ఇందుకూరి రామకృష్ణంరాజు
ఇందుకూరి రామకృష్ణంరాజు | |
---|---|
![]() ఇందుకూరి రామకృష్ణంరాజు | |
జననం | ఇందుకూరి రామకృష్ణంరాజు ఆగష్టు 31, 1934 విజయనగరం |
మరణం | ఆగస్టు 14, 1994 |
ఇతర పేర్లు | రాజశ్రీ |
వృత్తి | సినిమా పాటల రచయిత |
ప్రసిద్ధి | తెలుగు సినిమా రచయితలు |
తండ్రి | ఇందుకూరి అప్పలరాజు, |
తల్లి | నారాయణమ్మ. |
రాజశ్రీ (ఆగష్టు 31, 1934 - ఆగస్టు 14, 1994) తెలుగు సినిమా లలో అనువాద రచనలో ప్రముఖులు.
జననం[మార్చు]
వీరు ఆగష్టు 31, 1934 సంవత్సరం విజయనగరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఇందుకూరి అప్పలరాజు, నారాయణమ్మ.
వీరు విజయనగరం మహారాజా కళాశాల నుంచి బి.ఎస్సీ. పట్టా పొందారు. వీరు తొలినుంచి నాటక సాహిత్యాభిలాషి. వీరి 'వదిన', 'ఆంధ్రశ్రీ' నాటకాలు రాఘవ స్మారక కళాపరిషత్తులో ఉత్తమ రచనలుగా ఎన్నుకోబడ్డాయి. విశాఖ జిల్లా బోర్డు కార్యాలయంలో స్టెనో టైపిస్టుగా కొంతకాలం పనిచేశారు.
చలనచిత్ర రంగానికి తరలి వెళ్ళి పినిశెట్టి శ్రీరామమూర్తి, మానాపురం అప్పారావు వద్ద సహాయ దర్శకునిగా చేరారు. తరువాత తమిళ చిత్రసీమ వీరిని కథకునిగా పరిచయం చేసింది.
రాజశ్రీ (సినీ రచయిత)[మార్చు]
రాజుశ్రీగా ప్రసిద్ధులైన ఇందుకూరి రామకృష్ణంరాజు ప్రముఖ సినీ రచయిత. 1934 ఆగష్టు 31 న విజయనగరంలో అప్పలరాజు, నారాయణమ్మలకు జన్మించాడు. ఈయన ఎక్కువగా అనువాద చిత్రాలకు మాటలు, పాటలు రాశాడు. బి.యస్సీ ఫిజిక్సు పూర్తి చేసి ఆ తర్వాత రెండు మూడేళ్ళు విజయనగరం తహసిల్దారు వద్ద పి.ఏ.గా చేసి, అక్కడ నచ్చక మద్రాసు వెళ్ళిపోయారు. అక్కడ ఎం.జి.ఆర్.ని కలిసి ఆయన కోసం రాసిన ఒక కథను వినిపించారు. అది ఎం.జి.ఆర్. గారికి నచ్చడంతో "తేడివంద మాప్పిళ్ళై"పేరుతో సినిమా తీశారు. అది విజయవంతం అయ్యింది. ఆ తర్వాత దాదాపు 10 వరకు తమిళ చిత్రాలకి కథ, స్క్రీన్ ప్లే అందించారు. సుమారు 1000 చిత్రాలకు రచన చేశారు. అంతే కాకుండా ఎంకన్న బాబు, మామా కోడలు, పెళ్ళిచేసి చూపిస్తాం , "పుదియ సంగమం" అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. చదువు సంస్కారం, నిజం నిద్రపోదు (1976), ఓ ప్రేమ కథ (1987) చిత్రాలకు దర్శకత్వం వహించారు. మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం గీతాంజలికి మాటలు రాశారు. మట్టిలో మాణిక్యం, బంగారు గాజులు చిత్రాలకు బంగారు నంది బహుమతులు అందుకున్నారు. రాజశ్రీ రచించిన చివరి చిత్రం ప్రేమికుడు. 1994 ఆగస్టు 14 న నిదురలోనే మరణించాడు.
అతని కుమారుడు రాజశ్రీ సుధాకర్ ఏవిఎమ్ వారి విక్రమ్ నటించిన జెమిని, సూర్య నటించిన వీడొక్కడే, లక్ష్మి గణపతి ఫిలిమ్స్ వారి అర్జున్ నటించిన సింగమలై వంటి కొన్ని తమిళ అనువాద చిత్రాలకు, మరి కొన్ని ఆంగ్ల అనువాద చిత్రాలకు మాటలూ,హృతిక్ రోషన్ నటించిన క్రిష్ , జోధా అక్బర్, ధూమ్-2, అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో రేస్, వంటి ఎన్నో హిందీ అనువాద చిత్రాలకు మాటలు-పాటలు రాశాడు.
చిత్రసమాహారం[మార్చు]
కొన్ని ముఖ్యమైన చిత్రాలు[మార్చు]
- శ్రీ సింహాచల క్షేత్ర మహిమ (1965)
- పెళ్ళి పందిరి (1966)
- పెళ్ళి రోజు (1968) (గీతరచన)
- బంగారు గాజులు (1968) (కథా రచన)
- సత్తెకాలపు సత్తెయ్య (1969)
- సంబరాల రాంబాబు (1970)
- మట్టిలో మాణిక్యం (1971)
- బుల్లెమ్మ బుల్లోడు (1971) (గీతరచన)
- దేవుడమ్మ (1973)
- తులాభారం (1974)
- చదువు సంస్కారం (1975) (కథ, మాటలు, పాటలు, చిత్రానువాదం, దర్శకత్వం)
- అర్జున గర్వభంగం (1979) (మాటలు, పాటలు) (అనువాదం - కన్నడ)
- స్వయంవరం (1982)
- ఖైదీ (1983)
- డార్లింగ్ Darling డార్లింగ్ (1983)
- ప్రేమసాగరం (1983) (అనువాదం - తమిళం)
- మౌన రాగం (1986) (అనువాదం - తమిళం)
- నాయకుడు (1987) (అనువాదం - తమిళం)
- విచిత్ర సోదరులు (1989) (అనువాదం - తమిళం)
- ప్రేమ పావురాలు (1989) (అనువాదం - హిందీ)
- గీతాంజలి (1989)
- చిలిపి సంసారం (1990) (అనువాదం - తమిళం)
- దళపతి (1992) (అనువాదం - తమిళం)
- జంటిల్ మేన్ (1993) (అనువాదం - తమిళం)
- ప్రేమికుడు (1994) (అనువాదం - తమిళం)
- మైఖేల్ మదన కామరాజు (అనువాదం - తమిళం)
- ఘర్షణ (పాతది) (అనువాదం - తమిళం)
- వైశాలి ( అనువాదం- మళయాళం)
- ఆడదాని అదృష్టం (మాటలు)
- పరువు ప్రతిష్ట
- కన్నవారి కలలు
- బంగారు గాజులు
కొన్ని ఆణిముత్యాలు[మార్చు]
- కురిసింది వాన నా గుండెలోన... - బుల్లెమ్మ బుల్లోడు
- యమునాతీరాన రాధ మదిలోన... - గౌరవం-అనువాదం
- సింహాచలము మహా పుణ్య క్షేత్రము... - సింహాచల క్షేత్రమహిమ
- మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట... - మట్టిలో మాణిక్యం
- నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి... సత్తెకాలపు సత్తెయ్య
- మామా చందమామ విన రావా... సంబరాల రాంబాబు
- ఎక్కడో దూరాన కూర్చున్నావు... దేవుడమ్మ
- నిన్ను తలచి మైమరచా... - విచిత్ర సోదరులు
- మధువొలకబొసే ఈ ఛిలిపి కళ్ళు- కన్నవారి కలలు
- రాధకు నీవేర ప్రాణం - తులాభారం
- నీ నీడగా నన్ను కదలాడనీ
- ఇదే నా మొదటి ప్రేమ లేఖ -స్వప్న
- ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే -మాదైవం
- ఇది పాట కానే కాదు-తలంబ్రాలు
మూలాలు[మార్చు]
- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
యితర లింకులు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- Wikipedia articles with MusicBrainz identifiers
- తెలుగు సినిమా పాటల రచయితలు
- 1934 జననాలు
- 1994 మరణాలు
- తెలుగు సినిమా రచయితలు
- 1933 జననాలు
- తెలుగు కళాకారులు
- తెలుగు సినిమా వ్యాసాల విస్తరణ ప్రాజెక్టు
- విజయనగరం జిల్లా సినిమా రచయితలు