చిరంతన్ భట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిరంతన్ అరుణ్ భట్
చిరంతన్ భట్
వ్యక్తిగత సమాచారం
సంగీత శైలిపాప్, రాక్, బాలీవుడ్, హిప్ హాప్ , డాన్స్, R & B , ఫిలిం స్కోర్
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు, వాయిద్యకారుడు, రికార్డు నిర్మాత
క్రియాశీల కాలం2008

చిర్రంతన్ భట్ భారతీయ సంగీతకారుడు, స్వరకర్త, భారతీయ చిత్ర పరిశ్రమలో గాయకుడు. బాలీవుడ్‌లో యాక్టివ్‌గా ఉన్న ఆయన, తెలుగు చిత్రాలకు కూడా సంగీతం సమకూర్చాడు. అతడు తన సంగీతంలో శ్రావ్యతకు ప్రాధాన్యత ఇస్తాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను సినిమా కుటుంబానికి చెందినవాడు. బాలీవుడ్ సినిమాలోని ప్రముఖ చిత్రనిర్మాత, దర్శకుడూ అయిన విజయ్ భట్ మనవడు. అతను ప్రసిద్ధ నిర్మాత, గుజరాతీ చిత్రాల దర్శకుడూ అయిన అరుణ్ భట్ కుమారుడు.

వృత్తి గత విశేషాలు

[మార్చు]

భట్ 2008 లో హిందీ చిత్రం మిషన్ ఇస్తాంబుల్లో స్వరకర్తగా అడుగుపెట్టాడు. అతను తన కెరీర్ ప్రారంభంలో షాపిట్, హాంటెడ్ 3 డి, 1920: ఈవిల్ రిటర్న్స్ వంటి చిత్రాలకు అందించిన సంగీతం విజయవంతమైంది. తరువాత అక్షయ్ కుమార్ నటించిన బాస్, "తేరి మేరీ కహానీ", "కాఫీ పీట్"లో "హర్ కిసి కో నహిన్ మిల్తా", గబ్బర్ ఈజ్ బ్యాక్‌లో పీట్, జాలీ ఎల్‌ఎల్‌బి 2లో "బావ్రా మన్", 1920: ఈవిల్ రిటర్న్స్ లో "ఉస్కా హాయ్ బనానా" వంటి చార్ట్‌బస్టర్‌లను కంపోజ్ చేశాడు.

గబ్బర్ ఈజ్ బ్యాక్ తరువాత, దర్శకుడు క్రిష్ తన తెలుగు సినిమా కంచె లో అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రంలో పాటలకు, నేపథ్య సంగీతానికీ మంచి సమీక్షలు వచ్చాయి. ఈ చిత్రంలో అతనిచ్చిన సంగీతం అతనికి రెండు ప్రధాన అవార్డులు తెచ్చిపెట్టింది - దుబాయ్‌లో 2016 గామా అవార్డు, హైదరాబాద్‌లో 2016 సినీమా అవార్డు. తెలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో కంచెకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. ఈ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్ర విభాగంలో 2016 లో ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది.

భట్ తరువాత క్రిష్ దర్శకత్వం వహించి, తెలుగు సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి అనే మరో చారిత్రిక చిత్రంలో పనిచేశాడు. భట్ ఈ చిత్రానికి ఇచ్చిన సంగీతంతో ప్రేక్షకులను విమర్శకులనూ ఆకట్టుకున్నాడు.[1][2]

నందమూరి బాలకృష్ణ నటించిన జై సింహా కోసం భట్ సంగీతం ఇచ్చాడు. అందులో "అమ్మకుట్టి అమ్మకుట్టి" పాట మంచి హిట్టైంది.[3] అక్షయ్ కుమార్ చిత్రం - కేసరికి చేసిన కృషికి చిరంతన్ భట్ 2020 ఫిలింఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో ఎంపికయ్యాడు. రేడియో మిర్చి అవార్డును గెలుచుకున్నారు. నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్రం, రూలర్ కోసం ఆయన ఇచ్చిన సంగీతం కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది,

మూలాలు

[మార్చు]
  1. "Chirantan Bhatt". IMDb.
  2. "Chirantan Bhatt – Movies, Photos, Filmography, biography, Wallpapers, Videos, Fan Club". entertainment.oneindia.in. Archived from the original on 2014-03-21. Retrieved 2014-03-23.
  3. "Jai Simha (Review)".