ఓ2
ఓ2 | |
---|---|
దర్శకత్వం | జీఎస్ విక్నేష్ |
రచన | ఎస్.ఆర్. ప్రకాష్ బాబు ఎస్.ఆర్. ప్రభు |
తారాగణం | నయన తార రిత్విక్ జోతిరాజ్ భరత్ నీలకంఠన్ |
ఛాయాగ్రహణం | తమిళ ఎ అళగన్ |
కూర్పు | సెల్వ ఆర్.కె |
సంగీతం | విశాల్ చంద్రశేఖర్ |
నిర్మాణ సంస్థ | డ్రీమ్ వారియర్ పిక్చర్స్ |
పంపిణీదార్లు | డిస్నీ+ హాట్‌స్టార్ |
విడుదల తేదీ | 17 జూన్ 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఓ2 2022లో విడుదలైన తెలుగు సినిమా. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమాకు జీఎస్ విక్నేష్ దర్శకత్వం వహించాడు. నయన తార, రిత్విక్ జోతిరాజ్, భరత్ నీలకంఠన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 17న డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[1]
కథ
[మార్చు]పార్వతి (నయనతార) కొడుకు వీర (రిత్విక్) ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుంటాడు. ఆపరేషన్ చేయించడం కోసం బస్సు ప్రయాణం కొచ్చిన్ కు బయలుదేరగా మధ్యలో వర్షం వల్ల కొండచరియలు విరిగిపడి వారు ప్రయాణిస్తున్న బస్సుపై ఓ లోయలో పడడంతో మట్టిలో కూరుకుపోతుంది. ఆ బస్సులో ఒక ఎమ్మెల్యే, ఒక ప్రేమ జంట, ఇలా రకరకాల వారు ఉండగా గాలి ప్రవేశించడానికి కూడా గ్యాప్ లేకపోవడంతో అందరూ ఆక్సిజన్ (O2) కోసం ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిసస్థితి నుంచి పార్వతి తనను తాను కాపాడుకుంటూ కొడుకును ఎలా రక్షించుకుంది? వారు బయటపడ్డరా లేదా అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
[మార్చు]- నయనతార
- రిత్విక్
- భరత్ నీలకంఠన్
- ఆడుకాలం మురుగ దాస్
- ఆర్.ఎన్.ఆర్. మనోహర్
- లేనా
- షారా
- రిషికాంత్
- అర్జునన్
- జఫ్ఫార్ ఇడుక్కి
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (20 June 2022). "దేవుడిచ్చిన లోపాన్ని కూడా సరిచేసే తల్లి కథ.. 'O2' రివ్యూ". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
- ↑ ABP Live (17 June 2022). "ఓ2 సినిమా రివ్యూ: పెళ్లి తర్వాత నయనతార మొదటి సినిమా ఎలా ఉందంటే?". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.