కె. ఎస్. చిత్ర

వికీపీడియా నుండి
(కె.ఎస్. చిత్ర నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కె.ఎస్.చిత్ర
style="text-align:center;" colspan="2" | KS Chitra.jpg
వ్యక్తిగత సమాచారం
జన్మనామం చిత్రా కృష్ణన్ నాయర్
ఇతర పేర్లు చిత్ర,కన్నడద మగళు
జననం (1963-07-27) 1963 జులై
27 (వయస్సు: 57

  సంవత్సరాలు)
తిరువనంతపురము, కేరళ, భారతదేశం

సంగీత రీతి నేపథ్యగానము, కర్ణాటక సంగీతము
వృత్తి గాయని
వాయిద్యం గాత్రము
క్రియాశీలక సంవత్సరాలు 1979–నేటి వరకు

చిత్ర గా సుపరిచితురాలైన కె. ఎస్. చిత్ర, భారతీయ సినీ రంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని. "దక్షిణ భారత నైటింగేల్" అని బిరుదందుకున్న ఈమె మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ భాషల సినిమాలకు గాత్రదానం చేసింది.

వృత్తి జీవితం[మార్చు]

చిత్ర, 1963, జూలై 27న కేరళలోని తిరువనంతపురములో, సంగీతకారుల కుటుంబములో జన్మించింది. బాల్యములో ఈమె తండ్రి కృష్ణన్ నాయర్, చిత్ర ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. చిత్ర తొలి గురువు ఆమె తండ్రే. చిత్ర 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వము యొక్క నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలఋషిప్పుకు ఎంపికైనప్పటినుండి డా. కె.ఓమనకుట్టి వద్ద కర్ణాటక సంగీతములో విస్తృతమైన శిక్షణ పొందింది. 1979లో ఎం.జి.రాధాకృష్ణన్ ఈమె మలయాళ సినీ నేపథ్యగానానికి చిత్రను పరిచయం చేశాడు. ఆ తరువాత సంగీత దర్శకుడు ఇళయరాజా నేతృత్వములో ఈమె చెన్నైలోని తమిళ సినిమారంగములో అడుగుపెట్టింది. దక్షిణాది భాషలు, హిందీలలో ఈమెకున్న పరిచయము వలన ఆయా భాషలలో పాటలను చక్కగా పాడగలదు.

అవార్డులు[మార్చు]

చిత్ర వేలకొద్ది సినిమా పాటలు, సినిమాయేతర పాటలు రికార్డు చేసింది. తన గాత్ర జీవితములో ఉత్తమ మహిళా నేపథ్యగాయనిగా ఆరు జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులనందుకొన్నది. ఇన్ని పురస్కారాలు మరే ఇతర నేపథ్యగాయకురాలు అందుకోలేదు. జాతీయ పురస్కారాలు అందుకొన్ని సినిమాలు

ఇవేకాక చిత్ర ఉత్తమ నేపథ్యగాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 15 అవార్డులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నుండి 9అవార్డులు, తమిళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 4 అవార్డులు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము నుండి 2 అవార్డులు అందుకొన్నది. ఈ విధంగా దక్షిణ భారతదేశములోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్యగాయక పురస్కారాలందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించింది.

బయటి లింకులు[మార్చు]


భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం | ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం