సంబరాల రాంబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంబరాల రాంబాబు
(1970 తెలుగు సినిమా)
Sambarala Rambabu (1970).jpg
దర్శకత్వం జి.వి.ఆర్.శేషగిరిరావు
నిర్మాణం చలం
తారాగణం చలం,
శారద,
అల్లు రామలింగయ్య,
గీతాంజలి
సంగీతం వి.కుమార్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల
గీతరచన రాజశ్రీ
నిర్మాణ సంస్థ లక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సంబరాల రాంబాబు 1970 లో విడుదలైన సినిమా. జివిఆర్ శేషగిరి రావు దర్శకత్వం వహించాడు. లక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై టి. మోహన్ రావు నిర్మించాడు. ఇది కె. బాలచందర్ దర్శకత్వంలో 1968 లో వచ్చిన తమిళ చిత్రం ఎతిర్ నీచల్కు రీమేక్. ఈ చిత్రంలో చలం, శారద, ఎస్.వి.రంగారావు నటించారు.

ఈ సినిమాలో ఎస్వీ రంగారావు వంటవాడు నాయర్ పాత్ర ధరించాడు. నాటకంలో ఈ పాత్ర పోషించిన రామన్ చిత్రీకరణను పర్యవేక్షించేవాడు. ఓ పాట చిత్రీకరణ సమయంలో, రంగారావు నృత్యం చేయాలని రామన్ సూచించినప్పుడు రంగారావు నిరాకరించాడు. అతడు కొన్ని కామిక్ కదలికలు మాత్రమే చేయాల్సి ఉందని రామన్ రావుకు చెప్పినపుడూ అతడు ఒప్పుకున్నాడు. ఈ విభాగం ప్రజాదరణ పొందింది.[1]  

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  • మామా చందమామా వినరా నా కథ - మగ గొంతుతో ఉన్న ఈ పాటను బాలసుబ్రమణ్యం, ఆడ గొంతుతో అదే పాటను పి.సుశీల పాడారు.
  • జీవితమంటే అంతులేని ఒక పోరాటం
  • విన్నారా విన్నారా.. ఈ చిత్రం కన్నారా... సంబరాల రాంబాబు శ్రీమంతుడయ్యాడు - రమోల

మూలాలు[మార్చు]

  1. Krishnamachari, Suganthy (19 May 2016). "Spotlight on 'Edirneechal' Raman". The Hindu. Retrieved 3 April 2018.