ఐరా
స్వరూపం
| ఐరా | |
|---|---|
| జననం | పాలక్ జైన్ 1996 ఆగస్ట్ 18 |
| ఇతర పేర్లు | ఆయిరా |
| వృత్తి | నటి, మోడల్ |
| క్రియాశీలక సంవత్సరాలు | 2014–ప్రస్తుతం |
ఐరా (ఆంగ్లం: Ayraa), భారతీయ నటి. కొన్ని తెలుగు చిత్రాలతో పాటు ప్రధానంగా తమిళ సినిమాలో నటిస్తుంది. ఆమె సాగా (2019), సి/ఓ కాదల్ (2021) చిత్రాలలో నటించింది. ఆమె జన్మనామం పాలక్ జైన్.
కెరీర్
[మార్చు]ఐరా చిన్నతనంలోనే మూడు వందలకు పైగా వాణిజ్య ప్రకటనలలో చేసింది. ఐరా అనే పేరుతో, సమంత పోషించిన పాత్రకు సోదరిగా అట్లీ చిత్రం తెరి (2016)లో ఆమె నటించింది.
ఆ తరువాత, ఆమె "యాయుమ్" పాటకు ప్రసిద్ధి చెందిన సాగా (2019), నుంగంబాక్కం (2020) వంటి చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది.[1] ఆమె నటుడు ఆర్. ఎస్. కార్తిక్ తో కలిసి 2018లో విడుదలకు నోచుకోని సైరన్ చిత్రంలో పనిచేసింది, తరువాత మళ్ళీ అతనితో కలిసి యెన్నంగ సర్ ఉంగా సత్తం (2021) అనే హాస్య చిత్రం కోసం పనిచేసింది.[2]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]- సినిమాలు
| సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనిక |
|---|---|---|---|---|
| 2016 | థెరి | పల్లవి | తమిళ భాష | |
| 2019 | సాగా | ఆరోహి | తమిళ భాష | |
| 2020 | గాల్తా | ఇసైరాశి | ||
| నుంగంబాక్కం | సుమతి | |||
| 2021 | కుట్టీ స్టోరీ | శ్రుతి | ||
| సి/ఓ కాదల్ | భార్గవి | |||
| యెన్నంగ సర్ ఉంగా సత్తం | ||||
| 2023 | బూ | అరుణ | తమిళ భాష | |
| తెలుగు | ||||
| తలైనగరం 2 | పర్వీన్ | తమిళ భాష | ||
| ఎన్ 6 వాతియార్ కల్పాంతట్ట కులు | ||||
| 2023 | అథర్వ | జోష్ని | తెలుగు |
- టెలివిజన్
| సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనిక |
|---|---|---|---|---|
| 2020 | పబ్ గోవా | తమిళ భాష |
మూలాలు
[మార్చు]- ↑ "Ayraa pins hope on her film based on medical waste". DT Next. 2 December 2019. Archived from the original on 27 September 2023. Retrieved 26 September 2023.
- ↑ "'Siren' is a comedy thriller that deals with coincidence". The Times of India. 8 November 2018. Archived from the original on 27 September 2023. Retrieved 26 September 2023.