శరత్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శరత్ కుమార్ రామనాథన్
జననం (1954-07-14) 1954 జూలై 14 (వయస్సు: 65  సంవత్సరాలు)
క్రియాశీలక సంవత్సరాలు 1988—ఇప్పటివరకూ
భార్య/భర్త ఛాయ(1984-2000)
రాధిక శరత్‌కుమార్
(2001-ఇప్పటివరకూ)

శరత్ కుమార్ రామనాథన్ (తమిళం: சரத்குமார் ராமநாதன்) (జన్మం- 1954 జూలై 14) ఒక భారతీయ పాత్రికేయుడు, చలనచిత్ర నటుడు, రాజకీయ నేత, బాడీ బిల్డర్ మరియు ప్రస్తుతం దక్షిణ భారతీయ చిత్ర కళాకారుల సంఘం అధ్యక్షుడు. ఇతడు తన వృత్తి జీవితం ప్రారంభంలో తమిళ సినిమాలలో ప్రధాన భూమికలతో పాటు మరికొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు కూడా పోషించాడు. మొదట్లో సురియాన్ అనే చిత్రంలో ముఖ్య పాత్ర కోసం ఇతడిని ఎన్నుకున్నారు. ఈ సినిమా సత్ఫలితాన్ని ఇచ్చింది. ఇతడు చాలా వరకూ ఒక నిజాయితీ పరుడైన పోలీస్ పాత్రలు పోషించాడు. ఇతడు కె.కామరాజ్ యొక్క ఆదర్శాలను వ్యాపింపజేయడానికి తమిళనాడులో ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించాడు.

జీవితం[మార్చు]

వ్యక్తిగత జీవితం[మార్చు]

శరత్ కుమార్ 1954 జూలై 14 న న్యూఢిల్లీలో ఒక తమిళ నాడార్ కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రుల పేర్లు పుష్ప లీల మరియు ఎమ్.రామనాథన్. అతడికి ఒక సోదరి కూడా ఉంది. ఆమె పేరు మల్లికా రామనాథన్. ఇతడు చెన్నైలో ది న్యూ కాలేజ్ నుండి గణితంలో పట్టా పొందాడు.

ఇతడు రాజ్యసభలో ద్రవిడ మున్నేత్ర ఖడగం తరఫున సంసద సభ్యుడిగా సేవలు అందించాడు. ఇతడు దక్షిణ భారతీయ చలనచిత్ర కలాకారుల సంఘానికి అధ్యక్షుడు మరియు ఉద్యోగ ఆధారిత అనేక కార్యక్రమాలను నిర్వహించాడు. నటనారంగంలోకి ప్రవేశించక ముందు, ఇతడు ఒక పత్రికా విలేకరిగా పనిచేశాడు. ప్రస్తుతం తను సొంత పత్రిక ప్రారంభించి విలేకరిగా తన అనుభనాన్ని కొనసాగిస్తున్నాడు.[1]

బాంధవ్యాలు[మార్చు]

శరిత్ కుమార్ వివాహం నటి రాధికా శరత్ కునార్ తో జరిగింది. అతడి మొదటి భార్య పేరు ఛాయా శరత్ కుమార్, మరియు వీరికి ఇద్దరు కూతళ్ళు ఉన్నారు, వరలక్ష్మీ శరత్ కుమార్ మరియు పూజా శరత్ కుమార్. 2001 లో రాధికా శరత్ కుమార్ తో వివాహం జరిగింది మరియు వీరికి 2004లో ఒక కొడుకు రాహుల్ పుట్టాడు. శరత్ కుమార్, రాధిక కూతురు రాయాన్నేకి సవతి తండ్రి.[2]

నటనా జీవితం[మార్చు]

శరత్ కుమార్ తమిళం, తెలుగు, కన్నడం, మరియు మలయాళం చిత్రాలలో నటించాడు. చెరన్ పాండ్యన్, పులన్ విసరనాయీ, సూరియన్, నట్టమాయీ, సూర్యవంశం, నటపుకకాగా మరియు పజహాసీ రాజా వంటి చిత్రాలలో తన పాత్రలతో విమర్శకుల నుండి సైతం ప్రసంశలు పొందారు.

రాజకీయ జీవితం[మార్చు]

1996 సంవత్సరంలో శరత్ కుమార్ ద్రవిడ మున్నేత్ర ఖడ్గం (డీ.ఎమ్.కే) లో చేరారు. 1998 లో జరిగిన ఎన్నికలలో డీ.ఎమ్.కే తరఫున తిరునేవేలీ నియోజక వర్గం నుండి పోటీ చేసాడు మరియు ఏ.డీ.ఎమ్.కేకి చెందిన కదంబుర్ ఆర్.జనార్థన్ తో 6000 ఓట్లతో ఓటమి పాలయ్యాడు. 2002 లో డీ.ఎమ్.కే ఇతడిని రాజ్యసభ సభ్యుడిని చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.కరుణానిధి కుటుంబంతో విభేదాలు తలెత్తడంతో 2006 లో విధానసభ ఎన్నికలకు ముందు ఇతడు డీ.ఎమ్.కేని వదిలేశాడు. ఆ తర్వాత తన భార్య రాధికతో కలిసి ఏ.ఐ.ఏ.డి.ఎమ్.కేలో చేరాడు మరియు పార్టీ కోసం ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నాడు.

తన భార్య రాధికా శరత్ కుమార్ ని పార్టీ వ్యతిరేక కార్యక్రమాల వల్ల అక్టోబరు 2006 లో ఏ.ఐ.ఏ.డీ.ఎమ్.కే నుండి బహిష్కరించారు. తను కూడా నవంబరు 2006లో ఏ.ఐ.ఏ.డీ.ఎమ్.కేని వదిలేసాడు మరియు దీనికి కారణం చిత్రపరిశ్రమలో తనకు పని వత్తిడి ఎక్కువ అవడం అని చెప్పాడు.

31 అగస్టు 2007 లో శరత్ కుమార్ అఖిల భారతీయ సమథువా మక్కల్ అనబడే కొత్త పార్టీని స్థాపించాడు.[3] అతడు తమిళనాడులో కామరాజ రాజ్యం తిరిగి తీసుకు రావాలని సంకల్పించాడు. తన పార్టీకి తిరుమంగళం (తమిళనాడు) లో జరిగిన ఉపఎన్నికలలో అత్యల్పంగా 1% కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

ప్రముఖ చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర భాష
1990 పులన్ విసరనాయీ తమిళం
1994 నట్టమాయీ తమిళం
1997 సూర్యవంశం తమిళం
1998 నటపుకకాగా తమిళం
2001 మాయీ తమిళం
2005 అయ్యా అయ్యాదురై,
చెల్లాదురై
తమిళం
2007 పచ్చైకిలీ మత్తుసరం తమిళం
2007 నామ నాడూ తమిళం
2009 పజహాసీ రాజా ఎదాచేనా కుంకున్ మలయాళం
2010 జగ్గూ భాయ్ జగ్గూ భాయ్ తమిళం

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]