడుకుతో క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు ఎందుకు వెళుతుంటాడు? అనే విష‌యాలు మిగిలిన కథలో భాగం.

తారాగణం[5][మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Jai Simha (Overview)". Filmibeat. Archived from the original on 2017-11-10. Retrieved 2018-01-27.
  2. "Jai Simha Pre-Release Business Worldwide". Andhra Wishesh. 9 January 2018. Archived from the original on 17 జనవరి 2018. Retrieved 16 January 2018.
  3. "J".
  4. "Jai Simha first look: Nandamuri Balakrishna promises yet another power packed performance". The Indian Express. 2017-11-01. Retrieved 2017-11-25.
  5. "Nandamuri Balakrishna's #NBK102 titled 'Jai Simha' - Times of India". The Times of India. Retrieved 2017-11-25.
  6. "Jai Simha first look poster: Nandamuri Balakrishna looks as massy as ever". www.hindustantimes.com (in ఇంగ్లీష్). 2017-11-01. Retrieved 2017-11-25.

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జైసింహా&oldid=3819196" నుండి వెలికితీశారు