నయన తార
నయన తార | |
![]() | |
జన్మ నామం | డయానా మారియమ్ కురియెన్ |
జననం | తిరువల్ల, కేరళ, భారత్ | నవంబరు 18, 1984
క్రియాశీలక సంవత్సరాలు | 2003—ప్రస్తుతం |
వెబ్సైటు | http://nayanthara.sifymax.com/telugu/ |
నయన తార కేరళకు చెందిన దక్షిణ భారతీయ సినిమా నటీమణి.
నేపధ్యము[మార్చు]
నయనతార 1984 నవంబరు 18 బెంగళూరులో పుట్టింది. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఒమన్ కురియన్. మలయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన నయన్ విద్యాభ్యాసం వివిధ రాష్ట్రాల్లో జరిగింది.
నట జీవితము[మార్చు]
కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయన్‌ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ 'మనస్సినక్కరే' అనే సినిమాలో హీరోయిన్‌గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చాడు. ముందు సినిమాల్లోకి వెళ్లద్దనుకున్నా కేవలం ఒక్క సినిమాలో చేద్దామనుకొని కెరీర్ ప్రారంభించింది నయనతార. ఆ తర్వాత 'విస్మయతుంబట్టు', 'తస్కర వీరన్', 'రాప్పకల్' వంటి సినిమాల్లో మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి పెద్ద హీరోలతో చేసింది.
తర్వాత తమిళంలో 'అయ్య', 'చంద్రముఖి', 'గజిని' వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో చేసిన 'లక్ష్మీ', 'బాస్' చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. 2006లో రిలీజైన 'ఈ', 'వల్లభ' సినిమాలు కుర్రకారులో ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. తర్వాత అజిత్‌తో కలిసి చేసిన 'బిల్లా' సినిమా ఆమెకు సెక్సీయెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది నయన్.. బాపు చిత్రం 'శ్రీరామరాజ్యం'లో సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాకు గాను 'ఫిల్మ్‌ఫేర్', 'నంది' అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.
వ్యక్తిగత జీవితము[మార్చు]
సినిమాలే కాదు. వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలిచింది ఈ నటి. మొదట్లో వల్లవన్ షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టర్, తన సహనటుడు శింబుతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలొచ్చాయి. అయితే కొద్దిరోజుల తర్వాత నయన్ తాను శింబుతో విడిపోయినట్టు వెల్లడించింది. ఆయన సినిమాల్లో తానిక నటించనని తేల్చిచెప్పేసింది. తర్వాత 'విల్లు' షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో తాను ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై 2010లో ప్రభుదేవా స్పందిస్తూ తామిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామని ప్రకటించారు. పెళ్ళి కోసం సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టింది నయన్. అయితే ఆ తర్వాత 2012లో తామిద్దరం విడిపోయామని ప్రకటించింది నయనతార. సిరియన్ క్రిస్టియన్ అయిన ఆమె 2011లో హిందూ మతాన్ని స్వీకరించింది.
నయన తార నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]
పురస్కారాలు[మార్చు]
- 2011 : నంది ఉత్తమ నటీమణులు - శ్రీరామరాజ్యంలో సీతగా ప్రదర్శించిన అధ్బుత నటనకు లభించింది.
- ↑ "Babu Bangaram Review". 123telugu. 12 August 2016.