Jump to content

క్రోధం (1990 సినిమా)

వికీపీడియా నుండి
క్రోధం
(1990 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం మణివణ్ణన్
నిర్మాణం జి.మహేశ్వరరాజు
తారాగణం విజయ కాంత్,
గౌతమి,
శరత్ కుమార్,
శరత్ బాబు
గాంధీమతి
సంగీతం శంకర్ గణేష్
నేపథ్య గానం మనో,
చిత్ర
గీతరచన రాజశ్రీ
సంభాషణలు రాజశ్రీ
నిర్మాణ సంస్థ సూర్యోదయ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

1990 డిసెంబరు 28న విడుదలైన "క్రోధం" తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ చిత్రానికి మణివణ్ణన్ దర్శకత్వం వహించాడు. మణివణ్ణన్ దర్శకత్వంలో విజయ కాంత్, గౌతమి జంటగా నటించిన ఈ సినిమాకు శంకర్ గణేష్ సంగీతం సమకూర్చాడు.[1]

పోలీసు కాల్పుల్లో గాయపడ్డ అళగిరి (విజయకాంత్) ఆందోళనకర స్థితిలో ఆసుపత్రిలో ఉన్న సన్నివేశంతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది.

ఇతడు గతంలో సైనిక అధికారిగా ఉన్నప్పుడు రాసతిని (గౌతమి) వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు సైనిక శిబిరంలో ఉన్న తరువాత ఇతడు తన భార్య, కుమార్తె దగ్గరకు తిరిగి వస్తాడు. వీరు రాము (ఆర్. శరత్ కుమార్) ఇంటికి మారతారు. రాము అళగిరి స్నేహితుడు, అళగిరి పై అధికారి చక్రవర్తి (విను చక్రవర్తి) కుమారుడు కూడా.

కొన్ని సంవత్సరాల క్రితం రాము, అతని స్నేహితులు విశ్వనాథ్ (విచు విశ్వనాథ్), విజయ్ (విజయ్ కృష్ణరాజ్) రాసతిని ఏడ్పించారు. అందుకుగాను వాళ్ళు దెబ్బలు తింటారు. వారు అప్పటి అవమానాన్ని తట్టుకోలేక ఇప్పుడు రాసతిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అప్పటికే ఆమె బలవన్మరణానికి పాల్పడుతుంది. తర్వాత అళగిరి మొదట విశ్వనాథ్ ను బహిరంగ ప్రదేశంలో చంపుతాడు. ఆ నేరానికి అతడిని పోలీసులు అరెస్టు చేస్తారు. అతనికి మరణశిక్ష పడుతుంది. శిక్షకు ముందు రోజు, అతను జైలు నుండి తప్పించుకుంటాడు. కాని పోలీసులు అతన్ని కనుగొని, తర్వాత కాల్పులు జరిపి ఆసుపత్రిలో చేరుస్తారు.[2]

ఆసుపత్రిలో ఉన్న అళగిరి కోలుకున్న తర్వాత అక్కడ అతనికి అక్కడే చికిత్స పొందుతూ ఉన్న విజయ్ కనిపిస్తాడు. అళగిరి అతన్ని మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉంచాలని పోలీసులను వేడుకుంటాడు. ఆ తరువాత, అతడు విజయ్‌ని ఎవరికి అనుమానం రాకుండా చంపుతాడు. ఆ తర్వాత అళగిరి అక్కడి నర్సుల సహాయంతో ఆసుపత్రి నుంచి తప్పించుకుంటాడు. పోలీసులు అతన్ని పట్టుకొనక ముందే రామును చంపాలని అళగిరి నిర్ణయించుకుంటాడు.[3]

నటవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Krodham (Manivannan) 1990". ఇండియన్ సినిమా. Retrieved 18 October 2022.
  2. "Santhana Kaattru Tamil Film LP Vinyl Record by Shankar ganesh". Macsendisk (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 13 October 2023. Retrieved 18 May 2023.
  3. "Sandhana Kaatru (1989)". Raaga.com. Archived from the original on 17 May 2022. Retrieved 18 May 2023.